Health Tips: దేవాలయాల్లో పటిక బెల్లాన్ని ప్రసాదంగా ఎందుకు పెడతారో తెలుసా? శరీరంలో త్వరగా..
సాధారణంగా గుడులు, దేవాలయాల్లో ప్రసాదంగా పటిక బెల్లం (Stone Sugar) తప్పనిసరిగా వాడుతారు. పంచదారకు బదులు పటిక బెల్లాన్నే ఎందుకు ప్రసాదంగా ఇస్తారు? అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా? అందుకు ప్రత్యేక కారణం ఉంది.
Updated on: Mar 15, 2022 | 1:38 PM

Rock Sugar Health Benefits: సాధారణంగా గుడులు, దేవాలయాల్లో ప్రసాదంగా పటిక బెల్లం (Stone Sugar) తప్పనిసరిగా వాడుతారు. పంచదారకు బదులు పటిక బెల్లాన్నే ఎందుకు ప్రసాదంగా ఇస్తారు? అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా? అందుకు ప్రత్యేక కారణం ఉంది. పంచదార కంటే పటిక బెల్లం ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందట. అందువల్లనే పంచదార బదులు తీపి కోసం పటిక బెల్లం వాడమని డాక్టర్లు కూడా చెబుతారు. దీని ఇతర ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం..

అంతేకాకుండా స్టోన్ షుగర్ శరీర బలాన్ని పెంచుతుంది. పీరియడ్స్ సమయంలో స్త్రీలు స్టోన్ షుగర్ తినడంవల్ల తేలికగా ఉంటారు.

ఆహారం జీర్ణం కాకపోతే మలబద్ధకం ఏర్పడుతుంది. జీర్ణక్రియ సజావుగా సాగాలంటే పటిక బెల్లం తింటే చాలు. జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

శరీరం అలసిపోతే మనసు సరిగా పనిచేయదు. తక్షణ శక్తికోసం పటిక బెల్లాన్ని నేరుగా తిన్నా లేదా నీళ్లలో కలిపి తాగిన మంచి అనుభూతిని పొందుతారు.

కొంతమందికి తరచుగా ముక్కునుంచి రక్తస్రావం అవుతుంటుంది. ఇలాంటివారు పటిక బెల్లం కొంత తీసుకుని గ్లాస్ వాటర్‌లో కలిపి తాగితే వెంటనే రక్తం కారడం ఆగుతుంది.

వాతావరణ మార్పు సంభవించినప్పుడల్ల జలుబు, దగ్గు బారీనపడటం సాధారణం. స్టోన్ షుగర్ తింటే వీటి నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.




