యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు పప్పులు తినవచ్చా?.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే అధిక ప్రొటీన్ పప్పులను తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో సమస్యలు పెరుగుతాయి. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు రాజ్మా కూడా తీసుకోవడం మానేయాలి. రాజ్మా ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ లక్షణాలు పెరుగుతాయి. దీనివల్ల సమస్యలు తలెత్తుతాయి.
యూరిక్ యాసిడ్ శరీరం ఉత్పత్తి చేసే విషం లాంటిది. ఇది ప్రతి ఒక్కరి శరీరంలో ఉత్పత్తి అవుతుంది. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ క్రమంలోనే యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు పప్పులు తినవచ్చా అనేది చాలా మంది ప్రజల్లో తరచుగా తలెత్తే ప్రశ్న. అసలు ఈ సమస్య ఉన్నవారు పప్పులు తినొచ్చా..? తింటే ఎలాంటి ప్రభావం ఉంటుంది..? యూరిక్ యాసిడ్ హోం రెమెడీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
యూరిక్ యాసిడ్ ఉన్నప్పుడు పప్పులు తినవచ్చా అనే ప్రశ్న చాలా మందికి తరచుగా ఉంటుంది. పప్పు దినుసులు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పప్పులతో ప్రోటీన్ కంటెంట్ వృద్ధి చెందుతుంది. ఇది పప్పుల ప్రోటీన్ కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే అధిక ప్రొటీన్ పప్పులను తీసుకోవాల్సి ఉంటుంది.
యూరిక్ యాసిడ్ బాధితులు ముఖ్యంగా ప్రోటీన్-రిచ్ ఫుడ్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే..ప్రోటీన్ వారికి హానికరం. ఇందులో పాలు, పెరుగు, కిడ్నీ బీన్స్, పచ్చి బఠానీలు, బచ్చలికూర, కాయధాన్యాలు మొదలైన వాటిని తీసుకోవడం మానుకోవాలి. కందిపప్పు, బఠాణీలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.
యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు, మీరు గంజి తినకూడదు. దీంతో సమస్యలు పెరుగుతాయి. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు రాజ్మా కూడా తీసుకోవడం మానేయాలి. రాజ్మా ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ లక్షణాలు పెరుగుతాయి. దీనివల్ల సమస్యలు తలెత్తుతాయి.