AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashada Masam: ఆషాడ మాసంలో గోరింటాకు పండగ.. అసలు రహస్యం ఇదేనట..!

పురాణాల్లోనూ గోరింటాకు ప్రత్యేక స్థానం ఉంది. మన సంస్కృతిలో పడుచమ్మాయిల చేతులు, గోరింటాకు ఎర్రగా పండితే, మంచి భర్త వస్తాడని చెబుతుంటారు. ఏళ్ల నుండి వస్తున్న సాంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నామని ఇక్కడ మహిళలు చెప్తున్నారు. ఫాస్ట్ కల్చర్ లో పడిపోకుండా ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటూ ఈ ఆనవాయితీని కంటిన్యూ చేస్తున్నారు.

Ashada Masam: ఆషాడ మాసంలో గోరింటాకు పండగ.. అసలు రహస్యం ఇదేనట..!
Gorintaku
P Shivteja
| Edited By: |

Updated on: Jul 12, 2024 | 4:15 PM

Share

ఆషాడ మాసం వచ్చిందంటే చాలు ఏ ఇంట్లో చూసినా గోరింటాకు సందడే కనిపిస్తుంది. అమ్మాయిల చేతులు గోరింటాకుతో మెరిసిపోతుంటాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గోరింటాకు వేడుకలు ఆకట్టుకుంటున్నాయి. సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో ఏదో ఒక నిగూడా అర్థం ఉంటుంది. అందులో ఒకటి గోరింటా పండగ. తెలుగు లోగిళ్ళలో పండగ అయినా, పబ్బమైనా, అమ్మాయిల చేతులు, కాళ్లు గోరింటాకుతో మెరిసిపోతుంటాయి. ఇక ఆషాడ మాసంలో గోరింటాకును నూరి, చేతులకు పెట్టుకుంటే, శరీరానికి కూడా ఎంతో మంచిదని చెప్తూ ఉంటారు. గోరింటలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని పరిశోధనలో కూడా రుజువైంది. గ్రీష్మరుతు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. గ్రీష్మంలో మన శరీరంలో వేడి ఎక్కువగా ఉండి, బయటి వాతావరణం చల్లగా ఉంటుంది, దీంతో బాడీ టెంపరేచర్ తగ్గి,జ్వరాలు, అనారోగ్య సమస్యలు, ఎక్కువగా వస్తూ ఉంటాయి. గోరింటాకు లోని ప్రత్యేక గుణం వల్ల, శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే ఆషాడంలో గోరింటాకు అర చేతిలో, పాదాలకు పెట్టుకుంటారు. అందుకే ఈ కాలంలో గోరింటాకు తప్పక పెట్టుకోవాలని చెప్తుంటారు.

ఆషాడ మాసం వచ్చిందంటే చాలు, హుస్నాబాద్ లో ప్రతి ఇంట్లో గోరింటాకు సందడి కనిపిస్తుంది. అక్కడక్కడ మెహేంది వేడుకలు కూడా కనిపిస్తుంది. సహజంగా పెరిగే గోరింట చెట్లకు ఉన్న ఆకులను తీసుకువచ్చి, రోట్లో వేసి, మెత్తగా నూరి మహిళలు చేతులకు పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల మంచి ఆరోగ్యం, సౌభాగ్యం వస్తుందని మహిళలు నమ్ముతారు. గోరింటాకు అలంకరణలో ఆక్యుప్రెసి తెరపి ఉంటుందంటారు. మన శరీరంలోని నాడులన్నీ, వేళ్ళ చివరలో అంతమవుతాయని, అక్కడి నాడులను చల్లబరిస్తే, శరీరం అంతా చల్లబడుతుందని దీని సారాంశం. దీన్ని దృష్టిలో పెట్టుకొని అనాదిగా మహిళలు కాళ్లు, చేతి వేళ్ళు,అరచేతి పాదాలకు,గోరింటాకు పెట్టుకోవడం కనిపిస్తుంది. గోరింటాకును ముద్దలుగా చేసి, వేళ్ళకు పెట్టడం వల్ల వాటికి కొత్త అందం వస్తుందనేది, కాదనలేని నిజం, కొందరు దిష్టి కోసం కూడా గోరింటాకు పెట్టుకుంటారు.

పురాణాల్లోనూ గోరింటాకు ప్రత్యేక స్థానం ఉంది. మన సంస్కృతిలో పడుచమ్మాయిల చేతులు, గోరింటాకు ఎర్రగా పండితే, మంచి భర్త వస్తాడని చెబుతుంటారు. ఏళ్ల నుండి వస్తున్న సాంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నామని ఇక్కడ మహిళలు చెప్తున్నారు. ఫాస్ట్ కల్చర్ లో పడిపోకుండా ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటూ ఈ ఆనవాయితీని కంటిన్యూ చేస్తున్నారు. ఆషాడ మాసంలో అందరూ ఒకచోట చేరి హుస్నాబాద్ పట్టణంలో పద్మశాలి మహిళలందరూ మైదాకు పండుగను నిర్వహిస్తున్నారు. గోరింటాకుతో వచ్చే అందం ఇతర మెహేందిలతో రాదంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..