AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొబ్బరినూనెతో గర్భిణులకు చాలా మేలు.. ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం..

Coconut Oil: మహిళలకు తల్లిగా మారడం ఒక అందమైన అనుభూతి. కానీ గర్భధారణ సమయంలో మహిళలు చాలా దశలను దాటవలసి ఉంటుంది.

కొబ్బరినూనెతో గర్భిణులకు చాలా మేలు.. ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం..
Pregnant Lady
uppula Raju
|

Updated on: Dec 31, 2021 | 6:01 PM

Share

Coconut Oil: మహిళలకు తల్లిగా మారడం ఒక అందమైన అనుభూతి. కానీ గర్భధారణ సమయంలో మహిళలు చాలా దశలను దాటవలసి ఉంటుంది. ప్రతి అలవాటును మార్చుకోవాలి. ఏం తినాలి, ఏ వైపు పడుకోవాలి, ఎంత తినాలి ఇలా అన్నీ జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని చిన్న చిన్న టిప్స్‌ పాటిస్తే వారి కష్టాలు కొంతమేరకు తగ్గుతాయి. కొబ్బరినూనె వారి అనేక సమస్యలకు చక్కటి పరిష్కారమని చెప్పవచ్చు. గర్భధారణ సమయంలో కొబ్బరి నూనెను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

1. ఆహారంలో ఉపయోగించండి కొబ్బరి నూనెను ఆహారంలో ఉపయోగించడం వల్ల నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నమ్ముతారు. దీంతో పాటు కొబ్బరి నూనె నుంచి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. దీన్ని నిరంతరం తీసుకోవడం వల్ల పుట్టిన బిడ్డకు వెంట్రుకలు బాగుంటాయని, గర్భిణికి కూడా జుట్టు రాలిపోయే పరిస్థితి ఎదురవదని నిపుణులు చెబుతున్నారు.

2. స్ట్రెచ్ మార్క్స్ గర్భిణీల ప్రధాన ఆందోళనలలో స్ట్రెచ్ మార్క్స్ ఒకటి. గర్భధారణ తర్వాత స్ట్రెచ్ మార్క్‌లను తొలగించడానికి మహిళలు అనేక రకాల విధానాలను ఉపయోగిస్తారు. కానీ వారు ఆశించిన ఫలితాలను పొందలేరు. అయితే కొబ్బరి నూనె సహాయంతో మీరు చాలా వరకు స్ట్రెచ్ మార్క్స్ గుర్తులను వదిలించుకోవచ్చు. ప్రతిరోజు పొట్టపై ​​మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా చేస్తే గర్భధారణ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ గుర్తులను తొలగించడంలో కొబ్బరినూనె ప్రభావవంతంగా పనిచేస్తుంది.

3. ఆయిల్ పుల్లింగ్ దీనిని కొబ్బరి నూనెతో మౌత్ వాష్ అంటారు. గర్భధారణ సమయంలో రుచి కోల్పోతే కొబ్బరి నూనెతో పుక్కిలించడం మంచిది. ఇలా చేయడం వల్ల స్త్రీల మూడ్ బాగవుతుంది. ఇతర ఆహారాలను తినడానికి ఇష్టపడుతారని వైద్యనిపుణులు చెబుతున్నారు.

4. దురద కోసం గర్భధారణ సమయంలో దాదాపు 25 శాతం మంది మహిళల్లో అలర్జీ సమస్య ఉంటుంది. మీరు గర్భధారణకు ముందు అలెర్జీని కలిగి ఉంటే గర్భధారణ సమయంలో మీకు వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయి. శరీర దురదను తొలగించడానికి డాక్టర్ లేదా నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం. అయితే శరీరానికి స్నానం చేసిన తర్వాత కొబ్బరినూనెను రాసుకుంటే దురద నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు పరుపు, బెడ్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి. వారానికి ఒకసారి బెడ్‌ షీట్లను వేడి నీటితో ఉతకాలి. కిటికీలు తలుపులు మూసిఉంచాలి.

ఒక్క మూలిక లాభాలు అనేకం.. రుచి కొంచెం ఘాటుగా ఉన్నా లివర్, కిడ్నీ సమస్యలకు దివ్య ఔషధం..

పండ్లు తింటే ప్రయోజనమే కాదు నష్టాలు కూడా..! ఈ విషయం తెలిస్తే నిజమే అంటారు..?

ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్ ది ఇయర్‌ రేసులో పాకిస్తాన్‌ ప్లేయర్స్‌.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే..?