ప్రతి రోజు సాయంత్రం ఇలా చేస్తే.. ఇంట్లో సమస్యలు తగ్గుతాయట..! లక్ష్మీదేవి కరుణ ఉంటుంది..!
ఇంటి ప్రధాన ద్వారం వద్ద ప్రతి రోజు సాయంత్రం దీపం వెలిగించడం ఒక మంచి ఆచారం. ఇలా దీపం వెలిగించడం వల్ల ఇల్లు శుభ్రంగా, సానుకూల శక్తితో నిండి ఉంటుందని విశ్వసిస్తారు. చాలా మంది దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. దీపం వెలిగించే సమయంలో కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. వాటిని పాటిస్తేనే శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం మన జీవితానికి చాలా ముఖ్యమైనది. జీవితంలో ఎదురయ్యే సమస్యలను తగ్గించుకోవడానికి వాస్తు నియమాలను పాటించడం అవసరం. ఇంటి ముందు సాయంత్రం దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీని వల్ల ఇల్లు శుభ్రంగా, సానుకూల శక్తితో నిండి ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అయితే చాలా సార్లు మనం తెలియకుండా కొన్ని తప్పులు చేస్తుంటాం. అలాంటప్పుడు అవి ప్రతికూల ఫలితాలను కలిగిస్తాయి. కాబట్టి దీపం వెలిగించే ముందు కొన్ని ముఖ్యమైన నియమాలను తెలుసుకోవడం చాలా అవసరం.
వాస్తు ప్రకారం సాయంత్రం ప్రదోష కాలంలో దీపం వెలిగించడం మంచిది. సూర్యాస్తమయం అయిన తర్వాత అర్ధగంట తర్వాత ఇది మొదలవుతుంది. ఆ సమయంలో దీపం వెలిగిస్తే శుభం.
దీపం ఏ దిక్కున ఉంచాలనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. సాయంత్రం సమయంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపాన్ని ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచాలి. ప్రత్యేకంగా లక్ష్మీదేవి కోసం దీపం వెలిగిస్తే ఉత్తర దిశ ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఒకవేళ మీ పూర్వీకుల ఆత్మల కోసం దీపం వెలిగిస్తే.. దానిని దక్షిణ దిశలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఈ నియమాన్ని పాటిస్తే ఆయా దేవతల ఆశీర్వాదం ఎక్కువగా లభిస్తుందని నమ్ముతారు.
దీపం వెలిగించిన వెంటనే తలుపు మూసివేయకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం దీపం వెలిగించిన తర్వాత కొంత సమయం పాటు ఆ వెలుగు ఇంట్లోకి ప్రసరించాలి. ఆ తర్వాత తలుపు మూసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల ఇంటి వెలుపల ఉన్న శుభ శక్తులు ఇంట్లోకి ప్రవేశించి స్థిరపడతాయని నమ్ముతారు. తలుపును వెంటనే మూసివేస్తే శుభ ఫలితాలు తగ్గుతాయని పెద్దలు విశ్వసిస్తారు.
మీరు ఏ రకమైన దీపం వెలిగించినా.. అంటే మట్టి దీపం, ఇత్తడి దీపం లేదా రాగి దీపం అయినా.. దానిని ప్రతిరోజూ శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. దీపం నల్లగా మారితే అది అశుభంగా భావిస్తారు. అలాంటప్పుడు ఆ దీపాన్ని శుభ్రం చేయాలి లేదా కొత్త దీపాన్ని ఉపయోగించాలి. దీపం శుభ్రంగా ఉంటే దాని వెలుగు ప్రకాశవంతంగా ఉంటుంది. అది ఇంట్లో సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది.
