Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏమిటీ..? జనవరి 1 నుంచి జారీ చేయనున్న ఎస్బీఐ..

Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయడానికి ప్రభుత్వం ఎస్బీఐకి అనుమతులు జారీ చేసింది. జనవరి 1, 2022 నుంచి

Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏమిటీ..? జనవరి 1 నుంచి జారీ చేయనున్న ఎస్బీఐ..
Money
Follow us
uppula Raju

|

Updated on: Dec 31, 2021 | 7:16 PM

Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయడానికి ప్రభుత్వం ఎస్బీఐకి అనుమతులు జారీ చేసింది. జనవరి 1, 2022 నుంచి జనవరి 10 వరకు జారీ చేస్తుంది. ఎస్‌బీఐకి తన 29 అధీకృత శాఖల ద్వారా ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసేందుకు అధికారం ఉందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్లు జారీ చేసిన తేదీ నుంచి 15 రోజుల వరకు చెల్లుబాటులో ఉంటాయి. ఎలక్టోరల్ బాండ్ చెల్లుబాటు వ్యవధి తర్వాత డిపాజిట్ చేస్తే ఏ రాజకీయ పార్టీకి క్రెడిట్‌ కాదు. అర్హత కలిగిన రాజకీయ పార్టీ తన ఖాతాలో జమ చేసిన ఎలక్టోరల్ బాండ్‌ని అదే రోజున జమ చేస్తారు. జనవరి 2, 2018 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా భారత ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్లను నోటిఫై చేసిందని ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. స్కీమ్ నిబంధనల ప్రకారం.. ఎలక్టోరల్ బాండ్లను భారత పౌరుడు లేదా భారతదేశంలో విలీనం చేసిన వ్యక్తి కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. ఒక వ్యక్తి ఎలక్టోరల్ బాండ్లను ఒంటరిగా లేదా ఇతరులతో కలిసి కొనుగోలు చేయవచ్చు.

ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏమిటి? ఎలక్టోరల్ బాండ్ అంటే కరెన్సీ నోటులా రాయబడిన ఒక బాండ్. వ్యక్తులు, సంస్థలు, సంస్థల తరపున రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఈ బాండ్లను ఉపయోగించవచ్చు. మొదటి దశలో ఎలక్టోరల్ బాండ్ల విక్రయం 2018 మార్చి 1 నుంచి 10 వరకు జరిగింది.

ఎలక్టోరల్ బాండ్ల ముఖ్యాంశాలు.. 1. ఎలక్టోరల్ బాండ్లను రూ. 1000, రూ. 10,000 రూ. 1 లక్ష, రూ. 1 కోటి గుణిజాలలో కొనుగోలు చేయవచ్చు. 2. ఈ బాండ్లు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన SBI శాఖలలో అందుబాటులో ఉంటాయి. 3. ఎలక్టోరల్ బాండ్లను KYC ధృవీకరించిన ఖాతాదారులు మాత్రమే కొనుగోలు చేయవచ్చు. 4. బాండ్ కొనుగోలు చేసిన తేదీ నుంచి 15 రోజులలోపు కంట్రిబ్యూటర్లు ఈ బాండ్లను తమకు నచ్చిన పార్టీకి అందించాలి. 5. రాజకీయ పార్టీ ఈ బాండ్‌ను బ్యాంకులో ధృవీకరించబడిన ఖాతా ద్వారా నగదు చేస్తుంది. 6. బాండ్‌పై దాత పేరు ఉండదు దాని వివరాలు బ్యాంకు వద్ద మాత్రమే ఉంటాయి. 7. ఈ బాండ్లపై బ్యాంకు ఎలాంటి వడ్డీని చెల్లించదు. 8. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి త్రైమాసికం ప్రారంభంలో 10 రోజుల పాటు బాండ్లను కొనుగోలు చేయవచ్చు. 9. ఎలక్టోరల్ బాండ్లను జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ మొదటి 10 రోజులలో కొనుగోలు చేయవచ్చు.

ACC U19 Asia Cup 2021: ఆసియాకప్‌లో భారత్‌ జోరు.. ఫైనల్‌లో శ్రీలంక చిత్తు చిత్తు.. హ్యాట్రిక్ రికార్డు

ముఖంపై ముడతలు రావొద్దంటే రోజు ఈ టీ తాగితే చాలు..! యవ్వనంగా కనిపిస్తారు..

కొబ్బరినూనెతో గర్భిణులకు చాలా మేలు.. ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?