Goru Chikkudu Uses: ఆడవారికి ఈ కూరగాయ వరం లాంటిది.. తింటే జరిగేది ఇదే!
కూరగాయల్లో గోరు చిక్కుడు కూడా ఒకటి. పలు ప్రాంతాల్లో దీన్ని చాలా రకాలుగా పిలుస్తారు. అయితే ఎక్కువగా గోకరికాయ అని అంటారు. చాలా మంది ఈ వెజిటేబుల్ కర్రీస్‌ని చపాతీలోనే తింటూ ఉంటారు. చపాతీతో ఈ కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. గోకరికాయ కర్రీ లేదా ఫ్రై కాస్త చేదుగా, పుల్లగా ఉంటుంది. దీంతో చాలా మంది ఇది తినడానికి ఇష్ట పడరు. ఈ కూరగాయ ఆడువారికి వరం లాంటిదని చెప్పొచ్చు. మీ డైట్‌లో గోరు చిక్కుడిని..

కూరగాయల్లో గోరు చిక్కుడు కూడా ఒకటి. పలు ప్రాంతాల్లో దీన్ని చాలా రకాలుగా పిలుస్తారు. అయితే ఎక్కువగా గోకరికాయ అని అంటారు. చాలా మంది ఈ వెజిటేబుల్ కర్రీస్‌ని చపాతీలోనే తింటూ ఉంటారు. చపాతీతో ఈ కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. గోకరికాయ కర్రీ లేదా ఫ్రై కాస్త చేదుగా, పుల్లగా ఉంటుంది. దీంతో చాలా మంది ఇది తినడానికి ఇష్ట పడరు. ఈ కూరగాయ ఆడువారికి వరం లాంటిదని చెప్పొచ్చు. మీ డైట్‌లో గోరు చిక్కుడిని కూడా యాడ్ చేసుకోండి. ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు. గోరు చిక్కుడులో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, క్యాల్షియం, ఐరన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. లేడీస్ వారంలో ఒక్కసారైనా గోకరికాయ తింటే చాలా సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు. మరి గోరు చిక్కుడు తింటే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వెయిట్ లాస్:
వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారు ఖచ్చితంగా ఈ వెజిటేబుల్ తీసుకోవచ్చు. ఎందుకంటే వీటిల్లో ఉండే పోషకాలు బరువు తగ్గిస్తూనే.. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అంతే కాకుండా ఇందులో కేలరీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇది కొద్దిగా తిన్నా త్వరగా కడుపు నిండుతుంది.
రక్త హీనత నివారణ:
మహిళలు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే రక్తం ముఖ్య పాత్ర వహిస్తుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉంటే చాలా నీరసంగా, అసలటగా అనిపిస్తుంది. శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి మహిళలు గోరు చిక్కుడు తింటే.. రక్త హీనత సమస్య తగ్గుతుంది. ఈ కూరగాయ తినడం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు ఏర్పడతాయి.
కడుపుతో ఉన్నవారికి బెస్ట్:
కడుపుతో ఉన్నవారు ఖచ్చితంగా గోరు చిక్కుడును మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇది తినడం వల్ల మీ కడుపులో ఉన్న బిడ్డకు కూడా క్యాల్షియం, ఐరన్ అందుతాయి. పిల్లలు బాగా ఎదగడానికి సహాయ పడుతుంది. పిల్లలు ఆరోగ్యంగా పుడతారు.
బీపీ – షుగర్ కంట్రోల్:
గోరు చిక్కుడు తినడం వల్ల బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాకుండా షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇది తింటే రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




