Budget Facts: కేంద్ర బడ్జెట్.. మాజీ ప్రధాని రికార్డును సమం చేసిన నిర్మలమ్మ.. మీరు తెలుసుకోవాల్సిన 10 ఆసక్తికర విషయాలు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం(ఫిబ్రవరి 01)నాడు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా ఆరోవసారి ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం విశేషం. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనతను నిర్మలా సీతారామన్ సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దేశ బడ్జెట్‌కు సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన 10 ఆసక్తికర విషయాలు..

Budget Facts: కేంద్ర బడ్జెట్.. మాజీ ప్రధాని రికార్డును సమం చేసిన నిర్మలమ్మ.. మీరు తెలుసుకోవాల్సిన 10 ఆసక్తికర విషయాలు
Union Budget
Follow us

|

Updated on: Feb 01, 2024 | 11:12 AM

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం(ఫిబ్రవరి 01)నాడు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా ఆరోవసారి ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం విశేషం. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనతను నిర్మలా సీతారామన్ సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దేశ బడ్జెట్‌కు సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన 10 ఆసక్తికర విషయాలు..

  1. స్వతంత్ర భారత్‌లో తొలి కేంద్ర బడ్జెట్‌ను 1947 నవంబరు 26న నాటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు.
  2. దేశంలో అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌దే. ఆయన అత్యధికంగా 10సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1962-69 మధ్య కాలంలో ఆయన ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధానిగా మాత్రం ఆయన బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేదు.
  3. మొరార్జీ దేశాయ్ తర్వాత పి చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, యశ్వంత్ సిన్హా 8 సార్లు, మన్మోహన్ సింగ్ 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటి వరకు ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
  4. వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును నిర్మలా సీతారామన్ 2024 ఫిబ్రవరి 1న (గురువారం) సమం చేశారు. గతంలో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హ, అరుణ్ జైట్లీలు వరుసగా ఐదుసార్లు బడ్జెట్ సమర్పించగా.. నిర్మలా సీతారామన్ వరుసగా ఆరు బడ్జెట్‌లు ప్రవేశపెట్టి వారిని అధిగమించారు.
  5. ముగ్గురు ప్రధానులు ప్రధానమంత్రి పదవిలో ఉండి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలకు ఈ ఘనత సాధించారు.
  6. బ్రిటిష్ కాలం నుంచి 1999 వరకు ఫిబ్రవరి చివరి పనిదినాన సాయంత్రం 5 గం.లకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. అయితే ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పాత సాంప్రదయాన్ని మార్చి ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టడం మొదలుపెట్టారు.
  7. 2017 వరకు బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి పనిదినం రోజున ప్రవేశపెట్టేవారు. అయితే 2017 నుంచి దీన్ని ఫిబ్రవరి 1కి మార్చారు. నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీన్ని ప్రారంభించారు.
  8. 2017కు ముందు వరకు వార్షిక బడ్జెట్, రైల్వే బడ్జెట్‌ను విడివిడిగా ప్రవేశపెట్టేవారు. అయితే 2017లో రైల్వే బడ్జెట్‌ను కూడా వార్షిక బడ్జెట్‌లో విలీనం చేసి ఒకే బడ్జెట్‌గా ప్రవేశపెడుతున్నారు.
  9. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం సుదీర్ఘమైంది. రెండు గంటల 42 నిమిషాల పాటు ఈ ప్రసంగం సాగింది. 2021 ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోవిడ్ కారణంగా తొలిసారిగా పేపర్‌లెస్ బడ్జెట్‌ను సమర్పించారు.
  10. ఇప్పటి వరకు ఇద్దరు మహిళలు మాత్రమే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత సాధించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళ ఇందిరా గాంధీ. 1970-71లో ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2019లో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళగా గుర్తింపు సాధించారు.