Bad breath problem: నోటి దుర్వాసతో ఇబ్బందిపడుతున్నారా..? ఈ చిట్కాలు పాటించండి..

Jyothi Gadda

Jyothi Gadda |

Updated on: Mar 18, 2023 | 8:02 PM

నోట్లోని చెడు వాసనకు కారణమైన బ్యాక్టీరియాను తరిమేందుకు సహజసిద్ధమైన మౌత్‌ వాష్‌లను వినియోగించాలి. ముఖ్యంగా నోటి దుర్వాసన పంటి సమస్యల వల్ల వస్తుంటుంది. వీలైనంత వరకు

Bad breath problem: నోటి దుర్వాసతో ఇబ్బందిపడుతున్నారా..? ఈ చిట్కాలు పాటించండి..
Remedies For Bad Breath

మనలో చాలా మంది నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు పాపం పదిమందిలో మాట్లాడలేకపోతుంటారు. నోటి దుర్వాసనను తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అలాంటి వారికోసం, నోటి దుర్వాసన తగ్గించుకోవడానికి కొన్ని అద్భుతమైన చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం.. నోటి దుర్వాసన సమస్య ఉన్న వారు కొన్ని రకాల జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి. నోటి దుర్వాసనతో ఇబ్బంది పడేవారు ఎక్కువగా నీరు త్రాగడం వల్ల కొంతమేర నోటి దుర్వాసన నుండి బయటపడవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. నోరు పొడిగా అనిపించినప్పుడు నీటిని తాగడం వల్ల, నోట్లో చెడు బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది. ఇక లాలాజలం మీ నోటిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా నిరోధిస్తుంది.

దంతాలు, నోటిని సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల నోటి దుర్వాసన తలెత్తే అవకాశం ఉంది. తరచూ నోరు పొడిబారడం, చిగుళ్ల సమస్యలు, దంతాల్లో క్యావిటీ, ఉల్లి, వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా నోటి దుర్వాసన సమస్య ఏర్పడుతుంది. పళ్ల మధ్య ఆహారం ఇరుక్కుపోవడం, నాలుకపై పేరుకోవడం, డయాబెటిస్‌, సల్ఫర్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటి దుర్వాసనకు కారణం అవుతుంది. ధూమపానం, మద్యం, ఒత్తిడి, ఆందోళన కూడా నోటి దుర్వాసనకు కారణం.

ఔషధగుణాలున్న నిమ్మరసంతో బ్రష్‌ చేయడం వల్ల దుర్వాసన సులభంగా తగ్గించుకోవచ్చు. రోజులో రెండు సార్లు బ్రష్‌ చేయడాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. దానికి తోడు టూత్‌ బ్రష్‌లను రెండు మూడు నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. నోట్లోని చెడు వాసనకు కారణమైన బ్యాక్టీరియాను తరిమేందుకు సహజసిద్ధమైన మౌత్‌ వాష్‌లను వినియోగించాలి. ముఖ్యంగా నోటి దుర్వాసన పంటి సమస్యల వల్ల వస్తుంటుంది. వీలైనంత వరకు మన నోటిని పళ్లను శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.

ఇవి కూడా చదవండి

ప్రతి రోజు ఉదయం బ్రష్ చేసిన తరువాత తప్పనిసరిగా ఉప్పు నీటితో నోటిని పుక్కిలించుకోవాలి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కళ్లుప్పు వేసుకుని కలిపి.. దానిని రోజులో రెండు మూడు సార్లైనా పుక్కిలించాలి. అది కూడా ఆహారం తీసుకున్న తరువాత ఇలా చేయడం వల్ల నోట్లో ఏదైనా ఆహారం మిగిలిపోయి ఉంటే నోరు శుభ్రం అవుతుంది. అంతేకాదు నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu