Cucumber: కీరదోస వీరికి యమ డేంజర్.. తింటే నేరుగా కైలాసానికే!
సాధారణంగా కీరదోస సలాడ్, రైతా, జ్యూస్ రూపంలో తీసుకుంటారు. ఇందులో దాదాపు 95 శాతం నీరు ఉంటుంది. కాబట్టి, ఇది శరీరానికి హైడ్రేషన్ అందిస్తుంది. కీరదోస బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా, ఇందులో విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం వంటి..

కీరదోస ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా దీనిని సలాడ్, రైతా, జ్యూస్ రూపంలో తీసుకుంటారు. ఇందులో దాదాపు 95 శాతం నీరు ఉంటుంది. కాబట్టి, ఇది శరీరానికి హైడ్రేషన్ అందిస్తుంది. కీరదోస బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా, ఇందులో విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కీరదోస మంచిది కాదు. వీరు కీరదోస తినడం వల్ల ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇది ఎవరికి మంచిది కాదో ఇక్కడ తెలుసుకుందాం..
ఆయుర్వేదం ప్రకారం.. కీరదోస తినడం వల్ల జలుబు సంబంధిత సమస్యలు పెరుగుతాయి. అందువల్ల ఉబ్బసం, జలుబు, దగ్గు, కఫం, సైనస్, వాపు వంటి సమస్యలు ఉన్నవారు కీరదోస పూర్తిగా తినకుండా ఉండాలి. అలాగే కీరదోస అధికంగా తీసుకోవడం వల్ల వాత సమస్య పెరుగుతుంది. ఇప్పటికే కీళ్ల నొప్పులు, శరీర వాపుతో బాధపడుతున్నవారు కీరదోసకు దూరంగా ఉండాలి. కీరదోసలో ఫైబర్ అధికంగా ఉన్నప్పటికీ సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారికి ఇది కొంత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇందులో ఉండే కుకుర్బిటాసిన్ అన సమ్మేళనం జీర్ణ సమస్యలు ఉన్నవారిలో గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను కలిగిస్తుంది.
కీరదోస నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల, మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడేవారు వీటిని పెద్ద మొత్తంలో తీసుకుంటే తరచుగా మూత్రవిసర్జన అవుతుంది. ఇది అసౌకర్యాన్ని కలిగించవచ్చు. కీరదోస సాధారణంగా మధుమేహం ఉన్నవారికి సురక్షితమైనవిగా భావిస్తారు. అయితే కీరదోస విత్తనాలుఇన్సులిన్ లేదా గ్లూకోజ్ తగ్గించే మందులు తీసుకునే వారికి సమస్యలను కలిగిస్తాయి. కీరదోస గింజలను అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా తగ్గుతాయి. ఇది తలతిరగడం వంటి లక్షణాలను కలిగిస్తుంది. అందువల్ల ఆరోగ్య నిపుణులు సాధారణంగా భోజనం తర్వాత కీరదోస తినకూడదని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇవి జీర్ణం కావడానికి సమయం పడుతుంది. అంతేకాదు ఇవి నిద్రకు కూడా అంతరాయం కలిగిస్తాయి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రాథమికమైనది. వివరణాత్మక సమాచారం కోసం ఏదైనా ప్రయోగం చేసే ముందు సంబంధిత రంగంలోని నిపుణులను సంప్రదించండి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




