Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Country Chicken vs Broiler: ఆరోగ్యానికి ఏది మంచిది..? నిపుణులు ఏం చెబుతున్నారు..?

చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. మార్కెట్‌ లో తక్కువ ధరలో దొరికేది బ్రాయిలర్ చికెన్ అయినా.. ఆరోగ్యపరంగా దీనికి తక్కువ మార్కులే వేయాలి. ఇది త్వరగా పెరిగేలా మందులు వాడుతారు. కానీ మన పాత కాలపు నాటుకోడి మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిదని పేరు పొందింది.

Country Chicken vs Broiler: ఆరోగ్యానికి ఏది మంచిది..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Chicken
Prashanthi V
|

Updated on: Jun 15, 2025 | 11:17 PM

Share

బ్రాయిలర్ చికెన్ తక్కువ ధరలో దొరుకుతుంది. కానీ ఇది కృత్రిమంగా పెరుగుతుంది. దాని పెంపకం సమయంలో హార్మోన్లు, యాంటీబయాటిక్స్ వంటివి ఎక్కువగా వాడతారు. దీని వల్ల దీన్ని తరచుగా తినేవారికి కొలెస్ట్రాల్ పెరగడం, తక్కువ రోగనిరోధక శక్తి, హార్మోన్లు సమతుల్యం కాకపోవడం, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

నాటుకోడి సహజంగా పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో స్వేచ్ఛగా తిరుగుతూ పెరిగే ఈ కోడి శరీరానికి శక్తిని ఇస్తుంది. ఇది ఎలాంటి మందులు లేకుండా పెరిగే కోడి. ఆరోగ్యానికి చాలా మంచిది.

  • నాటుకోడిలో ప్రొటీన్లు అధికం
  • కొందరికి అవసరమైన తక్కువ కొవ్వు
  • శరీరం పెరుగుదలకు సాయపడుతుంది
  • బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక
  • రోగనిరోధక శక్తికి సహాయపడుతుంది

నాటుకోడి మాంసం శరీరానికి అవసరమైన పోషకాలను ఇస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. అలసట తగ్గించి శక్తినిస్తుంది. ఇంకా జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఇది ఉపయోగపడుతుంది. నాటుకోడిలో ఉండే విటమిన్ డి, కాల్షియం, బీ12 విటమిన్లు వంటి పోషకాల వల్ల

  • నరాలు బలపడతాయి
  • ఎముకలు గట్టిగా అవుతాయి
  • శారీరక శ్రమ తగ్గి శక్తి పెరుగుతుంది
  • ఆడవారికి, గర్భిణీ స్త్రీలకు నాటుకోడి

నాటుకోడి గుడ్లలో ఉన్న ప్రొటీన్, కాల్షియం గర్భిణీ స్త్రీలకు, వారి కడుపులోని శిశువులకు అవసరమైన పోషకాలను ఇస్తుంది. పురుషుల్లో నరాల బలహీనత, వీర్యం నాణ్యతకు సంబంధించిన సమస్యలను కూడా తగ్గించడంలో ఇది సహాయపడుతుంది

నాటుకోడి ఆరోగ్యానికి మంచిదైనా బీపీ లేదా కొలెస్ట్రాల్ ఉన్నవారు ఎక్కువగా తినకూడదు. వేయించి తినడం కన్నా కూరగా చేసుకుని గ్రిల్ చేసిన రూపంలో తినడం మంచిది. ఎక్కువ నూనె వాడితే దాని ఆరోగ్య ప్రయోజనాలు తగ్గిపోతాయి.

ధర పరంగా బ్రాయిలర్ చికెన్ చవకైనా, ఆరోగ్యానికి హానికరం కావచ్చు. నాటుకోడి అయితే ఖరీదైనా, సహజమైన శక్తిని, పోషకాలను అందించే గొప్ప ఆహారం. క్రమం తప్పకుండా సరైన పద్ధతిలో తీసుకుంటే శరీరానికి ఆరోగ్యం, శక్తిని అందించే మంచి ఎంపిక ఇది.