Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deep Sleep Tips: గాఢ నిద్రలోకి జారుకోవాలా.. ఈ చిన్న చిట్కాలు ట్రై చేయండి..

నిద్ర అనేది మనిషికి చాలా అవసరం. రెండు రోజులు తిండి లేకపోయినా ఉండొచ్చు. కానీ ఒక రోజు నిద్ర సరిగా లేకపోయినా.. మనిషి మనిషిలో అస్సలు ఉండలేరు. శరీరంలో హార్మోన్లు కూడా ఇన్ బ్యాలెన్స్ అవుతాయి. మంచి నిద్ర కోసం ఎంతో పరితపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న రోజుల్లో నిద్ర అనేది చాలా కష్టంగా మారుతుంది. పనుల ఒత్తిడి, టెన్షన్లు కారణంగా నిద్ర అనేది అస్సలు పడటం లేదు. దీని వలన అనేక దీర్ఘకాలిక సమస్యల బారిన పడుతున్నారు. రాత్రి పూట సరిగా నిద్రపోకపోతే..

Deep Sleep Tips: గాఢ నిద్రలోకి జారుకోవాలా.. ఈ చిన్న చిట్కాలు ట్రై చేయండి..
Sleep on Stomach
Chinni Enni
|

Updated on: Sep 02, 2024 | 4:46 PM

Share

నిద్ర అనేది మనిషికి చాలా అవసరం. రెండు రోజులు తిండి లేకపోయినా ఉండొచ్చు. కానీ ఒక రోజు నిద్ర సరిగా లేకపోయినా.. మనిషి మనిషిలో అస్సలు ఉండలేరు. శరీరంలో హార్మోన్లు కూడా ఇన్ బ్యాలెన్స్ అవుతాయి. మంచి నిద్ర కోసం ఎంతో పరితపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న రోజుల్లో నిద్ర అనేది చాలా కష్టంగా మారుతుంది. పనుల ఒత్తిడి, టెన్షన్లు కారణంగా నిద్ర అనేది అస్సలు పడటం లేదు. దీని వలన అనేక దీర్ఘకాలిక సమస్యల బారిన పడుతున్నారు. రాత్రి పూట సరిగా నిద్రపోకపోతే డయాబెటీస్, క్యాన్సర్, బీపీ వంటి సమస్యలు ఎటాక్ చేస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మంచి నిద్ర కోసం పరితపించే వాళ్లు ఇప్పుడు చెప్పే ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. నిద్ర క్వాలిటీ పెరుగుతుంది. ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూసేయండి.

గోరు వెచ్చని పాలు:

రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలు తాగితే మంచి నిద్ర పడుతుందని ఇంట్లో పెద్ద వాళ్లు, ఆరోగ్య నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. అంతే కాదు పలు అధ్యయనాల్లో రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలు తాగడం వల్ల మంచి నిద్ర పడుతుందని తేలింది. కాబట్టి మంచి నిద్ర పట్టాలంటే గోరు వెచ్చని పాలు తాగండి.

బాదం పాలు:

రాత్రి పూట గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. బాదం పాలు కూడా ఎంతో చక్కగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే బాదం పాలులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి నిద్రను ప్రేరేపిస్తుంది. అంతే కాకుండా శరీరంలోని కండరాలను కూడా రిలాక్స్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

గోల్డెన్ మిల్క్:

రాత్రి పడుకునే ముందు గోల్డెన్ మిల్క్ అదేనండి పసుపు పాలు తాగడం వల్ల కూడా నిద్ర అనేది చక్కగా పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ పాలు తాగడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది.

అల్లం టీ:

నిద్ర చక్కగా పట్టడంలో అల్లం టీ కూడా ఎంతో చక్కగా సహాయ పడుతుంది. శరీరానికి కూడా రిలాక్స్ చేస్తుంది. శరీర నొప్పులను తగ్గిస్తుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు అల్లం టీ తాగడం బెటర్. అయితే కేవలం నీటిలో అల్లం వేసి మరిగించిన టీని మాత్రమే తాగాలి. ఇందులో టీ పొడి, పంచదార, పాలు వంటివి కలపకూడదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Horoscope Today: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు వారికి అనుకూల సమయం..
Horoscope Today: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు వారికి అనుకూల సమయం..
మూడురోజుల్లో నీళ్లు తెస్తామన్నారు.. పదేళ్లైన చుక్క తేలేదు-సీఎం
మూడురోజుల్లో నీళ్లు తెస్తామన్నారు.. పదేళ్లైన చుక్క తేలేదు-సీఎం
గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్..సిమ్‌ని ఇలా చేయండి
గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్..సిమ్‌ని ఇలా చేయండి
మీకు యూట్యూబ్‌ ఛానల్‌ ఉందా? జూలై 15 నుంచి కొత్త రూల్స్‌..!
మీకు యూట్యూబ్‌ ఛానల్‌ ఉందా? జూలై 15 నుంచి కొత్త రూల్స్‌..!
ఆంధ్రా ప్యారిస్ అందాలు తిలకించేలా బోటు షికార్.... ఎప్పుడంటే..
ఆంధ్రా ప్యారిస్ అందాలు తిలకించేలా బోటు షికార్.... ఎప్పుడంటే..
ఫ్లైట్‌ కిటికీలు గుండ్రంగా ఎందుకు ఉంటాయో తెలుసా..? కారణాలు ఇవే..!
ఫ్లైట్‌ కిటికీలు గుండ్రంగా ఎందుకు ఉంటాయో తెలుసా..? కారణాలు ఇవే..!
5 నిమిషాల్లో 100 శాతం ఛార్జ్.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 3000 కి.మీ
5 నిమిషాల్లో 100 శాతం ఛార్జ్.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 3000 కి.మీ
రెండు రాష్ట్రాల అధికారులను బురిడీ కొట్టించారు.. ఎట్టకేలకు ఏపీలో..
రెండు రాష్ట్రాల అధికారులను బురిడీ కొట్టించారు.. ఎట్టకేలకు ఏపీలో..
విటమిన్ బి12 లోపం మరణానికి దారితీస్తుందా? అది శరీరానికి ఎంత హాని
విటమిన్ బి12 లోపం మరణానికి దారితీస్తుందా? అది శరీరానికి ఎంత హాని
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఏపీ సర్కార్
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఏపీ సర్కార్
అమెరికా కీలక పరిశోధన.. ఏఐతో ఆకస్మిక గుండెపోటు మరణాలకు చెక్‌
అమెరికా కీలక పరిశోధన.. ఏఐతో ఆకస్మిక గుండెపోటు మరణాలకు చెక్‌
మూడో బిడ్డను కనండి.. రూ.12 లక్షల రివార్డు అందుకోండి
మూడో బిడ్డను కనండి.. రూ.12 లక్షల రివార్డు అందుకోండి
కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!
కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!
గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు
గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు
బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
ధైర్యమున్నోళ్లే చూడాల్సిన సినిమా.. మనుషుల్ని తినే ఫ్యామిలీ
ధైర్యమున్నోళ్లే చూడాల్సిన సినిమా.. మనుషుల్ని తినే ఫ్యామిలీ
బ్లాక్‌ సాల్ట్‌ వాడి చూడండి.. ఫలితాలు చూస్తే ఆశ్చర్యపోతారు
బ్లాక్‌ సాల్ట్‌ వాడి చూడండి.. ఫలితాలు చూస్తే ఆశ్చర్యపోతారు
స్నేహితుడికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి.. మహిళగా మార్చి అత్యాచారం
స్నేహితుడికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి.. మహిళగా మార్చి అత్యాచారం
పేలిన రిఫ్రిజిరేటర్‌.. మసిబొగ్గుగా మారిన ఇల్లు..!
పేలిన రిఫ్రిజిరేటర్‌.. మసిబొగ్గుగా మారిన ఇల్లు..!
170 కేజీల బరువు.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు
170 కేజీల బరువు.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు