- Telugu News Photo Gallery Spiritual photos Vinayaka Chavithi 2024: From Afghanistan to Japan and China, here’s how Lord Ganesha is celebrated outside India
Vinayaka Chavithi 2024: భారతదేశంలో మాత్రమే కాదు ఆఫ్ఘనిస్తాన్ నుండి జపాన్, చైనా వరకు అనేక దేశాల్లో వినాయకుడికి పూజలు
హిందూ దేవుళ్లలో ఒకరైన గణేశుడు కేవలం ఒక మతానికి మాత్రమే పరిమితం కాదు. హిందూ దేవతలకు చెందిన అనేక ఇతర దేవుళ్లలా వలే కాదు గణేశుడికి భారతదేశం వెలుపల కూడా అంటే ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నాడు. వినాయకుడి ప్రత్యేకత ఏమిటంటే ఆసియా ఖండలోని టిబెట్, చైనా, జపాన్, ఆగ్నేయాసియాలోని అనేక ఇతర ప్రాంతాలతో పాటు ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా దైవంగా పూజలను అందుకుంటున్నాడు.
Updated on: Aug 29, 2024 | 2:34 PM

లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో (UCLA) భారతీయ, ఆగ్నేయాసియా కళా చరిత్ర ప్రొఫెసర్ రాబర్ట్ ఎల్ బ్రౌన్ మాట్లాడుతూ గణేశుడిపై తాను చేసిన పరిశోధన విషయంపై స్పందిస్తూ ఆగ్నేయాసియాలో శాసనాలు, చిత్రాల రూపంలో గణేశుడి గురించి మొట్టమొదటి ప్రస్తావనలు ఉన్నాయని పేర్కొన్నారు. అవి 5వ , 6వ శతాబ్దాల నాటిదని వెల్లడించారు.

కంబోడియా: కంబోడియాలో 7వ శతాబ్దం నుంచి గణేశుడిని ప్రధాన దైవంగా పూజిస్తారు.ఈ దేశంలో గణేశుడుకి అంకితం చేయబడిన దేవాలయాలు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గణేశ ఆరాధన భారతదేశంలో విస్తృతంగా ప్రాచుర్యం పొందక ముందే ఈ దేశంకి గణపతి ఆరాధన ఉంది. అతను సంస్కృతిలో వచ్చే మార్పులతో పాటు గణపతి రూపం కూడా మారిపోయింది. ఉదాహరణకు, కంబోడియాలో వినాయకుడు తన ఏనుగు తల మానవ శరీరంతో నిటారుగా నిలబడి ఉన్నట్లు చిత్రీకరించబడింది.

థాయిలాండ్: ఈ దేశంలో గణేశుడిని ఫ్రా ఫికానెట్ లేదా ఫ్రా ఫికనేసువాన్‌గా గౌరవిస్తారు. పురాతన ప్రస్తావనలలో తమిళం, థాయ్ శాసనాలు ఉన్న ఫాంగ్-నాలో 10వ శతాబ్ధానికి చెందిన కాంస్య చిత్రం ఉంది. హిందువులు వలనే వినాయకుడు అడ్డంకులను తొలగించడంతోపాటు అదృష్టాన్ని , విజయాన్ని ప్రసాదించే దైవంగా పరిగణించబడుతున్నాడు. కళలు, విద్య, వాణిజ్యంతో కూడా సంబంధం కలిగి ఉన్నాడు. వ్యాపారస్తులు బంగారం, మిఠాయిలు,మోదకం, పండ్లను వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. వ్యాపారవేత్తలకు వినాయకుడు అత్యంత గౌరవనీయమైన దేవుడు. అయితే, వ్యాపారం తగ్గినప్పుడు వినాయకుడి బొమ్మ లేదా విగ్రహం తలక్రిందులుగా వేలాడదీసే సంప్రదాయం ఇక్కడ ఉంది.

థాయిలాండ్ దేశంలోని చాచోయెంగ్సావో సాంస్కృతిక నగరాన్ని "గణేశ నగరం" అని పిలుస్తారు. ఎందుకంటే చాచోయెంగ్సావో చుట్టూ మూడు వేర్వేరు దేవాలయాలలో మూడు భారీ గణేశ (ఫ్రా ఫికనెట్) విగ్రహాలున్నాయి. ఫ్రాంగ్ అకత్ టెంపుల్ వద్ద 49 మీటర్ల ఎత్తున్న వినాయకుడు ఎత్తైన గణేశుడు, ఖ్లాంగ్ ఖుయాన్ గణేష్ ఇంటర్నేషనల్ పార్క్‌లోని 39 మీటర్ల ఎత్తైన వినాయకుడు ఎత్తైన వినాయకుడు. సమన్ వత్తనారామ్ ఆలయంలో 16 మీటర్ల ఎత్తు , 22 మీటర్ల పొడవు గల వినాయకుడు కూడా ఉన్నాడు. దౌత్యానికి అధిష్టాన దైవంగా కూడా పరిగణించబడుతున్నాడు. గణేశుడు బ్యాంకాక్ సెంట్రల్ వరల్డ్ (గతంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్) వెలుపల ఒక ఎత్తైన పీఠంపై ఉన్నాడు. ప్రభుత్వ లలితకళల శాఖ చిహ్నంలో కూడా వినాయకుడు ఒక భాగం.

చైనా: ఉత్తర చైనాలో అత్యంత ప్రాచీనమైన వినాయక విగ్రహం 531 CE నాటి శాసనాన్ని కలిగి ఉంది. టున్-హువాంగ్‌లోని రాక్-కట్ టెంపుల్‌లో వినాయకుడి చిత్రం.. కుంగ్-హ్సీన్‌లోని అదే విధమైన రాక్-కట్ ఆలయంలో మరొకటి ఉంది. అయినప్పటికీ, చైనాలో వినాయకుడిని ప్రతికూల శక్తిగా చూస్తారు.

జపాన్: భారతదేశం నుండి చైనా, ఆగ్నేయాసియా అంతటా ప్రయాణిస్తూ, గణేశుడు 8వ శతాబ్దంలో జపాన్‌కు చేరుకున్నాడు. ఇక్కడ కాంగీటెన్‌గా గౌరవించబడుతున్నాడు. జపనీస్ బౌద్ధమతంతో సంబంధం కలిగి ఉన్నాడు. కాంగీటెన్ విభిన్న వర్ణనలలో అత్యంత ప్రజాదరణ పొందిన ద్వంద్వ-శరీర కంగిటెన్‌ని చూపుతుంది. ఇది ఇద్దరు గణేశులు కౌగిలించుకున్న రూపం - మగ ,ఆడ ఏనుగు తలలున్న దైవాలు కౌగిలించుకుంటున్నారు. కంగిటెన్ అదృష్టాన్ని ఇచ్చే శక్తివంతమైన దేవతగా పరిగణించబడుతున్నాడు. వ్యాపారులు, జూదగాళ్లు, నటులు సహా పలువురుతో కాంగీటెన్ పూజలను అందుకుంటున్నాడు.

ఆఫ్ఘనిస్తాన్: ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ సమీపంలోని గార్డెజ్‌లో ఖింగల్ అనే రాజు ప్రతిష్టించిన వినాయకుడి విగ్రహం కనుగొనబడింది. పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు గణేశుడిని "ఇండో-ఆఫ్ఘన్ పాఠశాలకు సంబంధించిన విలక్షణమైన ఉత్పత్తి"గా భావిస్తారు. ఇది 7-8వ CEలో టర్క్ షాహీల కాలానికి చెందినదిగా భావిస్తున్నారు.

టిబెట్: టిబెటన్ బౌద్ధమతంలో అత్యంత గౌరవనీయమైన దేవుళ్ళలో ఒకరైన గణేశుడిని 11వ శతాబ్దం ADలో భారతీయ బౌద్ధ మత పెద్దలు అతిసా దీపంకర సృజ్ఞ , గయాధర పరిచయం చేశారు. టిబెట్‌లోని గణపతి ఆరాధన స్థాపకుడు, అతిసా భారతీయ తాంత్రిక గురువులు గణేశుడిపై అనేక భారతీయ గ్రంథాలను అనువదించినట్లు నమ్ముతారు. టిబెటన్ పురాణాలలో ఒక పురాణం లామాయిజం సంస్థను స్థాపించడంలో గణేశ పాత్రను ఆపాదించింది. 11వ లేదా 12వ శతాబ్దానికి చెందిన ఈ పురాణం ప్రకారం, గణపతి శాక్య పండితుని సోదరుడిని తన తొండలో పట్టుకుని, మేరు పర్వత శిఖరంపై ఉంచి, ఒక రోజు టిబెట్‌లోని అన్ని ప్రావిన్సులను తన పాలనలోకి తీసుకుంటాడని ప్రవచించాడు.
