Jackfruit Health Benefits: పనస పండుతో అద్భుతమైన ప్రయోజనాలు..!

Jackfruit Health Benefits: అరోగ్యాన్ని అదుపులో ఉంచుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. తినే ఆహారం, జీవన శైలి తదితర మార్పుల కారణంగా..

Jackfruit Health Benefits: పనస పండుతో అద్భుతమైన ప్రయోజనాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 19, 2022 | 1:33 PM

Jackfruit Health Benefits: అరోగ్యాన్ని అదుపులో ఉంచుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. తినే ఆహారం, జీవన శైలి తదితర మార్పుల కారణంగా అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల చుట్టు తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్ని చిట్కాలు పాటిస్తే మన ఆరోగ్యం అదుపులో ఉంచుకోవచ్చు. అధిక ఒత్తిడి, తినే ఆహారం, పీల్చే గాలి, కాలుష్యం, ఉద్యోగంలో ఒత్తిడి తదితర కారణాల వల్ల మానిషికి వివిధ రోగాలు చుట్టుముడుతున్నాయి. దీంతో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. కరోనా కాలంలో కూడా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని నిపుణులు పదేపదే సూచించారు. రోగనిరోధక శక్తి ఉంటేనే అన్ని వైరస్‌లను తట్టుకోగలుగుతాము. ఒక్క కరోనా నుంచే కాకుండా వివిధ రకాల అంటు వ్యాధుల నుంచి కూడా రక్షించుకోవచ్చు. అయితే మీరు రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు అనేకమైన మార్గాలున్నాయి.

ప్రముఖ పోషకాహార నిపుణుడు రుజుటా దివేకర్‌ రోగనిరోధక శక్తి పెంచే ఆహారం జాక్‌ ఫ్రూట్‌ (పనస పండు) యొక్క ప్రయోజనాలేంటే చెబుతున్నారు. శరీరంలో ఉండే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అలాగే పనస పండు (జాక్‌ఫ్రూట్‌) విత్తనాలను తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. వాటికి ఉప్పు, మిరియాలతో ఉడికించి లేదా వేయించి రుచికరమైన ఆహారం తయారు చేసుకోవచ్చంటున్నారు. జింక్‌, విటమిన్లు, ఫైబర్‌ వంటి ఖనిజాలతో సమృద్దిగా ఉండే ఇవి మీ ఆహారంలో జోడించి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని రుజుటా దివేకర్‌ వివరిస్తున్నారు.

పనస పండు వల్ల కలిగే ఉపయోగాలు:

► పనస పండ్లలోని ఫైటోన్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. పనసలో ఖనిజాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. కణజాలాల నాశనాన్ని అడ్డుకుంటాయి.

► జాక్‌ఫ్రూట్‌ (పనస పండు)లో ఇనుము, విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్‌, ప్రోటీన్లు అధిక సంఖ్యలో ఉంటాయి.

► పరస పండు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెంచడమే కాకుండా ఇతర వ్యాధులు దరి చేరకుండా కాపాడుతుంది.

► పనస తొనలు తినడం ద్వారా మగవారిలోవీర్యకణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

► పనసలో ఉండే విటమిన్ ఎ కంటిచూపుని మెరుగుపరుస్తుంది. రేచీకటి సమస్య నుంచి కాపాడుతుంది. అంతేకాకుండా చర్మం మరియు జుట్టుల ఆరోగ్యంతో ఉండేలా ఎంతగానో ఉపయోగపడుతుంది.

► ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడేవారికి పనసపండు ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే పోషకాలు మరియు విటమిన్స్ రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి. ఇక రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది.

► ఇందులో ఉండే సోడియం అధిక రక్తపోటు బారి నుండి కాపాడి గుండె నొప్పి, గుండెపోటు సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. ఆస్తమా వంటి శ్వాసకోస వ్యాధుల నుండి కాపాడుతుంది.

► పనస పండు షుగరు వ్యాధి ఉన్నవారికి మంచి ఆహారంగా చెప్పాలి. దీనిని తినడం వలన శరీరానికి ఇన్సులిన్ అందించిన దానితో సమానం అవుతుంది.

► పనస పండులోని కాల్షియం శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది. ఇందులో ఉండే పైబర్ జీవక్రియలను సాఫీగా జరిగేలా చేస్తుంది. కడుపులో ఏర్పడే గ్యాసు మరియు అల్సర్ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.

(గమనిక: ఈ వివరాలన్ని వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలుంటే వైద్య నిపుణులను సంప్రదించాలి.)

ఇవి కూడా చదవండి:

Health Tips: మీకు కొలెస్ట్రాల్‌ పెరిగిపోతోందా..? వీటిని తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు..!

Hot Water Benefits: నిద్రపోయే ముందు వేడి నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి..