Rock Candy Benefits: వేసవిలో పటిక బెల్లంతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే షాకవుతారు.. అన్ని సమస్యలకు సమాధానం ఇదే

శుద్ధి చేయని చక్కెరగా పటికబెల్లాన్ని పరిగణిస్తారు. అయితే ఇందులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణ చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పటిక బెల్లాన్ని వాడాలని సూచిస్తున్నారు.

Rock Candy Benefits: వేసవిలో పటిక బెల్లంతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే షాకవుతారు.. అన్ని సమస్యలకు సమాధానం ఇదే
Patika
Follow us
Srinu

|

Updated on: Apr 12, 2023 | 6:30 PM

పటికబెల్లాన్ని సాధారణంగా అన్ని ఇళ్లల్లో వాడతారు. ముఖ్యంగా చంటి పిల్లల పాలల్లో కలపడానికి పంచదార బదులు పటిక బెల్లాన్ని వాడతారు. ముఖ్యంగా వంటకాలు, ఔషధాల్లో కూడా పటిక బెల్లాన్ని విరివిగా వాడతారు. శుద్ధి చేయని చక్కెరగా పటికబెల్లాన్ని పరిగణిస్తారు. అయితే ఇందులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణ చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పటిక బెల్లాన్ని వాడాలని సూచిస్తున్నారు. పటికబెల్లం విభిన్న ఆకృతి, రుచికి ప్రసిద్ధి చెందింది. ఇది సాధారణ గ్రాన్యులేటెడ్ చక్కెరను పోలి ఉండదు. ఇది లేత బంగారు రంగుతో క్రిస్టల్ ఆకృతిని కలిగి ఉంటుంది. ముఖ్యంగా పటికబెల్లంలో ఎన్నో ఆరోగ్యకరమైన ఖనిజాలు ఉంటాయని పేర్కొంటున్నారు. చెరకు రసం నుంచి నీటిని ఆవిరి చేయడం ద్వారా దీన్ని తయారు చేస్తారు. ఇది శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా వాత, పిత్త కఫ దోషాల నుంచి రక్షణకు పటిక బెల్లాన్ని వాడతారు. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు పటిక బెల్లం కలిపి జ్యూస్, లేదా నిమ్మరసం తాగితే వెంటనే శక్తిని పెంపొందించుకోవచ్చు. ముఖ్యంగా మనస్సు, శరీరంపై శాంతించే ప్రభావాన్ని కలుగజేస్తుంది. అలాగే శరీరాన్ని సమతుల్యం చేసే సామర్థ్యం ఉంటుంది. ముఖ్యంగా ఇంద్రియాలను రిలాక్స్ చేస్తుంది. టిక బెల్లం వాడకం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఓ సారి చూద్దాం.

జీర్ణక్రియకు దోహం

పటిక బెల్లం జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని ప్రోత్సహిస్తుంది. తద్వారా జీర్ణవ్యవస్థను మెరుగవుతుంది. ఇది ఆహారాన్ని త్వరగా విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. 

అధిక ఖనిజాలు

ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు అవసరమైన కాల్షియం, ఐరన్ మరియు ఫాస్పరస్ వంటి ఖనిజాలు పటికబెల్లంలో అధికంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

దగ్గు, జలుబు దూరం

పటిక బెల్లాన్ని సాధారణంగా ఆయుర్వేద వైద్యంలో సహజ దగ్గు నివారణగా ఉపయోగిస్తారు. మొండి దగ్గు నుంచి తక్షణమే ఉపశమనం పొందడంలో సహాయపడే కొన్ని ఔషధ గుణాలు, అవసరమైన పోషకాలను ఇందులో మెండుగా ఉంటాయి. ఎండుమిర్చి, నెయ్యితో పటికబెల్లాన్ని తీసుకుంటే గొంతు నొప్పి తగ్గుతుంది. 

ఇన్‌ఫ్లమేషన్‌తో పోరాటం

పటికబెల్లంలో గ్లైసిరైజిన్ అనే సహజ సమ్మేళనం ఉంది. ఇది శోధ నిరోధక ప్రభావాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. 

ఒత్తిడి, ఆందోళన దూరం

పటిక బెల్లం నాడీ వ్యవస్థ, మెదడుపై ఓదార్పు ప్రభావాన్ని కలిగి ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..