Coffee for Anti aging: చిన్న వయసులోనే వృద్ధాప్య ముంచుకొస్తుందా? అయితే రోజూ 2 కాఫీ కప్పులు లాగించేయండి
నేటి ఒత్తిడితో కూడిన జీవితం కారణంగా చాలా మంది వృద్ధాప్యం కాస్త ముందుగానే ముంచుకొస్తుంది. 30-35 సంవత్సరాల వయస్సులోనే 40-50 లాగా కనిపించడం ఆందోళనకరంగా మారుతుంది. జీవనశైలి, ఒత్తిడి దీనికి ప్రధాన కారణం. ఇటువంటి పరిస్థితిలో అకాల వృద్ధాప్య నివారించాలంటే కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. మరికొన్నింటిని అలవాటు చేసుకోవాలి..

మనలో చాలా మంది కాఫీ తాగే అలవాటు కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఇదే అకాల వృద్ధాప్యాన్ని నివారించే బ్రాహ్మాస్ట్రం అని నిపుణులు అంటున్నారు. కాఫీ నాలుకకు రుచికరంగా ఉండటమే కాకుండా వృద్ధాప్యాన్ని ఎదుర్కోవడానికి కూడా శక్తి వంతంగా ఉంటుందని అంటున్నారు. కాఫీ తాగడం ద్వారా, యవ్వనంగా కనిపించవచ్చని తాజా పరిశోధనల్లో తేలింది.
పరిశోధన ఏం చెబుతోంది?
యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజూ కాఫీ తాగడం వల్ల అకాల వృద్ధాప్య ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఈ అధ్యయనం నెదర్లాండ్స్‌లో 55 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులపై చేయడం జరిగింది. ఈ వ్యక్తులకు ప్రతిరోజూ 2 నుంచి 4 కప్పుల కాఫీ అందించారు. అయితే కాఫీ తీసుకున్న వ్యక్తులలో శారీరక బలహీనత లక్షణాలు తగ్గుదల కనిపించడం పరిశోధకులు గుర్తించారు. ఇది వారి చర్మంలో తాజాదనం స్పష్టంగా కనిపించింది.
కాఫీకి వృద్ధాప్యాన్ని నిరోధించే శక్తి ఉందని, ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వృద్ధాప్యాన్ని నివారిస్తాయని చెబుతున్నారు. ఇది కండరాలను రక్షించడంలో, జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుందని చెబుతున్నారు. ఇవన్నీ వృద్ధాప్యంలో శారీరక క్షీణతను నివారించడంలో సహాయపడతాయి. మైక్రోబియల్ సెల్‌లో ప్రచురించబడిన మరొక పరిశోధన ప్రకారం.. కాఫీలోని కెఫిన్ కొన్ని కణాల జీవితకాలం పెంచుతుంది. DNA నష్టాన్ని సరిచేయడంలో సహాయపడుతుంది.
పరిశోధకులు ఈస్ట్ కణాలపై నిర్వహించిన ప్రయోగంలో కణాలు ఇప్పటికే ఆరోగ్యంగా ఉంటే, కెఫిన్ ఆ కణాల జీవితకాలాన్ని పొడిగించగలదని కనుగొన్నారు. కానీ ఒక కణం DNA ఇప్పటికే దెబ్బతిన్నట్లయితే, కెఫిన్ దానిని మరింత దిగజార్చుతుందట. శరీర అంతర్గత స్థితి బాగా లేకుంటే, కాఫీ సరిచేయగల దానికంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే ఈ విషయంలో కాఫీని కాస్త ఆచితూచి తీసుకోవడం మంచిది. మైక్రోబియల్ సెల్‌లో ప్రచురితమైన ఓ పరిశోధన నివేదిక ప్రకారం.. ఆరోగ్యంగా ఉండాలటే రోజుకు 2 నుంచి 4 కప్పుల కాఫీ తాగడం మంచిదని చెబుతున్నారు. ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింప చేస్తుందట. కానీ కాఫీ తీసుకునే ముందు మీ శరీరంలో ఏదైనా సమస్య ఉంటే ముందుగా వైద్యుడిని సంప్రదించడం మంచిది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.