AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వినాయక చవితికి కుడుములు, ఉండ్రాళ్ళతో పాటు ఏఏ రాష్ట్రాల్లో ఏఏ ఆహరాన్ని నైవేద్యంగా సమర్పిస్తారంటే

గణపతి బప్పా కుములు, ఉండ్రాళ్ల ప్రేమికుడిగా ప్రసిద్ధి చెందారు. భక్తులు వినాయకుడికి రకరకాల పదార్ధాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే బోజ్జగానపయ్య నైవేద్యానికి సంబంధించిన ప్రాథమిక పదార్థాలు ఎక్కడైనా ఒకే విధంగా ఉంటాయి.. కొబ్బరి, బెల్లం, డ్రై ఫ్రూట్స్, అరటిపండ్లు, పులిహోర, బొబ్బట్లు , పోలీ, కొబ్బరి అన్నం, మోతీచూర్ లడ్డూ, శ్రీఖండ్, షీరా, రవ్వ పొంగలి, పాయసం సహా అనేక ఇతర ఆహార పదార్ధాలను పది రోజులు గణపయ్యకు నైవేద్యంగా సమర్పిస్తారు.

వినాయక చవితికి కుడుములు, ఉండ్రాళ్ళతో పాటు ఏఏ రాష్ట్రాల్లో ఏఏ ఆహరాన్ని నైవేద్యంగా సమర్పిస్తారంటే
Vinayaka Chaviti Special
Surya Kala
|

Updated on: Aug 29, 2024 | 4:06 PM

Share

దేశవ్యాప్తంగా హిందువులు చాలా ఉత్సాహంతో మరియు భక్తితో పూజిస్తారు. భాద్రపద మాసంలో జరుపుకునే గణేష్ చతుర్థి భారతదేశంలోని పశ్చిమ, మధ్య , దక్షిణ ప్రాంతాలలో వీధుల్లో మండపాలు ఏర్పాటు చేసి గణపతిని పూజిస్తారు. తొమ్మిది రోజులు పూజలు అందుకున్న గణపతిని అనంత చతుర్దశి నాడు 10 రోజుల తర్వాత నీటిలో నిమజ్జనం చేస్తారు.

గణపతి బప్పా కుములు, ఉండ్రాళ్ల ప్రేమికుడిగా ప్రసిద్ధి చెందారు. భక్తులు వినాయకుడికి రకరకాల పదార్ధాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే బోజ్జగానపయ్య నైవేద్యానికి సంబంధించిన ప్రాథమిక పదార్థాలు ఎక్కడైనా ఒకే విధంగా ఉంటాయి.. కొబ్బరి, బెల్లం, డ్రై ఫ్రూట్స్, అరటిపండ్లు, పులిహోర, బొబ్బట్లు , పోలీ, కొబ్బరి అన్నం, మోతీచూర్ లడ్డూ, శ్రీఖండ్, షీరా, రవ్వ పొంగలి, పాయసం సహా అనేక ఇతర ఆహార పదార్ధాలను పది రోజులు గణపయ్యకు నైవేద్యంగా సమర్పిస్తారు.

ఒడిశాలో

ఇవి కూడా చదవండి

గణేష్ చతుర్ధిని శివాంక దేవుడి పుట్టినరోజుగా జరుపుకుంటారు. ప్రధానంగా విద్యా సంస్థలు, విద్యార్థులు దీనిని పాటిస్తారు. మోదకాలు, లడ్డూలు పండాల్లో అందించే భోగ్‌లో భాగం. మధ్య ప్రదేశ్ లో బేసన్ లడ్డూలు, రవ్వతో చేసిన కేసరి ప్రసాదం సమర్పిస్తారు. ఇక రాజస్థాన్ భోగ్ గోధుమ పిండి ఆధారిత చుర్మా లడ్డూలను అందిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలలో వినాయక చవితి అని పిలుస్తారు. ఇక్కడ కూడా పిల్లలు, పెద్దలు ఇష్టంగా జరుపుకునే పండుగ. వినాయక చవితికి మహిళలు ప్రతిరోజూ ఏడెనిమిది రకాల ఆహారాన్ని తయారు చేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఉండ్రాళ్లు లేదా కుడుములు అనే సంప్రదాయ ఆహారం నైవేద్యం తప్పనిసరి. తీపి ఉండ్రాళ్లు, పాలతాలికలు వంటి వివిధ రకాల ఆహార పదార్ధాలను వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.

కేరళ

ఇక్కడ వినాయక చతుర్థి చింగమాసంలో జరుపుకుంటారు. మలయాళ క్యాలెండర్ ప్రకారం చింగం సంవత్సరం మొదటి నెల. ఇతర రాష్ట్రాల్లో జరుపుకునే ముందు పండుగ జరిగే అవకాశం ఉంది. కుంబిలప్పం ఒక సంప్రదాయ స్వీట్ ను నైవేద్యంగా సమర్పిస్తారు. బే ఆకు తో రుచిగా తయారు చేసే తీపి కుడుములు.

కర్ణాటక

కర్ణాటకలో వినాయక చతుర్థి సందర్భంగా వినాయకుని తల్లి గౌరీ (పార్వతి)ని కూడా పూజిస్తూ ఉత్సవాలు ప్రారంభిస్తారు. ఇక్కడ భక్తులు వివిధ దేవాలయాలలో తల్లికొడుకులిద్దరికీ ప్రార్థనలు చేస్తారు. ఈ రాష్ట్రంలోని స్త్రీలు దీర్ఘసుమంగళిగా ఉండడం కోసం, సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం గౌరీ దేవిని పూజిస్తారు. ఇక్కడ వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం పంచకజ్జాయ.

మహారాష్ట్ర

మహారాష్ట్రలో అత్యంత ముఖ్యమైన పండుగ. ఇక్కడ కూడా గణేష్ చతుర్ధి 10 రోజుల పాటు జరుపుకుంటారు. బప్పాకు స్వాగతం పలికేందుకు పెద్ద పెద్ద పండళ్లు, ఇళ్లలో విస్తృత ఏర్పాట్లు చేస్తారు. విగ్రహాల నిమజ్జనం అరేబియా సముద్రం, సరస్సులు లేదా చిన్న చెరువులలో జరుగుతుంది. ముంబై, పూణే, ఈ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మూషకంతో పాటు పసుపు, ఎరుపు పట్టు, ఆభరణాలు, పువ్వులతో అత్యంత ఆకర్షణీయమైన రీతిలో భారీ విగ్రహాలను అలంకరిస్తారు. వేయించిన మోదకాలు, శ్రీకండ్, పోలీ , లడ్డూలతో పాటు మొదకలు నైవేద్యంగా సమర్పిస్తారు.

గోవా

గోవాలో చోవోత్ అని ప్రసిద్ది చెందింది. గణపతి విగ్రహాన్ని స్థాపించిన చోట మాటోలి (కాలానుగుణ కూరగాయలతో కూడిన చెక్క పందిరి) ఏర్పాటు చేయబడింది. విగ్రహం సాధారణంగా పర్యావరణ అనుకూల పదార్థాలతో తయారు చేయబడుతుంది.

భజనలు పాడి, హారతి ఇచ్చిన అనంతరం మోదకం, నూరి వంటి ప్రసాదాలను దేవుడికి సమర్పిస్తారు. మోదకాలు సాధారణ తీపిగా ఉంటాయి, ఆవిరితో లేదా డీప్ ఫ్రైడ్ చేస్తారు. ఇక్కడ మోదకాలు కరంజీని పోలి ఉంటుంది.

తమిళనాడు

విగ్రహాలను రమణీయంగా అలంకరిస్తారు. పూజ-ఆరతి తర్వాత మోదకాలు లేదా శనగలు, నెయ్యప్పం, పాయసం అందించబడతాయి.

ఉత్తర ప్రదేశ్

పండల్లోని విగ్రహాలను బంగారు, వెండి ఆభరణాలతో అలంకరిస్తారు. భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉపవాసం, వేద స్తోత్రాల పటనం, సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం వంటివి పాటించబడతాయి. మోదకాలు , కొబ్బరికాయలు, గసగసాలు, పంచదార, ఖర్జూరం, బాదంపప్పులతో చేసిన తీపి పదార్ధాన్ని ప్రసాదంగా పంచిపెడతారు.

గుజరాత్

అహ్మదాబాద్‌లో గణేష్ చతుర్థి చాలా వైభవంగా జరుపుకుంటారు. గణపతి నిమజ్జన రోజున బాణాసంచా పేలుస్తారు. స్వామికి భోగ్ అంటే మోదకులు, లడూలు, శ్రీఖండ్ , ఖీర్ లను సమర్పిస్తారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..