Children Parosmia: మీ పిల్లలు ఆహారం సరిగ్గా తినడం లేదా..? ఈ సమస్య కావచ్చు..!

Children Parosmia: చాలా మంది పిల్లలు ఆహారం తినడంలో చికాకుపడుతుంటారు. ఆహారం అంటే చాలు దూరంగా పరుగెత్తిపోతుంటారు..

Children Parosmia: మీ పిల్లలు ఆహారం సరిగ్గా తినడం లేదా..? ఈ సమస్య కావచ్చు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 22, 2022 | 6:50 AM

Children Parosmia: చాలా మంది పిల్లలు ఆహారం తినడంలో చికాకుపడుతుంటారు. ఆహారం అంటే చాలు దూరంగా పరుగెత్తిపోతుంటారు. పిల్లలు చిరుతిండ్లకు అలవాటుపడి సరైన ఆహారం తీసుకోక అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ మధ్య కాలంలో తమ పిల్లలు సరిగ్గా తినడం లేదని చాలా మంది చెబుతున్నారు. ఇందుకు కారణాలు ఉన్నాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక గత రెండేళ్లగా వెంటాడుతున్న కరోనా.. పిల్లలను కూడా వదిలి పెట్టడం లేదు. ఈ మధ్య కాలంలో పిల్లలు కూడా చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. కరోనా సోకిన పిల్లలు, టీనేజర్లు కోలుకున్న తర్వాత ‘పరోస్మియా’ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పుణెకు చెందిన పిల్లల వైద్య నిపుణుడు జగదీష్‌ తెలిపారు. ఈ లక్షణాలు ఉన్న పిల్లలు ఆహారం తీసుకునేందుకు ఇష్టపడరని తెలిపారు.

కుళ్లిన పదార్థాల వాసన..

ఈ లక్షణాలు ఉన్న వారు రుచికరమైన తినుబండారాల నుంచి వచ్చే కమ్మని వాసన కూడా వారికి కుళ్లిన పదార్థాల వాసననే వస్తుందని చెబుతున్నారు. కరోనా లక్షణాలలో రుచి, వాసన కోల్పోవడం వంటివి జరుగుతున్న విషయం తెలిసింద. వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత కూడా కొందరిలో ఇలాంటి రుచి, వాసన పసిగట్టే గ్రాహకాలు యాక్టివ్‌లోకి రావడం లేదని యూఏఈ నిపుణులు నిర్వహంచిన పరిశోధనలలో తేలింది. దీంతో బాధితులు క్రమంగా ‘పరోస్మియా’ బారిన పడుతున్నారన్నారు. రుచికరమైన ఆహారం చూసినా వారికి కుళ్లిన కోడిగుడ్డు లాంటి చెడు వాసన వస్తుందని, దీని వల్ల పిల్లలు ఆహారాన్ని తీసుకునేందుకు ఇష్టపడరని చెబుతున్నారు.

ఈ లక్షణాలు కొద్ది రోజులు మాత్రమే..

కరోనా బారిన పడి కోలుకున్న పిల్లలలో ఇలాంటి లక్షణాలు కొద్ది రోజులు మాత్రమే ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే బ్రీత్‌ ట్రైనింగ్‌, స్మెల్‌ థెరపీ, నాజల్‌ డ్రాప్స్‌ సాయంతో ఈ స్థితి నుంచి బయటపడే అవకాశం ఉందని సూచిస్తున్నారు. కరోనా కారణంగా బ్రిన్‌లో 2.5 లక్షల మంది టీనేజర్లు ఈ ‘పరోస్మియా’ లక్షణాలతో బాధపడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

(గమనిక: ఇందులో ఇవ్వబడిన వివరాలన్ని వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు ఇవ్వడం జరిగింది. కేవలం అవగాహన కోసమే. ఏదైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించాలి.)

ఇవి కూడా చదవండి:

Jackfruit Health Benefits: పనస పండుతో అద్భుతమైన ప్రయోజనాలు..!

Health : మోతాదుకు మించి బాదం తీసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన
ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన
ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా
ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా
పుష్ప2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. ఇచ్చిపడేసిన బన్నీ టీం
పుష్ప2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. ఇచ్చిపడేసిన బన్నీ టీం
అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు
అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు
చిక్‌ బాబాయ్‌తో ఎలా ఉంటానో మీకెవరికీ తెలియదు !! బన్నీ ఎమోషనల్‌
చిక్‌ బాబాయ్‌తో ఎలా ఉంటానో మీకెవరికీ తెలియదు !! బన్నీ ఎమోషనల్‌