AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరూ మొదటిసారి యోగా చేస్తున్నారా? ఈ తప్పులు చేశారో.. అసలుకే ఎసరు పక్కా!

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ తేలికపాటి యోగాసనాలు వేయడం చాలా అవసరం. అయితే మొదటి సారి యోగా చేయడం ప్రారంభించే వారు కొంత మంది కొంచెం భయపడతారు. ఎందుకంటే ఎలా చేయాలి? అది పని చేయకపోతే ఏం చేయాలి? ఇలాంటి పలు రకాల ప్రశ్నలు మనస్సులో తలెత్తుతాయి..

మీరూ మొదటిసారి యోగా చేస్తున్నారా? ఈ తప్పులు చేశారో.. అసలుకే ఎసరు పక్కా!
Yoga Tips For Beginners
Srilakshmi C
|

Updated on: Jun 18, 2025 | 1:49 PM

Share

ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వారు తమ జీవనశైలిలో యోగాను తప్పక అలవాటు చేసుకుంటారు. అయితే మొదటి సారి యోగా చేయడం ప్రారంభించే వారు కొంత మంది కొంచెం భయపడతారు. ఎందుకంటే ఎలా చేయాలి? అది పని చేయకపోతే ఏం చేయాలి? ఇలాంటి పలు రకాల ప్రశ్నలు మనస్సులో తలెత్తుతాయి. కానీ యోగా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యోగా ప్రారంభించే ముందు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్య అంశాలు ఉన్నాయి. యోగా ప్రారంభించే ముందు ప్రతి వ్యక్తి చాలా విషయాలను గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం.. ఈ సమయంలో చేసే తప్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఖాళీ కడుపుతో యోగా చేయాలి

యోగా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాలా మంది యోగా ఎల్లప్పుడూ ఖాళీ కడుపుతో మాత్రమే చేయాలని అనుకుంటారు. నిజానికి, యోగా చేయడానికి అరగంట ముందు నీళ్లు తాగవచ్చు. కానీ కడుపులో ఆహారం ఉండకుండా చూసుకోవాలి. మీరు ఉదయాన్నే యోగా చేయలేకపోతే, అల్పాహారం తీసుకున్న కనీసం 3 గంటల తర్వాత యోగా చేయవచ్చు. అయితే అల్పాహారం తీసుకున్న వెంటనే, భోజనం తర్వాత వెనువెంటనే యోగా చేయకూడదు. అల్పాహారం తర్వాత కనీసం 2 గంటల విరామం ఖచ్చితంగా ఉంచాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అల్పాహారం లేదా వెంటనే యోగా చేయకూడదు.

యోగా ఆసనాలను సరైన క్రమంలోనే చేయాలి

యోగా సాధన చేసేటప్పుడు సరైన భంగిమలో మాత్రమే చేయాలి. ఇది అతి ముఖ్యమైన విషయం. ఎందుకంటే యోగా తప్పుగా చేస్తే అది ప్రయోజనాలను అందించడానికి బదులుగా హాని కలిగిస్తుంది. ప్రతి యోగా భంగిమను ఎలా చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు శారీరక నొప్పులు లేదా అనారోగ్యం నుంచి ఉపశమనం పొందడానికి యోగా చేస్తుంటే మాత్రం నిపుణుడిని సంప్రదించిన తర్వాత.. అందుకు తగిన యోగా భంగిమలను సాధన చేయాలి. తప్పు యోగా భంగిమలను ఎంచుకోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది.

ఇవి కూడా చదవండి

దుస్తుల ఎంపిక

యోగా చేయడానికి సరైన దుస్తులను ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా సరైన లోదుస్తులను ఎంచుకోవాలి. శరీరానికి సౌకర్యంగా ఉండే దుస్తులను ఎంచుకోవాలి. వాటిని బిగుతుగా లేకుండా కాస్త లూజుగా ఉండేలా దుస్తులను ఎంచుకోండి. అలాగే వాతావరణానికి తగిన దుస్తులను ఎంచుకోవాలి. తద్వారా మీరు సులభంగా యోగా సాధన చేయవచ్చు.

యోగా మ్యాట్

యోగా చేసే ముందు మ్యాట్ సౌకర్యవంతంగా ఉందో లేదో తనిఖీ చేయాలి. యోగా మ్యాట్ సౌకర్యవంతంగా లేకపోతే యోగా చేస్తున్నప్పుడు అది అనేక విధాలుగా సమస్యలను కలిగిస్తుంది. మ్యాట్ జారేలా ఉండకూడదు. ఎందుకంటే యోగా చేస్తున్నప్పుడు జారడం వల్ల మంచి కంటే ఎక్కువ హాని జరుగుతుంది. అందువల్ల మ్యాట్ ఎంపిక చాలా ముఖ్యం. దానితో పాటు మ్యాట్ శుభ్రతపై కూడా శ్రద్ధ చూపడం చాలా అవసరం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.