పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు…చెల్లెలు అంత్యక్రియలు ముగించిన అన్న స్నానానికి వెళ్లగా
విధి మనుషుల జీవితాలతో ఎలా ఆటలాడుతుందో చెప్పడానికి ఇప్పుడు చెప్పబోయే ఘటనను ఉదాహారణగా చెప్పొచ్చు. ఒక దెబ్బ నుంచి కోలుకోకముందే మరుసటి రోజే మరో బాధను ఆ కుటుంబంలో నింపింది.
విధి మనుషుల జీవితాలతో ఎలా ఆటలాడుతుందో చెప్పడానికి ఇప్పుడు చెప్పబోయే ఘటనను ఉదాహారణగా చెప్పొచ్చు. ఒక దెబ్బ నుంచి కోలుకోకముందే మరుసటి రోజే మరో బాధను ఆ కుటుంబంలో నింపింది. చెల్లెలు చనిపోగా..ఆమె దహనసంస్కారాలు ముగించి చెరువులోకి స్నానానికి వెళ్లిన అన్న జేసీబీ గుంత కారణంగా నీటిలో మునిగి ప్రాణాలు విడిచాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకుంది. కుటుంబ సభ్యుల ముందే ఈ ఘటన జరగడం మరింత ఆవేదన కలిగించే విషయం. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని మహ్మద్‌నగర్‌లో సోమవారం ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
వివరాల వెళ్తే.. మహ్మద్‌నగర్ గ్రామానికి చెందిన చాకలి గంగయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉంది. కూతురు అరుణ (30) అందురాలు. ఇంట్లోనే ఉంటుంది. అనారోగ్య కారణాలతో ఆమె ఆదివారం మృతి చెందింది. సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల అనంతరం దగ్గర్లోని చెరువు వద్దకు అందరూ స్నానానికి వెళ్లారు. స్నానం చేసే క్రమంలో చనిపోయిన యువతి అన్న నర్సింహులు(38) లోనికి దిగాడు. లోపల జేసీబీ గుంత గమనించక పోవడంతో నీటిలో మునిగిపోయాడు. ఈత రాకపోవడంతో ఊపిరాడక చనిపోయాడు. మృతునికి భార్య నర్సామ్మతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒకే కుటుంబంలో రెండు రోజులలో ఇద్దరు చనిపోవడంతో కుటుంబంలో, గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.