AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oil for Cooking: వంటలకు ఏ నూనె మంచిదో తెలిసుకోండిలా..!

వంటకు ఉపయోగించే నూనెలో ఎన్నో రకాలు ఉంటాయి. ఒక్కొక్కరు వాళ్లకు నచ్చిన విధంగా ఆయిల్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా ప్రాంతాన్ని బట్టి కూడా వంట నూనెను యూజ్ చేస్తూ ఉంటారు. కేరళలలో అయితే వంటకు కొబ్బరి నూనెను వాడతారు. తెలుగు రాష్ట్రాల్లో పామాయిల్, వేరు శనగ, సన్ ఫ్లవర్ వంటి ఆయిల్ ఉపయోగిస్తారు. ఏది తిన్నాము అనేదానికి కంటే.. ఎంత హెల్దీగా తిన్నాము అనేది ముఖ్యం. మీరు తినే ఆహారమే.. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. ఇందులో ఆయిల్ కూడా..

Oil for Cooking: వంటలకు ఏ నూనె మంచిదో తెలిసుకోండిలా..!
Cooking Oil
Chinni Enni
|

Updated on: Jan 21, 2024 | 11:54 AM

Share

వంటకు ఉపయోగించే నూనెలో ఎన్నో రకాలు ఉంటాయి. ఒక్కొక్కరు వాళ్లకు నచ్చిన విధంగా ఆయిల్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా ప్రాంతాన్ని బట్టి కూడా వంట నూనెను యూజ్ చేస్తూ ఉంటారు. కేరళలలో అయితే వంటకు కొబ్బరి నూనెను వాడతారు. తెలుగు రాష్ట్రాల్లో పామాయిల్, వేరు శనగ, సన్ ఫ్లవర్ వంటి ఆయిల్ ఉపయోగిస్తారు. ఏది తిన్నాము అనేదానికి కంటే.. ఎంత హెల్దీగా తిన్నాము అనేది ముఖ్యం. మీరు తినే ఆహారమే.. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. ఇందులో ఆయిల్ కూడా ఒకటి. వంట నూనె లేకుండా ఏ వంటలు కూడా చేయలేం. అయితే చాలా మంది వంట నూనె గురించి పెద్దగా పట్టించుకోరు. వంటకే కదా అని ఏది పడితే అది ఉపయోగిస్తారు. వంటకు ఉపయోగించే నూనెలు మన ఆరోగ్యంపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. పలు అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది. అందేకే ఏ వంట నూనె మంచిదో తెలుసుకుని ఉపయోగించడం చాలా బెటర్. మరి ఏ ఆయిల్ వాడితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అవొకాడో ఆయిల్:

చాలా మంది ఈ ఆయిల్‌ని సలాడ్స్‌లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో విటమిన్ ఇ, మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

అవిసె గింజల నూనె:

అవిసె గింజల నూనె కూడా చాలా మంచిది. ఇందులో ఓమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అవిసె గింజల నూనె వినియోగించడం వల్ల.. వండిన తర్వాత దాని పోషక విలులను పెంచడానికి సహాయ పడుతుంది.

ఇవి కూడా చదవండి

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నూనె ఉపయోగించడం వల్ల జీవక్రియకు హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా ఆహారానికి ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది.

నువ్వుల నూనె:

నువ్వుల నూనె కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. వంటకు తేలికగా ఉన్న నూనె లేదా ముదురు నువ్వుల నూనె రెండింటినీ ఉపయోగించవచ్చు. నువ్వుల నూనె సలాడ్లలో కలిపి ఉపయోగిస్తే చాలా మంచింది.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ కూడా వంట రుచిని పెంచడమే కాకుండా.. ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. వర్జిన్ ఆలివ్ ఆయిల్‌లో మోనోశాచురేటెడ్ కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెల్లో మంటను తగ్గిస్తుంది. అదే విధంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

మరిన్ని  లైఫ్ స్టైల్ ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

Follow Us
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!