AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pregnancy Test: ఇకపై ప్రెగన్సీ టెస్ట్‌ మరింత సులువు.. మార్కెట్లోకి త్వరలోనే కొత్త రకం టెస్ట్‌ కిట్స్‌.

వైద్య రంగంలో రోజురోజుకి విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు రోగ నిర్ధారణ జరగాలంటే పెద్ద ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు ఎన్నో రకాల వ్యాధులను చాలా సులభంగా గుర్తించే రోజులు వచ్చేశాయ్‌. చిన్న రక్త పరీక్షతో ఎన్నో వ్యాధులను ముందుగానే గుర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో వినూత్న సృష్టి జరిగింది...

Pregnancy Test: ఇకపై ప్రెగన్సీ టెస్ట్‌ మరింత సులువు.. మార్కెట్లోకి త్వరలోనే కొత్త రకం టెస్ట్‌ కిట్స్‌.
Pregnency Test
Narender Vaitla
|

Updated on: Jun 20, 2023 | 3:16 PM

Share

వైద్య రంగంలో రోజురోజుకి విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు రోగ నిర్ధారణ జరగాలంటే పెద్ద ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు ఎన్నో రకాల వ్యాధులను చాలా సులభంగా గుర్తించే రోజులు వచ్చేశాయ్‌. చిన్న రక్త పరీక్షతో ఎన్నో వ్యాధులను ముందుగానే గుర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో వినూత్న సృష్టి జరిగింది. సాధారణంగా ప్రెగ్నెన్సీ టెస్ట్‌ను ఇంట్లో నిర్వహించుకునే వారు యూరిన్‌ కిట్స్‌ను ఉపయోగిస్తారనే విషయం తెలిసిందే. దాదాపు అందరికీ తెలిసిన విధానం ఇదే. ఉదయం పూట మూత్రాన్ని కిట్‌లో వేయడం ద్వారా ప్రెగ్నెన్సీ పాజిటిటా.? కాదా అనే విషయాన్ని తెలుసుకుంటారు.

అయితే ఇక నుంచి పెగ్రెన్సీ టెస్ట్‌ నిర్ధారణ కోసం మూత్రం అవసరం లేకుండా సరికొత్త కిట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. లాలాజలంతో గర్భనిర్ధారణ చేసుకునే కిట్‌ను అందబాటులోకి తీసుకొచ్చారు. జరూసలెం దేశంలోని సాలిగ్నోస్టిక్స్‌ అనే స్టార్టప్‌ కంపెనీ ఈ కిట్‌ను రూపొందించింది. ఈ కిట్‌కు ‘సాలిస్టిక్‌’గా పేరు పెట్టారు. తాజాగా యూకేలో దీనిని లాంచ్‌ చేశారు. యూకేతో పాటు ఐర్లాండ్‌లోనూ ఈ కిట్స్‌ మార్కెట్లో లభిస్తున్నాయి. సాలిగ్నోస్టిక్స్‌ కంపెనీ ఈ కిట్స్‌ను అమెరికాలో అమ్మడానికి ఎఫ్‌డీఏ అనుతమి కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది.

త్వరలోనే ఈ కిట్స్‌ ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇకపై మూత్రానికి బదులుగా లాలాజలంతోనే గర్భనిర్ధారణ చేసుకోవచ్చన్నమాట. కరోనా నిర్ధారణ టెస్టింగ్ కిట్స్‌లో ఉన్న సాంకేతికతను ఉపయోగించే ఈ సెలైవా ప్రెగ్నెన్సీ టెస్ట్‌ కిట్‌ను తయారు చేశారు. టెస్ట్ కిట్‌ను కాసేపు నోట్టో పెట్టుకొని ఉంచితే చాలు లాలాజలం ఆధారంగా ఫలితం చూపిస్తుంది. ఈ టెస్ట్‌ కిట్‌ గర్భాశయాన్ని సిద్ధం చేయడంలో ఉపయోగపడే HCG హార్మోన్‌ను గుర్తించడం ద్వారా ప్రెగ్నెన్సీని నిర్ధారిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే