- Telugu News Photo Gallery Including Pumpkin Seeds In Diet Gives Amazing Benefits For Male And Know How To Eat
నెల రోజులపాటు ఖాళీ కడుపుతో గుమ్మడి గింజలు తింటే ఏమౌతుందో తెలుసా..? స్త్రీ, పురుషులిద్దరికీ..
గుమ్మడి గింజలు స్త్రీ, పురుషులిద్దరికీ వరం అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. వీటిని తినడం వల్ల శరీరంలోని ప్రతి భాగానికి బలం లభిస్తుందని చెబుతున్నారు. గుమ్మడికాయ గింజలు శక్తితో నిండి ఉంటాయి. వాటికి మనిషి శరీరాన్ని ఉక్కులా తయారు చేయగల సామర్థ్యం ఉంది. మరీ ముఖ్యంగా ఆయుర్వేదంలో గుమ్మడికాయ గింజలు పురుషులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతారు. గుమ్మడి గింజలతో కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
Updated on: Mar 16, 2025 | 7:16 AM

గుమ్మడి విత్తనాలు అతిగా తినటం వల్ల త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే.. ఈ విత్తనాలు కేలరీలతో నిండి ఉంటాయి. అధికంగా తింటే అవి బరువు పెరగడానికి కారణమవుతాయి. కాబట్టి, అవసరమైన మోతాదు కంటే ఎక్కువ తినకుండా చూసుకోండి.

గుమ్మడి గింజల్లో క్యాలరీలు ఎక్కువ కాబట్టి ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. తక్కువ రక్తపోటు ఉన్నవాళ్లు గుమ్మడి గింజలు తినకుండా ఉండటం మంచిది. ఎందుకంటే అవి రక్తపోటును తగ్గిస్తాయి. కొందరిలో అలెర్జీ కూడా ఉంటుంది. చర్మంపై దద్దుర్లు, తామర ఇతర చర్మ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటిని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.

గుమ్మడి అత్యధిక పోషక విలువలు కలిగిన కూరగాయలలో ఒకటి. దీని రసం ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. గుమ్మడికాయ రసంలో విటమిన్లు ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా తరచుగా వచ్చే జలుబు, దగ్గు సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది.

మీరు మీ ఆహారంలో గుమ్మడిక గింజలను చేర్చుకుంటే, శరీరానికి దాని నుండి ట్రిప్టోఫాన్ లభిస్తుంది. శరీరానికి ట్రిప్టోఫాన్ అందినప్పుడు, అది నిద్రలేమి సమస్యను తొలగిస్తుంది. తరచూ గుమ్మడి గింజలు తినటం వల్ల శరీరం ట్రిప్టోఫాన్‌ను సెరోటోనిన్‌గా మారుస్తుంది. ఇది సంతోషకరమైన హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి శరీరానికి విశ్రాంతినిచ్చి మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుంది.

క్యాన్సర్‌కు కారణమయ్యే ప్రమాదకరమైన విషయాలు మన చుట్టూ పెరిగాయి. వాటికి దూరంగా ఉండటం కష్టం. కానీ వాటి ప్రభావాన్ని తగ్గించడానికి, మీరు సరైన ఆహారం తీసుకోవచ్చు. మీ ఆహారంలో గుమ్మడికాయ గింజలను చేర్చుకోవటం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని పలు పరిశోధనల్లో తేలింది. అయితే, ఒక నెలరోజుల పాటు ఉదయాన్నే ఖాళీ కడుపుతో సరైన మోతాదులో వీటిని తినటం వల్ల మీ శరీరంలో ఊహించని మార్పులు గమనిస్తారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.




