AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం.. చరిత్ర, ప్రాముఖ్యత, ఈ ఏడాది రక్తదాతల దినోత్సవం థీమ్ ఏమిటంటే..

రక్తదానం చేయండి.. ప్రాణదాత కండి ఈ నినాదం గురించి అందరికీ తెలిసిందే. రక్తదానాన్ని గొప్ప దానంగా భావిస్తారు. ఒక యూనిట్ రక్తంముగ్గురు జీవితాలను కాపాడుతుంది. ఇలా రక్తం దానం చేయడం వలన ప్రాణం కాపాడడమే కాదు.. ఆరోగ్యానికి కూడా లాభం. అత్యవసర పరిస్థితుల్లో సరైన సమయంలో రక్తం అందుబాటులో లేకపోతే.. అది రోగి జీవితానికి ప్రాణాంతకం కావచ్చు. ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీ ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం.. చరిత్ర, ప్రాముఖ్యత, ఈ ఏడాది రక్తదాతల దినోత్సవం థీమ్ ఏమిటంటే..
World Blood Donor Day
Surya Kala
|

Updated on: Jun 14, 2025 | 9:47 AM

Share

ప్రస్తుతం అన్ని దానాల్లో కెల్లా రక్తదానం గొప్ప దానంగా పరిగణించబడుతుంది. శరీరంలో తగినంత రక్తం లేకపోవడం ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు.. సరైన సమయంలో రక్తం బాధితునికి అందుబాటులో లేకపోతే.. అప్పుడు రోగి జీవితం ప్రమాదంలో పడవచ్చు. అయితే రక్తదానం ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 14న జరుపుకుంటారు. ఈ రోజు ప్రధాన లక్ష్యం.. ప్రజలలో రక్తదానం గురించి అవగాహన కల్పించడం. కనుక ఈ రోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవానికి సంబంధించిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.

ప్రపంచ రక్తదాతల దినోత్సవం చరిత్ర ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని తొలిసారిగా 2004లో జరుపుకున్నారు. 2005లో 58వ ప్రపంచ ఆరోగ్య సభ దీనిని వార్షిక ప్రపంచ కార్యక్రమంగా ప్రకటించింది. అప్పటి నుంచి రక్తదాతల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 14న జరుపుకుంటున్నారు. జూన్ 14 జీవశాస్త్రవేత్త, వైద్యుడు అయిన కార్ల్ ల్యాండ్‌స్టైనర్ పుట్టినరోజు కూడా. ఆయనను ఆధునిక రక్త మార్పిడి స్థాపకుడు అని పిలుస్తారు.

ప్రపంచ రక్తదాతల దినోత్సవం 2025 థీమ్ ప్రతి సంవత్సరం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఒక ప్రత్యేక ఇతివృత్తంతో జరుపుకుంటారు. ఈ నేపధ్యంలో ఈ ఏడాది అంటే 2025 సంవత్సరానికి ఇతివృత్తం “రక్తం ఇవ్వండి, ఆశను ఇవ్వండి: కలిసి మనం అందరం ప్రాణాలను కాపాడుకుందాం”. ఈ సంవత్సరం ఇతివృత్తం రక్తదానం ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ప్రపంచ రక్తదాతల దినోత్సవం ప్రాముఖ్యత రక్తదానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. జూన్ 14 రక్తదాతలను గౌరవించడానికి అంకితం చేయబడింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం రక్తదానం గురించి అవగాహన పెంచి, రక్తదానం చేయమని ప్రజలను ప్రోత్సహిస్తుంది. రక్తదానం చేయడం వల్ల పేద ధనిక అనే తేడాలేకుండా ప్రమాదంలో ఉన్న వ్యక్తి ప్రాణాలను కాపాడవచ్చు.

ఇక రక్త దానం చేయడం వలన అనేక ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. రక్తదానం ద్వారా శరీరంలో కొత్త రక్తకణాలు ఉత్పత్తి అవుతాయి. ఇది హృదయ ఆరోగ్యానికి మంచిది. రక్త దానం చేయడం కూడా ఒక సామాజిక బాధ్యత. ప్రమాదాలు, శస్త్రచికిత్సలు లేదా రక్తహీనతతో బాధపడుతున్నవారికి మీరు ఇచ్చే రక్తం ఒక వరం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)