AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ACC U19 Asia Cup 2021: ఆసియాకప్‌లో భారత్‌ జోరు.. ఫైనల్‌లో శ్రీలంక చిత్తు చిత్తు.. హ్యాట్రిక్ రికార్డు

ACC U19 Asia Cup 2021: యూఏఈ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియాకప్‌లో భారత్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. యశ్ ధుల్

ACC U19 Asia Cup 2021: ఆసియాకప్‌లో భారత్‌ జోరు.. ఫైనల్‌లో శ్రీలంక చిత్తు చిత్తు.. హ్యాట్రిక్ రికార్డు
India
uppula Raju
|

Updated on: Dec 31, 2021 | 6:59 PM

Share

ACC U19 Asia Cup 2021: యూఏఈ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియాకప్‌లో భారత్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. యశ్ ధుల్ సారథ్యంలో టీమ్ ఇండియా అండర్-19 ఆసియా కప్ విజేతగా నిలిచింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో టీమిండియా 9 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. వర్షం ప్రభావంతో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 38 ఓవర్లలో 106 పరుగులు మాత్రమే చేసింది. దీనికి సమాధానంగా టీమిండియా కేవలం ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం అంగ్క్రిష్ రఘువంశీ, షేక్ రషీద్‌ల అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత జట్టు 38 ఓవర్లలో 102 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. భారత్ కేవలం 8 పరుగులకే ఓపెనర్ హర్నూర్ సింగ్ వికెట్ కోల్పోయింది. అయితే దీని తర్వాత అంగ్క్రిష్ రఘువంశీ నాటౌట్ 56, షేక్ రషీద్ 31 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. వీరిద్దరి మధ్య రెండో వికెట్‌కు 96 పరుగుల అజేయ భాగస్వామ్యం ఉంది. ముఖ్యంగా ఎడమచేతి వాటం స్పిన్నర్ విక్కీ ఓస్త్వాల్, ఆఫ్ స్పిన్నర్ కౌశల్ తాంబే శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లకు ఊపిరి పీల్చుకోనివ్వలేదు. విక్కీ ఓస్త్వాల్ 8 ఓవర్లలో 11 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అతను 3 ఓవర్ మెయిడిన్ చేశాడు. కౌశల్ తాంబే కూడా 6 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. రాజ్యవర్ధన్, రవికుమార్, రాజ్ బావా 1-1 వికెట్లు తీశారు.

భారత్ 8వ సారి ఛాంపియన్‌గా నిలిచింది అండర్-19 ఆసియా కప్‌లో భారత జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. టీం ఇండియా 8వ సారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. ఈ టోర్నీని భారత్ తొలిసారిగా 1989లో గెలుచుకుంది. తరువాత, 2003 లో, 2012లో పాకిస్థాన్‌తో ట్రోఫీని పంచుకుంది. ఆ తర్వాత 2013, 2016లో కూడా భారత్ ఈ టోర్నీని కైవసం చేసుకుంది. 2017లో ఆఫ్ఘనిస్తాన్ ఛాంపియన్‌గా అవతరించింది. ఇప్పుడు 2018, 2019, ఇప్పుడు 2021లో ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచి టీమ్ ఇండియా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది.

అండర్-19 ఆసియాకప్‌లో భారత్‌ జర్నీ ఈ టోర్నీలో భారత్ 5 మ్యాచ్‌లు ఆడగా ఒకదానిలో మాత్రమే ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య యూఏఈని భారత్ 154 పరుగుల తేడాతో ఓడించింది. ఆ తర్వాత పాకిస్థాన్‌పై 2 వికెట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత పునరాగమనం చేసిన టీమిండియా 4 వికెట్ల తేడాతో అఫ్ఘానిస్థాన్‌పై విజయం సాధించింది. సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను 103 పరుగుల తేడాతో ఏకపక్షంగా ఓడించి, ఫైనల్‌లో 9 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి 8వసారి ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

ముఖంపై ముడతలు రావొద్దంటే రోజు ఈ టీ తాగితే చాలు..! యవ్వనంగా కనిపిస్తారు..

కొబ్బరినూనెతో గర్భిణులకు చాలా మేలు.. ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం..

ఒక్క మూలిక లాభాలు అనేకం.. రుచి కొంచెం ఘాటుగా ఉన్నా లివర్, కిడ్నీ సమస్యలకు దివ్య ఔషధం..