- Telugu News Photo Gallery Weight Loss Tips: These Ayurvedic Herbs Can Help You Lose Weight Is Less Time
Weight Loss Tips: పొట్ట చుట్టూ కొవ్వును వెన్నలా కరిగించే ఆయుర్వేద మూలికలు.. వారంలోనే నాజూకైన నడుం మీ సొంతం
నేటి జీవన శైలి కారణంగా మన ఆహార అలవాట్లలో గణనీయమైన మార్పులు వచ్చాయి. యువత ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ మీద ఆధారపడి పడుతున్నారు. దీనివల్ల స్థూలకాయం సమస్య మరింతగా వేధిస్తోంది. దీంతో బరువు తగ్గేందుకు చాలా మంది ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మన ప్రాచీన గ్రంథమైన ఆయుర్వేదంలో బరువు తగ్గేందుకు ఉపయోగపడే అద్భుతమైన ఔషధ మొక్కలు, మూలికల గురించిన ప్రస్తావన ఉంది..
Updated on: Jun 19, 2024 | 12:49 PM

నేటి జీవన శైలి కారణంగా మన ఆహార అలవాట్లలో గణనీయమైన మార్పులు వచ్చాయి. యువత ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ మీద ఆధారపడి పడుతున్నారు. దీనివల్ల స్థూలకాయం సమస్య మరింతగా వేధిస్తోంది. దీంతో బరువు తగ్గేందుకు చాలా మంది ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు

కానీ మన ప్రాచీన గ్రంథమైన ఆయుర్వేదంలో బరువు తగ్గేందుకు ఉపయోగపడే అద్భుతమైన ఔషధ మొక్కలు, మూలికల గురించిన ప్రస్తావన ఉంది. ఇవి బరువు తగ్గడానికి అద్భుతమైనది. ఆ మూలికలన్నీ క్రమం తప్పకుండా తినగలిగితే, బరువు తగ్గడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఆయుర్వేద మూలికలు శరీరంలో కొవ్వును కరిగించి సన్నగా మార్చుతాయి.

peepal herb అనేది ఆయుర్వేదంలో ఒక ప్రసిద్ధ మూలిక. పిపుల్‌కి జీర్ణశక్తిని పెంచి బరువు తగ్గించే శక్తి ఉంది. ఇది కొవ్వును పోగొట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

అలాగే దాల్చినచెక్క కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. జీవక్రియ రేటును పెంచడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్క నీరు బరువు తగ్గడానికి బలేగా ఉపకరిస్తుంది.

త్రిఫలం.. ఆయుర్వేదంలో ఒక ముఖ్యమైన పదార్ధం. త్రిఫలం శరీరంలో పలు వ్యాధులు దరిచేరనివ్వవు. ఉసిరి,కరక్కాయ, తానికాయల మిశ్రమమే త్రిఫలా చూర్ణం. త్రిఫలం త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.




