AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: అధిక బరువును తగ్గించుకోవాలనుకుంటున్నారా?.. అయితే అలోవెరాను ట్రై చేయండిలా..

అలోవెరా తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మన పూర్వీకులతో పాటు నేటి వైద్య, ఆరోగ్య నిపుణులు కూడా చెబుతుంటారు.  ముఖ్యంగా ఇందులో  డిటాక్సిఫైయింగ్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి

Weight Loss:  అధిక బరువును తగ్గించుకోవాలనుకుంటున్నారా?.. అయితే అలోవెరాను ట్రై చేయండిలా..
Basha Shek
| Edited By: Anil kumar poka|

Updated on: Jan 22, 2022 | 9:45 AM

Share

అలోవెరా తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మన పూర్వీకులతో పాటు నేటి వైద్య, ఆరోగ్య నిపుణులు కూడా చెబుతుంటారు.  ముఖ్యంగా ఇందులో  డిటాక్సిఫైయింగ్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వులను బాగా కరిగిస్తాయి.  కాబట్టి బరువు తగ్గాలనుకునే  వారు అలోవెరాను  ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితముంటుంది .  కలబంద నుండి సహజసిద్ధంగా తయారైన జ్యూస్‌లు, స్మూతీలను తరచూ తీసుకోవడం ద్వారా  మనం అనుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు.

భోజనానికి ముందు ..

బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ భోజనానికి 14 నిమిషాల ముందు ఒక చెంచా కలబంద రసం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు.

పరగడుపునే..

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా కలబంద రసాన్ని కలిపి ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి.   కలబందతో  కలిగే గరిష్ట ప్రయోజనాలను పొందడానికి ఇదెంతో ఉత్తమ మార్గం.

 తేనెతో కలిపి..

బరువు తగ్గడానికి కలబంద రసాన్ని తేనెతో కలిపి కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం అలోవెరాలో కొన్ని చుక్కల తేనె కలపాలి. ఇది రుచితో పాటు శరీరంలోని అధిక బరువును కూడా కరిగిస్తుంది.

నిమ్మకాయతో కలిపి..

ఒక గ్లాసు నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా నిమ్మకాయ రసాన్ని కలపండి. ఇందులోకి ఒక టీస్పూన్ అలోవెరా జెల్ కలపండి. ఈ మిశ్రమాన్ని ప్యాన్ లో పోసి, నిరంతరం కదిలిస్తూ వేడి చేయాలి. ఇప్పుడు అందులోకి ఒక టేబుల్‌స్పూను తేనె జోడించాలి. ఈ జ్యూస్‌ని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో సేవించాలి. దీనిని తాగిన తర్వాత  గంట వరకు ఏమీ తినకూడదు.కలబందలోని డిటాక్సిఫైయింగ్ గుణాలు శరీరంలోని టాక్సిన్‌లను బయటకు పంపడంలో సహాయపడతాయి.

ఆరెంజ్, స్ట్రాబెర్రీ స్మూతీ..

నారింజ, కలబంద,  స్ట్రాబెర్రీలతో కలిపి బరువు తగ్గడానికి ఒక మంచి యాంటీఆక్సిడెంట్ స్మూతీని తయారు చేసుకోవచ్చు.  ఇందుకోసం తాజా నారింజ రసాన్ని పిండి, అందులోకి మూడు నుండి నాలుగు స్ట్రాబెర్రీ ముక్కలు,  ఒక టేబుల్ స్పూన్ తాజా కలబంద రసాన్ని జోడించండి. వీటన్నింటినీ బ్లెండర్‌లో వేసి అరకప్పు నీటితో  కలిపి బ్లెండ్ చేయండి. ఈ స్మూతీని తరచుగా తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు.

Also Read: Dolo 650: అంద‌రి త‌ల నొప్పిని త‌గ్గించే డోలో 650.. కంపెనీ వారి త‌ల‌రాత‌ను మార్చేసింది.. కాసుల వ‌ర్షం..

HDFC Life Insurance: పెరిగిన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ ఆదాయం..!

Woman Pulls Bus With Hair video: డ‌బుల్ డెకర్‌ బ‌స్సును జడతో సులభంగా లాగి గిన్నిస్ బుక్‌లో రికార్డ్‌.. ఆశ్చర్యపరుస్తున్న వీడియో..