Love: ఇలా చేస్తే మనది ప్రేమ లేక వ్యామోహమో అన్నది తెలిసిపోతుందట..
ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలు.. ఇవన్నీ సినిమా డైలాగులు. నిజజీవితంలోనూ ఇవి జరుగుతుంటాయి. కానీ ఎదుటి వారు మనల్ని ప్రేమిస్తున్నారా లేదా అన్నది తెలుసుకోవడం ఎలా..?
ప్రేమ అనేది ఓ అందమైన భావన.. ప్రేమ అనేది ఎప్పుడు.. ఎవరి మధ్య కలుగుతుందో చెప్పలేం.. ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలు.. ఇవన్నీ సినిమా డైలాగులు. నిజజీవితంలోనూ ఇవి జరుగుతుంటాయి. కానీ ఎదుటి వారు మనల్ని ప్రేమిస్తున్నారా లేదా అన్నది తెలుసుకోవడం ఎలా..? అసలు ఎదుటివారి మనల్ని ప్రేమిస్తున్నారా లేక అది కేవలం ఆకర్షణేనా అనేది చాలా మంది లో మెదిలే ప్రశ్న. ప్రేమ అనగానే మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కలిసి తిరగడం, ఒకరికాళ్ళలోకి ఒకరు చూస్తూ లోకాన్ని మర్చిపోవడం. లేదా ఒంటరిగా కూర్చొని తమ ప్రేయసి, లేదా ప్రేమికుడిని తలుచుకొని ఆనందపడటం. మనకు తెలియకుండానే పెదవులపై చిరునవ్వు చిగురించడం లాంటివి చేస్తుంటారు. ప్రేమలో పడిన మొదట్లో అందరిలో ఇవి కనిపిస్తాయి.
ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండాలి అంటే అది అనుబంధంగా మారాలి. అప్పుడే ప్రేమ ఇద్దరి మధ్య తగ్గిపోకుండా ఒకేలా ఉంటుంది. అదే అనుబంధం ఏర్పడకపోతే ప్రేమ ఎక్కువ రోజులు నిలవదు. ప్రేమలో పడిన మొదట్లో అది వ్యామోహమో, ప్రేమో కనిపెట్టడం కష్టమే.. అది తెలుసుకోవాలంటే.. కొద్దీ రోజులు ఎదురుచూడాలి..అప్పుడే ఎదుటివారిపై కలిగిన ఆకర్షణలో ఒక క్లారిటీ వస్తుంది. ఎన్నిరోజులు గడిచినా తొలిరోజు కలిగిన ఆకర్షణలాంటి భావనే కలిగితే వారిలో ప్రేమ పుట్టినట్టే. అలా కాకుండా మొదట్లో చూసినంత ఫీలింగ్ కొద్దిరోజుల తర్వాత చూసినప్పుడు కలగకపోతే అది ప్రేమ కాదనే చెప్పాలి. మనం ప్రేమించిన వాళ్ళను ఎన్ని రోజులైనా.. ఎన్ని ఏడాదుల తర్వాత చూసిన ఒకే లాంటి ఫీలింగ్ కలుగుతోంది. అదే నిజమైన ప్రేమ.