AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Young to Old: వృద్ధాప్య లక్షణాలు రావొద్దనుకుంటున్నారా?.. అయితే, వీటిని పాటించండి.. యవ్వనంగా ఉండండి..

Young to Old: మానవ జీవితంలో అనేక దశలు ఉంటాయి. బాల్యం నుండి యవ్వనం, మధ్య వయస్సు, వృద్ధాప్యం వరకు. అయితే మనం ఎందుకు వృద్ధులవుతున్నామని

Young to Old: వృద్ధాప్య లక్షణాలు రావొద్దనుకుంటున్నారా?.. అయితే, వీటిని పాటించండి.. యవ్వనంగా ఉండండి..
Young To Old
Shiva Prajapati
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 12, 2021 | 7:18 AM

Share

Young to Old: మానవ జీవితంలో అనేక దశలు ఉంటాయి. బాల్యం నుండి యవ్వనం, మధ్య వయస్సు, వృద్ధాప్యం వరకు. అయితే మనం ఎందుకు వృద్ధులవుతున్నామని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని గురించి శాస్త్రాలు ఏం చెబుతున్నాయి. భౌతిక కారణాలేమైనా ఉన్నాయా? ఇది మనల్ని కాలంతో, సమయానికి ముందే వృద్ధులను చేస్తుందా?. అయితే, మనం ఎందుకు వృద్ధులం అవుతున్నామో ఖచ్చితమైన నిర్వచనం ఇవ్వడం కష్ట. కానీ, శాస్త్రవేత్తల ప్రకారం.. మానవ శరీరం బాహ్య మూలకాలు, ధూళి, నేల, కాలుష్యం మొదలైన వాటి ప్రభావానికి గురై.. శరీర నాణ్యతలో క్షీణత ఏర్పడుతుంది. మానవ శరీరం వృద్ధాప్యానికి సంబంధించి శాస్త్రవేత్తలు చాలా కారణాలు చెప్పారు. వాటిలో కొన్ని ముఖ్యమైన కారణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మొదటి కారణం – మైటోకాండ్రియా.. మైటోకాండ్రియాను శరీరానికి సంబంధించిన పవర్ హౌస్ అని పిలుస్తారు. అవి వాటితో పాటు ఇతర కణాల చర్యను నియంత్రిస్తాయి. ఈ మైటోకాండ్రియా వ్యవస్థలో క్షీణత ఉంటే.. శరీరానికి సంబంధించి అనేక అంశాల్లో క్షీణత ఉంటుంది.

రెండవ కారణం – టెలోమీర్‌లలో తగ్గుదల.. శరీరంలో కొత్త కణాలను తయారు చేసే పని నిరంతరం కొనసాగుతుంది. ఈ ప్రక్రియ ద్వారా శరీరం కొత్తగా ఉంటుంది. కానీ ఈ కణాలను సురక్షితంగా వేరు చేయడంలో క్రోమోజోమ్‌లకు పెద్ద హస్తం ఉంటుంది. కణం DNA లోపల కనిపించే క్రోమోజోమ్‌ల చివర్లలో, టెలోమీర్స్ అనే రక్షణ కవచం ఉంటుంది. నిరంతర కణ విభజన కారణంగా, ఈ టెలోమర్ పరిమాణం తగ్గడం ప్రారంభమవుతుంది. కాబట్టి శరీరం వృద్ధాప్యం ప్రారంభమవుతుంది. టెలోమీర్‌ల యొక్క సంక్షిప్తీకరణ ఫలితంగా కణాలు ప్రతిబింబిస్తాయి, కొత్తవి ఏర్పడతాయి. కానీ, కాలక్రమేణా అవి నశించిపోతాయి. ఫలితంగా, చర్మంపై ముడతలు కనిపిస్తాయి, జుట్టు రాలడం, దృష్టి తగ్గడం, వినికిడి లోపం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

మూడవ కారణం – మూలకణాల ప్రతిరూపంలో క్షీణత మూల కణాలు.. వివిధ రకాల కణాలుగా విభజించే సామర్థ్యాన్ని కలిగి ఉండే కణాలు. అవి శరీరంలో మరమ్మతు వ్యవస్థగా పనిచేస్తాయి. వాటిలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. పిండ మూల కణాలు, వయోజన మూల కణాలు. శరీరంలోని అనేక భాగాలలో ఈ మూలకణాలు కనిపిస్తాయి. అయితే వాటి ప్రతిరూపం క్రమంగా తగ్గుతుంది. దీని కారణంగా, శరీర భాగాలు మునుపటిలాగా తమ పనిని చేయలేకపోతాయి. అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. ఉదాహరణగా మోకాలి నొప్పులు చెప్పుకోవచ్చు.

నాలుగో కారణం – మూల కణ విధ్వంసం.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా మానవులు తమ మూలకణాలను ముందస్తు విధ్వంసానికి గురికాకుండా కాపాడుకోవచ్చు. జీవనశైలి ఎంత అస్తవ్యస్థంగా ఉంటే.. అన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అస్తవ్యస్థమైన జీవనశైలి కారణంగా.. ఈ కణాళు అనేక వ్యాధులతో పోరాడాల్సి ఉంటుంది. ఫలితంగా మూల కణాల విధ్వంసం మొదలవుతుంది.

ఐదో కారణం – కణాల్లో ప్రోటీన్ గుర్తించే సామర్థ్యం తగ్గడం.. కాలక్రమేణా కణాల పనితీరు క్షీణిస్తుంది. ఫలితంగా అవి మునుపటిలా ప్రోటీన్లను గుర్తించలేవు. దీంతో విషం, చెడు ప్రోటీన్ శరీరంలోకి ప్రవేశించే ఆస్కారం ఉంది. జీవ క్రియలో మార్పు.. ఈ కణాలకు చాలా ప్రమాదం. అకాల వృద్ధాప్యం, జుట్టు రాలడం, అలసట, మతిమరుపు, చూపు కోల్పోవడం వంటి లక్షణాలు శరీరం అధికంగా పని చేస్తున్నట్లు సూచిస్తాయి.

పై వాస్తవాలను మనస్సులో ఉంచుకుని.. మీ జీవనశైలిని మార్చుకున్నట్లయితే సుదీర్ఘ ఆరోగ్యాన్ని, యవ్వనాన్ని సొంతం చేసుకోవచ్చు. మంచి అలవాట్లతో ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also read:

Rich Village: దక్షిణాసియాలోనే అత్యంత ధనిక గ్రామం.. వారి ఆస్తుల వివరాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..!

Andhra Pradesh: నాలుగేళ్ల క్రితం ప్రాణాలు కోల్పోయిన భర్త.. విగ్రహానికి నిత్యం పూజలు చేస్తున్న మహిళ..

Hyderabad City: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం.. చదువు నేర్పుతారని పిల్లలను పంపిస్తే..