Chewing Gum: చూయింగ్ గమ్ నమిలే వారిలో మతిమరుపు.. వీలైనత త్వరగా మానేస్తే బెటర్!
నోటి దుర్వాసనను తొలగించడానికి కొందరు రోజూ చూయింగ్ గమ్ తింటుంటారు. మరికొందరు ఏకాగ్రతను పెంచుకోవడానికి, ఆటగాళ్ళు అయితే టెన్షన్ నుంచి ఉపశమనం పొందడానికి చూయింగ్ గమ్ నమలడం కనిపిస్తుంది. వీరందరికీ చూయింగ్ గమ్ నమలడమంటే మహా ఇష్టం కాబట్టి తరచూ నమలుతారు. అయితే దీని వళ్ల అనార్ధాలు పొంచి ఉన్నాయి..

మనలో చాలా మందికి చూయింగ్ గమ్ నమలడం సరదా. కాదు.. కాదు రోజువారీ అలవాటు కూడా. నోటి దుర్వాసనను తొలగించడానికి కొందరు రోజూ వీటిని తింటుంటారు. మరికొందరు ఏకాగ్రతను పెంచుకోవడానికి, ఆటగాళ్ళు అయితే టెన్షన్ నుంచి ఉపశమనం పొందడానికి చూయింగ్ గమ్ నమలడం కనిపిస్తుంది. వీరందరికీ చూయింగ్ గమ్ నమలడమంటే ఇష్టం కాబట్టి తరచూ నమలుతారు. కానీ ఈ అలవాటు దీర్ఘకాలం కొనకసాగితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రతిరోజూ వీటిని నమలడం వల్ల మెదడుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని తాజా అధ్యయనాల్లో తేలింది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, చూయింగ్ గమ్‌లో మైక్రోప్లాస్టిక్‌లు ఉంటాయి. ఇది మన మెదడుకు చాలా హానికరం. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ప్రకారం చూయింగ్ గమ్‌లలో ప్లాస్టిసైజర్లు ఉంటాయి. ఈ పదార్ధాన్ని చూయింగ్ గమ్ ను ఫ్లెక్సిబుల్ గా ఉంచడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఉపయోగిస్తారు. ఈ చూయింగ్ గమ్ నమలడం వల్ల దాదాపు 1 మిలియన్ మైక్రోప్లాస్టిక్ కణాలు నోటిలోకి ప్రవేశిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కడుపు గుండా వెళ్లి మన రక్తంలో కలిసిపోతుంది. ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు శరీరంలోని వివిధ అవయవాలలో పేరుకుపోతాయి. అదే విధంగా, అది మెదడులో కూడా నిల్వ అవుతుంది. ఫలితంగా కాలక్రమేణా ఇది నాడీ కణాలను కూడా ప్రభావితం చేస్తుంది.
ఎలుకలపై పరిశోధకులు అధ్యయనం చేశారు.. మైక్రోప్లాస్టిక్‌లకు గురికావడం వల్ల జ్ఞాపకశక్తి, అభ్యాస సామర్థ్యం తగ్గుతుందని గమనించారు. మెదడు చురుకుదనం క్రమంగా తగ్గుతుంది. మైక్రోప్లాస్టిక్‌లు చూయింగ్ గమ్‌లోనే కాకుండా వివిధ సౌందర్య సాధనాలు, బాటిల్ వాటర్, ఫుడ్ ప్యాకేజింగ్‌లలో కూడా కనిపిస్తాయని వారు చెప్పారు. అయితే చూయింగ్ గమ్‌తో సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే మనం దానిని నేరుగా మన నోటిలోకి నమలడం జరుగుతుంది. ఫలితంగా అది త్వరగా మన లాలాజలంతో కలిసిపోయి శరీరం అంతటా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ ప్రమాదాన్ని నివారించడానికి ఏకైక మార్గం చూయింగ్ గమ్ నమిలే అలవాటును తగ్గించుకోవడమే అని నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, యువత ఈ అలవాటును మానుకోవడం చాలా ముఖ్యం.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.