AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Myositis: సమంతకొచ్చిన అరుదైన వ్యాధికి డైట్‌తో చెక్‌ పెట్టలేమా.? వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..

నటి సమంత ఏమంటూ తాను మయోసిటిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నానని ప్రకటించారో అప్పటి నుంచి ఈ అంశం ట్రెండ్‌ అవుతూనే ఉంది. ఇంతకీ సమంతకు ఏమైంది.? అసలు ఆ వ్యాధి ఎందుకు వస్తుంది.? లక్షణాలు ఎలా ఉంటాయి.? లాంటి ప్రశ్నలను తెగ వెతికేస్తున్నారు...

Myositis: సమంతకొచ్చిన అరుదైన వ్యాధికి డైట్‌తో చెక్‌ పెట్టలేమా.? వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..
Myositis Diet
Narender Vaitla
|

Updated on: Nov 04, 2022 | 1:57 PM

Share

నటి సమంత ఏమంటూ తాను మయోసిటిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నానని ప్రకటించారో అప్పటి నుంచి ఈ అంశం ట్రెండ్‌ అవుతూనే ఉంది. ఇంతకీ సమంతకు ఏమైంది.? అసలు ఆ వ్యాధి ఎందుకు వస్తుంది.? లక్షణాలు ఎలా ఉంటాయి.? లాంటి ప్రశ్నలను తెగ వెతికేస్తున్నారు. శరీరంలోని రోగనిరోధక వ్యసవ్థ వ్యవస్థ తన స్వంత కణజాలాలపైనే పొరపాటుగా దాడి చేస్తుంది. ఫలితంగా కండరాలలో వాపు, బలహీనత, దద్దుర్లను కలిగిస్తుంది. ఇది బాధాకరమైన మంట, నొప్పికి దారితీస్తుంది. ఈ పరిస్థితి కాలక్రమేణా మరింత తీవ్రమవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే మయోసిటిస్‌ వ్యాధి లక్షణాలు ఇవి. నిత్యం జిమ్‌లు, మంచి ఫుడ్‌ తీసుకునే సమంతకు ఈ వ్యాధి ఎందుకు సోకిందన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ క్రమంలోనే అసలు ఈ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ఎలాంటి డైట్‌ మెయింటెన్‌ చేస్తే ఈ వ్యాధికి చెక్‌ పెట్టొచ్చులాంటి విషయాలపై నిపుణుల మాటేంటంటే..

* మయోసిటిస్‌ వ్యాధితో బాధపడుతోన్న వారు ఫ్రక్టోజ్‌, ప్రిజర్వేటిస్‌, రసాయనాలు ఎక్కువగా ఉపయోగించే ప్రాసెస్డ్‌, ఫాస్ట్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. వీటికి బదులుగా తాజా కూరగాయలు, పండ్లను తీసుకోవాలి.

* గోధుమ పిండి, చక్కెరలతో చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా బ్రెడ్‌, పాస్తాతో పాటు ప్యాక్‌ చేసిన స్నాక్‌ ఫుడ్స్‌ను తగ్గించాలి. వీటికి బదులుగా బ్రౌన్‌ రైస్‌, తృణధాన్యాలను తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

* జంతువుల కొవ్వులు, పామ్‌ ఆయిల్‌తో చేసిన ఉత్పత్తులను తక్కువగా తీసుకోవడాన్ని తగ్గించాలి.

* ఆలివ్‌ ఆయిల్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌, ఆవ నూనెతో చేసిన ఆహారాన్ని తీసుకోవాలి.

* డ్రైఫ్రూట్స్‌ను అలవాటు చేసుకోవాలి. వీటిలో ప్రధానంగా అవకాడో, వాల్‌నట్స్‌, జీడిపప్పు, బాదంపప్పు వంటి వాటిని డైట్‌లో యాడ్‌ చేసుకోవాలి.

* రోజూ తీసుకునే ఆహారంలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉండేలా జాగ్రత్త పడాలి. సాల్మన్‌ ఫిష్‌, ఫ్లాక్స్‌ సీడ్స్‌, చేపలు వంటి వాటిని తీసుకుంటుండాలి.

* బీన్స్‌, సోయా వంటి ప్రోటీన్‌లు అధికంగా ఉండే కూరగాయలను తీసుకోవాలి. వీటితో పాటు చీజ్‌, పెరుగు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

* ఈ వ్యాధితో బాధపడే వారు చాక్లెట్లు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా కనీసం 70 శాతం కోకో ఉండే చాక్లెట్లకు ప్రాధాన్యత ఇవ్వాలి.

నోట్: పైన తెలిపిన అంశాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల సంప్రదించి నిర్ణయం తీసుకోవడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..