ప్రిన్సిపాల్ గారూ..! సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు..పిల్లల ముందు చేసేది ఇలాంటి పనులేనా?

ఓ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్ దారితప్పారు. క్రమశిక్షణ, నైతిక విలువల గురించి పిల్లలకు చెప్పాల్సిన ఆమె..గర్వం ప్రదర్శించారు. హౌస్‌కీపింగ్‌ స్టాఫ్ అంటే సహజంగా స్కూల్ క్లాసు రూమ్‌లను శుభ్రం చేయడం.....

ప్రిన్సిపాల్ గారూ..! సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు..పిల్లల ముందు చేసేది ఇలాంటి పనులేనా?
Follow us

|

Updated on: Dec 15, 2020 | 2:42 PM

ఓ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్ దారితప్పారు. క్రమశిక్షణ, నైతిక విలువల గురించి పిల్లలకు చెప్పాల్సిన ఆమె..గర్వం ప్రదర్శించారు. హౌస్‌కీపింగ్‌ స్టాఫ్ అంటే సహజంగా స్కూల్ క్లాసు రూమ్‌లను శుభ్రం చేయడం, పాఠశాల ఆవరణలో చెత్తాచెదారం లేకుండా చూడడం, టాయిలెట్లను క్లీన్‌ చేయడం వంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ ఓ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ మాత్రం తన కాళ్లు కూడా ఒత్తితేనే ఉద్యోగం ఉంటుందని హుకుం జారీ చేశారు. దీంతో అసలే కరోనా సమయంలో ఉద్యోగం పోతే ఇబ్బందులు ఎదురవుతాయనే భయంతో సదరు హౌస్‌కీపింగ్‌ సిబ్బంది రోజూ ప్రిన్సిపాల్‌ కాళ్లు ఒత్తుతున్నారు. మరో ఉద్యోగి కూడా ఇదే తరహా సేవలు చేయించుకుంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం అల్గోల్‌లోని మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో శానిటరీ పనుల కోసం హౌస్‌ కీపింగ్‌ స్టాఫ్‌ను ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిలో పెట్టుకున్నారు. వీరిలో ఓ ఇద్దరు మహిళలు తమ పనులు చేస్తూనే… రోజూ ప్రిన్సిపాల్‌ జ్యోతిర్మయి కాళ్లు పట్టాలన్నది నిబంధన. పాఠశాల ఆవరణలోనే ఈ తంతు రోజూ జరుగుతుంది. ఇదే స్కూల్‌లో కీలక విధులు నిర్వర్తిస్తున్న మరో ఉద్యోగి కూడా  హౌస్‌కీపింగ్‌ స్టాఫ్‌తో కాళ్లు ఒత్తించుకోవడం కెమెరాకు చిక్కింది. దీనిపై స్పందించేందుకు ప్రిన్సిపాల్ జ్యోతిర్మయి నిరాకరించారు.

Also Read : గూడు కట్టుకుంటున్న బాతుకు బాలుడి సాయం..సోషల్ మీడియాలో వైరలవుతోన్న వీడియో..ఓ రేంజ్‌లో లైక్స్, షేర్స్