Health: మల్టీ విటమిన్స్ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారా.? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నట్లే
ఆరోగ్యంగా ఉండడంలో విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిసిందే. శరీరానికి కావాల్సిన అన్ని విటమిన్స్ సక్రమంగా లభిస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. అయితే తీసుకునే ఆహారం ద్వారా అన్ని విటమిన్స్ లభిస్తాయా అంటే కచ్చితంగా అవునని సమాధానం చెప్పలేం. అందుకే మనలో కొందరు మల్టీ విటమిన్స్ ట్యాబ్లెట్స్‌ను తీసుకుంటుంటారు...
ఆరోగ్యంగా ఉండడంలో విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిసిందే. శరీరానికి కావాల్సిన అన్ని విటమిన్స్ సక్రమంగా లభిస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. అయితే తీసుకునే ఆహారం ద్వారా అన్ని విటమిన్స్ లభిస్తాయా అంటే కచ్చితంగా అవునని సమాధానం చెప్పలేం. అందుకే మనలో కొందరు మల్టీ విటమిన్స్ ట్యాబ్లెట్స్‌ను తీసుకుంటుంటారు. అయితే ఈ ట్యాబ్లెట్స్‌ను అధికంగా తీసుకుంటే అనర్థాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. మల్టీ విటమిన్స్ ట్యాబ్లెట్స్ కారణంగా.. వికారం, కడుపు నొప్పి, అతిసారం, మలబద్ధకం, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు, దురద వంటి సమస్యలకు దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి. నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
* కొవ్వులో కరిగే విటమిన్లు A, D, E, K వంటివి శరీరంలో పేరుకుపోతాయి. వీటిని అధికంగా తీసుకుంటే శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. మైకం, వికారం, చర్మంలో మార్పులు వంటి లక్షణాలకు దారి తీస్తాయి. శరీరంలో ఈ విటమిన్స్ ఎక్కువైతే లివర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
* మల్టీ విటమిన్స్‌ను ఎక్కువగా తీసుకంటే జీర్ణ సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఐరన్, జింక్ వంటి వాటివల్ల జింక్, విరేచనాలు, కడుపులో తిమ్మిరి వంటి సమస్యలు ఎక్కువవుతాయి.
* విటమిన్ సి, డి వంటి వాటిని అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మూత్రపిండాల్లో కాల్షియంతో పాటు ఇతర ఖనిజాలు ఎక్కువైతే ఈ సమస్య వస్తుంది.
* విటమిన్ కే రక్తం పల్చగా మారడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ విటమిన్‌ను అధికంగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవని చెబుతున్నారు.
* శరీరంలో విటమిన్ బీ6 ఎక్కువైతే కూడా ఇబ్బందులు తప్పవని నిపుణులు అంటున్నారు. ఈ విటమిన్ కారణంగా తిమ్మిరి, జలదరింపు వంటి నాడీ సంబంధిత సమస్యలకు కారణమవుతుంది.
* ఇక విటమిన్ ఈ రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది. రక్తం పల్చగా మారడానికి ట్యాబ్లెట్స్ వాడే వారిలో విటమిన్ ఈ ఎక్కువైతే సమస్య మరింత ఎక్కువుతుందని అంటున్నారు.
* శరీరంలో కాల్షియం ఎక్కువైతే మెగ్నీలియం సమత్యులత దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కండరాల తిమ్మిరి, గుండె దడ వంటి లక్షణాలకు దారి తీస్తుంది. అందుకే మల్టీ విటమిన్స్‌ను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా నష్టాలు తప్పవు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..