IND vs SA: వన్డే సిరీస్‎లో రోహిత్ శర్మ ఆడతాడా.. బీసీసీఐ ఏం చెబుతుంది..

తొడ కండరాల గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమైన రోహిత్ శర్మకు రాబోయే 24 గంటలు చాలా కీలకం కానున్నాయి...

IND vs SA: వన్డే సిరీస్‎లో రోహిత్ శర్మ ఆడతాడా.. బీసీసీఐ ఏం చెబుతుంది..
టీమిండియాలో సిక్సర్ల రారాజు అంటే ఠక్కున గుర్తొచ్చేది రోహిత్ శర్మ. ఇప్పుడు ఓ యువ ప్లేయర్ హిట్‌మ్యాన్‌ను పడగొట్టి నయా సిక్సర్ల కింగ్‌గా అవతరించాడు. ఈ ఏడాది అతడే అత్యధిక సిక్సర్లు బాదేశాడు. అతడు యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్.. ఈపాటికి మీకు అర్ధమై ఉంటుంది. ఎవరో కాదు రిషబ్ పంత్.
Follow us

|

Updated on: Dec 31, 2021 | 7:34 PM

తొడ కండరాల గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమైన రోహిత్ శర్మకు రాబోయే 24 గంటలు చాలా కీలకం కానున్నాయి. రోహిత్ శర్మ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. అక్కడ అతను ఫిట్‌నెస్ తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు. రోహిత్ శర్మ గాయం నయమైనట్లు తెలిసింది. అయితే అతను ఇంకా తన ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదు. ‘రోహిత్ శర్మ తన గాయం నుండి కోలుకున్నాడు. ప్రాథమిక ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. అయితే అతను ఇంకా చివరి ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదు.’ అని ఓ నివేదిక తెలిపింది. రోహిత్ శర్మ పూర్తిగా కోలుకుంటున్నాడని మరో 24 గంటల్లో రోహిత్ శర్మపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది.

రోహిత్ శర్మ పూర్తిగా ఫిట్‌గా లేనందున, దక్షిణాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు టీమ్ ఇండియాను ఇంకా ప్రకటించలేదు. రోహిత్ శర్మ ఫిట్‌నెస్ పరీక్ష తర్వాతే భారత జట్టును ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే రోహిత్ శర్మ ఫిట్‎గా లేకుంటే వన్డే సిరీస్‎లో కేఎల్ రాహుల్ కెప్టెన్‎గా వ్యవహరిస్తాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

Read Also.. Yuvraj Singh: వైరల్ అయిన సానియా మీర్జా వీడియో.. స్పందించిన యువరాజ్ సింగ్..