Lifestyle: చలిగా ఉందని రాత్రుళ్లు సాక్స్ వేసుకుంటున్నారా.?
చలికాలం రాత్రుళ్లు వెచ్చగా ఉండేందుకు చాలా మంది సాక్స్‌లను ధరిస్తుంటారు. అయితే దీనివల్ల ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా సాక్స్‌లు వేుకకొని పడుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయి.? వీటి నుంచి ఎలా బటపడాలి.? ఇప్పుడు తెలుసుకుందాం..

చలి తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. సాయంత్రం 5 గంటలకే చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో ప్రజలు ష్వటర్లు, దుప్పట్లు ఉపయోగించడం మొదలు పెట్టారు. చలి తీవ్రతను తట్టుకునే క్రమంలో మనలో కొందరు పాదాలకు సాక్స్‌లు ధరించి నిద్రపోతుంటారు. అయితే ఇది మంచి పద్ధతి కాదని, దీనివల్ల పలు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ రాత్రుళ్లు సాక్స్‌లు ధరించి నిద్రపోతే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
రాత్రంతా సాక్సులు ధరించి పడుకోవడం వల్ల కాళ్లలో చమట పేరుకుపోయే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చర్మం ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని అంటున్నారు. సాక్స్ ధరించడం వల్ల పాదాల నొప్పి వేధిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా అప్పటికే మీ పాదాలలో సమస్య ఉంటే, అది పెరిగే అవకాశం ఉంటుది.
ఇక రాత్రంతా సాక్స్‌లు ధరించడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. కాళ్లలో తలెత్తే సమస్యల కారణంగా నిద్ర నాణ్యత దెబ్బ తింటుందుని నిపుణులు చెబుతున్నారు. చల్లని వాతావరణంతో సాక్స్‌లు ధరించడం వల్ల ఎగ్జిమా, డెర్మటైటిస్ వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. చర్మ క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతున్నారు. ఇక చాలా బిగుతుగా ఉండే సాక్స్‌లు ధరించడం వల్ల రక్త ప్రసరణ మందగిస్తుంది. ఇది నరాలపై ఒత్తిడి తెచ్చి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
రాత్రుళ్లు సాక్స్‌లు ధరించాల్సి వస్తే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉన్ని సాక్స్‌లకు బదులుగా కాటన్ సాక్స్‌లను ధరించాలని చెబుతున్నారు. వీటివల్ల నష్టాన్ని కాస్త తగ్గించుకోవచచు. టైట్‌గా ఉండే సాక్స్‌లకు దూరంగా ఉండాలి. అలాగే రాత్రి పడుకునే ముందు కాళ్లను నీటితో బాగా శుభ్రం చేసుకున్న తర్వాతే సాక్స్‌లను శుభ్రం చేసుకోవాలి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..
