Vastu tips: వాస్తు ప్రకారం ఇంట్లో గడియారం ఏ దిశలో ఉండాలి.. ఏ దిశలో ఉండకూడదు?
తూర్పు, పడమర లేదా ఉత్తర దిశలు ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తాయి. అంతేకాకుండా, మనం తలపెట్టిన పనులన్నీ అంతరాయం లేకుండా సజావుగా సాగుతాయని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇల్లు లేదా కార్యాలయంలో దక్షిణం వైపు గోడకు గడియారం ఉంచకూడదని చెబుతున్నారు. అలాగే, ఇంటి ప్రధాన ద్వారం పైన కూడా గడియారాన్ని పెట్టకూడదని అంటున్నారు. అంతేకాదు.. ఇంట్లో గోడ గడియారం

గడియారాన్ని సరైన దిశలో ఉంచడం ప్రతి ఒక్కరి ఇంటికి అత్యంత ముఖ్యం. లేకుంటే అది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, గడియారాన్ని సరైన దిశలో ఉంచడం కూడా చాలా ముఖ్యం అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఎందుకంటే గడియారం దిశ మన పనిలో మనం పొందే ఫలితాలను నిర్ణయించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. వాస్తు ప్రకారం, గడియారాన్ని తప్పు దిశలో ఉంచినట్లయితే, ఆ ఇంట్లో సమస్యలు చుట్టుముడతాయని సూచిస్తున్నారు. ఆ ఇంటిపై ప్రతికూల ప్రభావం కూడా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. వాస్తు ప్రకారం ఇంట్లో గడియారం పెట్టడానికి సరైన దిశ ఎక్కడో పూర్తి వివరాల్లోకి వెళితే..
వాస్తు ప్రకారం, గడియారాన్ని ఇల్లు లేదా ఆఫీసులలో ఉంచుకోవటానికి సరైన దిశ తూర్పు, పడమర లేదా ఉత్తర వైపు అంటున్నారు వాస్తు నిపుణులు. గడియారాన్ని ఇంట్లో ఈశాన్యంలో పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. ఈ దిశ సంపదను సూచిస్తుంది. వాస్తు ప్రకారం, గడియారాన్ని ఇంట్లో సరైన దిశలో ఉంచినట్లయితే, అది ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుంది. వ్యతిరేక దిశలో ఉంచినట్లయితే, ప్రతికూలత పెరుగుతుంది.
అయితే వాస్తు ప్రకారం దక్షిణం వైపు ఉన్న ఇంట్లో గడియారాలు, అద్దాలు పెట్టకూడదని చెబుతున్నారు. ఈ దిశ యమ దిశను సూచిస్తుంది. అలాగే వాస్తు ప్రకారం ఇంట్లోని గడియారాలను ముఖద్వారానికి పెట్టకూడదని చెబుతున్నారు. దీని వల్ల ఆ ఇంట్లో టెన్షన్లు పెరుగుతాయిన చెబుతున్నారు.
తూర్పు, పడమర లేదా ఉత్తర దిశలు ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తాయి. అంతేకాకుండా, మనం తలపెట్టిన పనులన్నీ అంతరాయం లేకుండా సజావుగా సాగుతాయని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇల్లు లేదా కార్యాలయంలో దక్షిణం వైపు గోడకు గడియారం ఉంచకూడదని చెబుతున్నారు. అలాగే, ఇంటి ప్రధాన ద్వారం పైన కూడా గడియారాన్ని పెట్టకూడదని అంటున్నారు. అంతేకాదు.. ఇంట్లో గోడ గడియారం పాడవకుండా జాగ్రత్త వహించండి. వాస్తుప్రకారం ఇంట్లో పెట్టుకునే ఏ వస్తువులు పగిలిపోకుండా చూసుకోవాలి. ఇవి ఇంట్లో నెగిటివిటీని పెంచుతాయి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..