- Telugu News Photo Gallery Homemade Drink For Instant Gas Relief, Acidity and Bloating With In 5 Minutes
Indigestion-Gas Relief Drinks: ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం అందించే సహజ పానియం.. కేవలం 5 నిమిషాల్లోనే ప్రభావం!
కొన్నిసార్లు ఆహారం సరిగ్గ జీర్ణం కాదు. దీంతో గ్యాస్-గుండెల్లో మంట సమస్య ముప్పుతిప్పలు పెడుతుంది. అలాంటప్పుడు ఇన్‌స్టంట్ రిలీఫ్ కోసం యాంటాసిడ్ వేసుకునే బదులు.. సరైన శారీరక వ్యాయామం ఉండాలి. ఈ కింది డ్రింక్ తాగారంటే సహజ పద్ధతుల్లో గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఫలితంగా మీ జీర్ణక్రియ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. గ్యాస్ , గుండెల్లో మంట వంటి సమస్యల నుంచి బయటపడాలంటే పుష్కలంగా నీరు తాగాలి..
Updated on: Jun 19, 2024 | 1:06 PM

కొన్నిసార్లు ఆహారం సరిగ్గ జీర్ణం కాదు. దీంతో గ్యాస్-గుండెల్లో మంట సమస్య ముప్పుతిప్పలు పెడుతుంది. అలాంటప్పుడు ఇన్‌స్టంట్ రిలీఫ్ కోసం యాంటాసిడ్ వేసుకునే బదులు.. సరైన శారీరక వ్యాయామం ఉండాలి. ఈ కింది డ్రింక్ తాగారంటే సహజ పద్ధతుల్లో గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఫలితంగా మీ జీర్ణక్రియ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. గ్యాస్ , గుండెల్లో మంట వంటి సమస్యల నుంచి బయటపడాలంటే పుష్కలంగా నీరు తాగాలి.

గ్యాస్, గుండెల్లో మంట సమస్యను నివారించడానికి వేళతప్పకుండా తినడం అలవాటు చేసుకోవాలి. కొన్నిసార్లు ఖాళీ కడుపుతో ఉండటం వల్ల కూడా గ్యాస్ సమమ్య తలెత్తుతుంది. ఇది కడుపులో యాసిడ్ రిఫ్లక్స్ వల్ల హానికరమైన పదార్థాలు పేరుకుపోవడానికి కారణమవుతుంది. కడుపు ఉబ్బినట్లు ఉంటే ఆహారం సరిగా జీర్ణం కాలేదని అర్థం. ఛాతీ, గొంతు మంట సమస్య కూడా వస్తుంది.

యాంటాసిడ్‌లు గ్యాస్‌ను తక్షణమే ఉపశమనానికి కలిగించినట్లే ఈ డ్రింక్ కూడా బలేగా పనిచేస్తుంది. ఈ పానీయాన్ని కేవలం 3 పదార్థాలతో తయారు చేయాలి. అవేంటంటే.. సోంపు గింజలు, చిన్న ఏలకులు, జీలకర్ర.

ఒక గ్లాసు నీటిలో 4 చిన్న ఏలకులు, 1 టీస్పూన్ సోంపు, జీలకర్ర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్టౌ మీద మరిగించాలి. నీరు మరిగిన తర్వాత గ్యాస్ మంటను తగ్గించాలి. తర్వాత నీటిని వడకట్టి ఒక గ్లాస్‌లో ఈ పానియాన్ని పోయాలి.

గ్యాస్-గుండెల్లో మంట వచ్చినప్పుడల్లా ఈ పానీయం తాగవచ్చు. ఈ పానీయం గ్యాస్‌ను తగ్గిస్తుంది. కేవలం 5 నిమిషాల్లో త్రేనుపు సమస్యను నివారిస్తుంది. ఈ డ్రింక్‌ని రోజూ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.




