మీకూ స్వీట్లంటే ఇష్టమా? ఐతే ఓ వారం వీటిని తినడం మానేసి చూడండి..
స్వీట్లు తినే అలవాటు ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేస్తుంది. ముఖ్యంగా కొంత మందికి రాత్రి భోజనం తర్వాత కూడా కొంచెం స్వీట్ తినడం ఇష్టం. ఎందుకంటే భోజనం తర్వాత కూడా వీరికి ఏదో మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఫ్రిజ్‌లో ఎప్పుడూ స్వీట్లు నిల్వ ఉండటం వల్ల.. క్షణం కూడా ఆలోచించకుండా వాటిని లాగించేస్తుంటారు..

చాలా మందికి స్వీట్లు తినడమంటే మహాఇష్టం. పగలైనా, రాత్రి అయినా తేడా లేకుండా తెగ లాగించేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో దీనిని కేవలం ఇష్టం అనడం సరికాదు. ఎందుకంటే ఈ అలవాటు ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేస్తుంది. ముఖ్యంగా కొంత మందికి రాత్రి భోజనం తర్వాత కూడా కొంచెం స్వీట్ తినడం ఇష్టం. ఎందుకంటే భోజనం తర్వాత కూడా వీరికి ఏదో మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఫ్రిజ్‌లో ఎప్పుడూ స్వీట్లు నిల్వ ఉండటం వల్ల.. క్షణం కూడా ఆలోచించకుండా వాటిని లాగించేస్తుంటారు. అయితే, ఏదైనా ఎక్కువగా ఉంటే శరీరానికి అది అంత మంచిది కాదు. కొన్నిసార్లు ఈ విషయం తెలిసి కూడా దానిని నియంత్రించడం కష్టం అవుతుంది. టీ, కాఫీలో చక్కెర వేసుకోవడం సాధారణం. ఇతర స్వీట్లు ఇలా వేళాపాళాలేకుండా తినేస్తే మొదటికే మోసం వస్తుంది. అయితే స్వీట్లు మీకెంత ఇష్టం ఉన్నప్పటికీ ఒక వారం పాటు వీటికి దూరంగా ఉంటే ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
అవసరానికి మించి స్వీట్లు తినడం ధూమపానం చేసినంత హానికరం. అలాగే ఎక్కువ కొవ్వు తినడంతో సమానం. ఇది బరువు పెరగడం నుంచి మధుమేహం, గుండె జబ్బుల వరకు సమస్యలకు దారితీస్తుంది. ఒక వారం పాటు చక్కెర తినకుండా ఉండగలిగితే, శరీరంలో వచ్చే మార్పులు అన్నీ ఇన్నీ కావు. బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ సీనియర్ వైద్యుడు డాక్టర్ అరవింద్ అగర్వాల్ ఏం చెబుతున్నారంటే.. ఎవరైనా ఒక వారం పాటు ‘షుగర్ లేని’ ఆహారాన్ని అనుసరిస్తే, శరీరంలో వివిధ సానుకూల మార్పులు కనిపిస్తాయి. ప్రారంభంలో కొంత అలసట, మానసిక స్థితిలో మార్పులు, తలనొప్పి ఉండవచ్చు. ఎందుకంటే శరీరం తీపికి అలవాటు పడి, అకస్మాత్తుగా ఆపివేసినట్లయితే ఇలా తాత్కాలిక సమస్యలను కలిగిస్తుంది. ఈ తీపిని తగ్గించిన తర్వాత, బరువు పెరగకుండా నిరోధించడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం వంటి అనేక సానుకూల మార్పులు మీరు గమనిస్తారు.
‘షుగర్ లేని’ ఆహారం కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు, గుండెల్లో మంట నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది డాక్టర్ అరవింద్ అగర్వాల్ చెబుతున్నారు. చర్మం క్లియర్‌గా, ఆరోగ్యంగా మారుతుంది. ఇది నిద్రను కూడా మెరుగుపరుస్తుంది. అమెరికన్ డైటరీ గైడ్‌లైన్స్ 2020-2025 ప్రకారం.. ఒక రోజులో మొత్తం కేలరీలలో 10 శాతానికి మించి చక్కెర ఉండకూడదు. బదులుగా, ఆకుపచ్చ కూరగాయలు, తాజా పండ్లు, చేపలు, గుడ్లు మొదలైన వాటిని ఆహారంలో చేర్చవచ్చు. ఫలితంగా శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందుతాయి.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.




