AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pearl Millet: సజ్జలు తింటే అలాంటి సమస్యలన్నీ మటుమాయం.. ఇంకా మరెన్నో ప్రయోజనాలు..

Pearl Millet Benefits: సజ్జలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజూ మిల్లెట్ తినడం వల్ల స్థూలకాయాన్ని తగ్గించుకోవడమే కాకుండా.. మరెన్నో

Pearl Millet: సజ్జలు తింటే అలాంటి సమస్యలన్నీ మటుమాయం.. ఇంకా మరెన్నో ప్రయోజనాలు..
Pearl Millet
Shaik Madar Saheb
|

Updated on: Jan 22, 2022 | 7:23 AM

Share

Pearl Millet Benefits: సజ్జలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజూ మిల్లెట్ తినడం వల్ల స్థూలకాయాన్ని తగ్గించుకోవడమే కాకుండా.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. చలికాలంలో సజ్జల (బజ్రా) తో రోటీ లేదా ఖిచ్డీని చాలామంది ఇష్టంగా చేసుకోని తింటుంటారు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ మిల్లెట్ (సజ్జలు) తినడం వల్ల మెటబాలిజం బాగా జరిగి ఊబకాయం తగ్గుతుందని చెబుతున్నారు. దీంతోపాటు మిల్లెట్ (pearl millet) తినడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు దాగున్నాయని.. అందుకే ఆహారంలో తృణధాన్యాలను చేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పుడు సజ్జల ప్రయోజనాలేంటో (pearl millet benefits) ఇప్పుడు తెలుసుకుందాం..

జీర్ణక్రియ: జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే.. వ్యాధులు మనకు చాలా దూరంగా ఉంటాయి. మిల్లెట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం ద్వారా.. మన జీర్ణవ్యవస్థ చక్కగా ఉంటుంది. అందుకే ఈ రోజు నుండే మిల్లెట్ తినడం ప్రారంభించండి.

చర్మం: మిల్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు కాకుండా ఫినాలిక్‌లు కూడా ఉంటాయి. ఇవి చర్మానికి సంబంధించిన సమస్యల్లో యాంటీ-ఏజెంట్‌గా పనిచేస్తాయి. యవ్వనంలోనే ముఖం మీద ముడతలు వచ్చినట్లయితే.. సజ్జలు క్రమం తప్పకుండా తీసుకోవడం వాటిని తొలగించుకోవచ్చు.

ఐరన్: శరీరంలో ఐరన్ లోపం ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఐరన్ పుష్కలంగా ఉన్న మిల్లెట్ తినడం ఆరోగ్యంగా ఉండవచ్చు. కావాలంటే రోటీకి బదులు సజ్జలు కిచ్డీ కూడా చేసుకోని తినొచ్చు.

గుండె: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో మిల్లెట్ ప్రభావవంతంగా ఉంటుంది. దీని కారణంగా, గుండె సంబంధిత వ్యాధులు మనల్ని చుట్టుముట్టవు. వాస్తవానికి మిల్లెట్‌లో అత్యధికంగా ఫైబర్ ఉంటుంది. కావున వీటిని నిరంతరం తీసుకుంటే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.

రోగనిరోధక శక్తి: మిల్లెట్ తినడం వల్ల శరీరానికి తక్షణమే శక్తిని అందిస్తుంది. ఎందుకంటే ఇది అద్భుతమైన శక్తి వనరుగా పనిచేస్తుంది. దీంతో శరీర రోగనిరోధక వ్యవస్థ బోపేతం అవుతుందని పేర్కొంటున్నారు.

Also Read:

Ragi Health Benefits: రాగి జావతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఆ రోగాలన్నింటికీ చెక్ పెట్టొచ్చు తెలుసా..

Children Parosmia: మీ పిల్లలు ఆహారం సరిగ్గా తినడం లేదా..? ఈ సమస్య కావచ్చు..!