Parenting Tips: మీ చిన్నారి ప్రతి చిన్న విషయానికి ఏడుస్తున్నాడా..! ఊరడించేందుకు తల్లిదండ్రులకు టిప్స్ ఇవే..
తల్లిదండ్రులకు చిన్నతనంలో శిశువులను చూసుకోవడం ఒక పెద్ద పరీక్ష వంటిది. చిన్న పిల్లలు తమ పరిస్థితిని, భావోద్వేగాలను వెల్లడించలేనప్పుడు.. ఏడవడం, కేకలు పెట్టడం వంటి చర్యల ద్వారా తమ భావాలను వ్యక్తం చేస్తారు. ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ తల్లిదండ్రులను ఇబ్బంది పెడతారు. అపుడు ఏడుస్తున్న తమ పిల్లల్ని శాంతిపజేయడం తల్లిదండ్రులకు ఒక పెద్దపని. అటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు కొన్ని చిట్కాలను పాటించి చూడండి.

చిన్నపిల్లలకు చిరాకు రావడం అనేది ఒక సాధారణ విషయం. అయితే చిన్న పిల్లల చికాకు కొన్నిసార్లు తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తుంది. పిల్లలు తమ ఇబ్బందిని తామ మాటలతో వ్యక్తపరచలేనప్పుడు.. వారు ఏడుపు, కోపం లేదా చిరాకు వంటి చర్యల ద్వారా తమ అవసరాలను, భావాలను వ్యక్తపరుస్తారు. తాము కలత చెందుతున్నామని, అలసిపోయామని లేదా తమకు ఏదైనా అవసరమని చెప్పడానికి పిల్లలు ఎంచుకునే మార్గం. అటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు లేదా ఇంటి పెద్దలు ఓపికగా ఉండాలి. పిల్లలను విసుగుకోవడం, కొట్టడం వంటి పనులు చేయవద్దు. పిల్లవాడు ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. తల్లిదండ్రులు పిల్లవాడిని ప్రేమ, అవగాహనతో అర్థం చేసుకుంటే.. అతను త్వరగా శాంతిస్తాడు. కనుక చిన్న పిల్లల చిరాకును శాంతపరచడానికి తల్లిదండ్రులు పాటించాల్సిన చిట్కాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
పిల్లల అవసరాలను అర్థం చేసుకోండి పిల్లవాడు ఏమి కోరుకుంటున్నాడు? అలసిపోయాడా? ఆకలిగా ఉన్నాడా? ఎటువంటి సమయంలో పిల్లల అవసరాలు తీర్చాలి అన్న విషయాలపై తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి. తద్వారా పిల్లవాడు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటాడు.
పిల్లల మనసును మరల్చండి బిడ్డ చిరాకు పడుతూ ఇబ్బంది పెడుతుంటే.. ఊరడించడానికి, మనసుని మరలించడానికి తల్లి దండ్రులు తమ చిన్నారులకు కథ చెప్పవచ్చు, ఆడుకోవడానికి బొమ్మలు ఇవ్వవచ్చు లేదా పిల్లల మనస్సును మళ్లించడానికి సరదాగా బయటకు వాకింగ్ కు తీసుకెళ్లవచ్చు.
బిడ్డను ప్రేమతో లాలించండి మీ పిల్లల చిరాకును తగ్గించి వారిని సంతోషపెట్టాలనుకుంటే.. వారిని మీ ఒడిలోకి తీసుకోండి. కౌగిలించుకుని ఊరదించండి. చిన్నారుల తలను పట్టుకోవడం ద్వారా వారు సురక్షితంగా ఉన్నారు అనే భావన కనిపించేలా తల్లిదండ్రులు చేయాలి.
నిద్ర లేమి సమస్య తీర్చండి అలసిపోయిన పిల్లవాడు తరచుగా చిరాకు పడతాడు. అంతే కాదు నిద్ర లేకపోవడం కూడా చిన్నారులను చికాకు పరుస్తుంది. అప్పుడు చిన్నారుల అసమతుల్య ప్రవర్తనకు దారితీస్తుంది. అందువల్ల పిల్లల్ని బాగా నిద్రపోయేలా చేయండి. ఎందుకంటే నిద్ర లేకపోవడం వలన పిల్లవాడికి విశ్రాంతి దొరకదు. దీంతో చికాకు పడతాడు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








