AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదేనా.? నిపుణులు ఏమంటున్నారంటే..

చాలామంది ఆహారంలో తప్పనిసరిగా పెరుగు తింటారు. భోజనం చివర్లో కొద్దిగా పెరుగు తింటేగానీ, వారికి కడుపునిండా తిన్నామనే సంతృప్తి ఉండదు. అయితే వర్షాకాలంలో పెరుగు తినడంపై కొంతమందికి రకరకాల సందేహాలు ఉంటాయి. ఈ సీజన్‌లో పెరుగు తినడం వల్ల జలుబు, దగ్గు, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయని భయపడుతుంటారు. అయితే, వర్షాకాలంలో పెరుగు తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

వర్షాకాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదేనా.?  నిపుణులు ఏమంటున్నారంటే..
చర్మ సంరక్షణలో కూడా పెరుగు బాగా ఉపయోగపడుతుంది. చర్మానికి పోషకాలను అందించి కాంతి వంతంగా, ఆరోగ్యవంతంగా మారుస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఈ, జింక్ చర్మాన్ని సహజంగానే కాపాడుతాయి. దీంతోపాటుగా జుట్టు ఆరోగ్యానికి కూడా పెరుగు మంచిది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ జుట్టు కుదుళ్లకు న్యూట్రియంట్లు, మినరల్స్ అందించి డాండ్రఫ్‌ను అరికడుతుంది. పెరుగు హెయిర్ కండీషనర్​గా కూడా ఉపయోగపడుతుంది. హెన్నాతో కలిపి తలకు పెట్టుకోవడం వల్ల జుట్లు రాలడం తగ్గుతుంది.
Jyothi Gadda
|

Updated on: Jul 12, 2024 | 3:50 PM

Share

పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పొట్టకు చాలా మేలు చేసే మంచి బ్యాక్టీరియా ఇందులో ఉంటుంది. కండరాలు, ఎముకలను బలోపేతం చేయడంలో పెరుగు సహాయపడుతుంది. అందువల్ల పాలు ఇష్టపడని వారు పెరుగును ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం, వర్షాకాలంలో రోజుకు రెండుసార్లు 200 గ్రాముల పెరుగు తింటే మలబద్ధకం సమస్యలు తక్కువగా ఉంటాయి. వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని, మలబద్ధకం సమస్య తగ్గుతుందని నివేదికలో పేర్కొన్నారు.

దీంతో పాటు వర్షాకాలంలో పెరుగును పరిమిత పరిమాణంలో తినడం వల్ల డయేరియాను అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. పెరుగు తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ముకలు, దంతాలు బలోపేతం అవుతాయి. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేస్తుంది. పెరుగులో ఉండే విటమిన్ డి, ప్రొటీన్, కాల్షియం వంటి పోషకాలు వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. పెరుగును ఉదయం లేదా మధ్యాహ్న భోజనంలో తినాలని వైద్యులు చెబుతున్నారు. రాత్రి సమయంలో పెరుగు తినకూడదు. అయితే పెరుగు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ వర్షాకాలంలో పెరుగు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

రాత్రిపూట పెరుగు ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే, పెరుగు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే రాత్రిపూట పెరుగు కాకుండా మజ్జిగ, రైతా రూపంలో తీసుకుంటే మంచిది. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి, తాజా పెరుగు మాత్రమే తినాలని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఏ సమయంలోనైనా సరే పెరుగును ఎక్కువగా తినకుండా తగిన మోతాదులో మాత్రమే తింటూ జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా రాత్రి సమయంలో పెరుగు తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. అదేవిధంగా, పెరుగు తిన్న తర్వాత మీకు ఏదైనా అలర్జీ లేదా అసౌకర్యం కలిగితే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..