AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ మేనమామలు బంగారం..! మేనకోడలి పెళ్లికి కోట్ల విలువజేసే కానుకలు ఇచ్చి రికార్డ్‌ సృష్టించారు..

ఇక్కడ చారిత్రాత్మక మైరాను నింపే సంప్రదాయం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. గతంలో ఒక కుటుంబం మైరాలో భాగంగా 1 కోటి వరకు మేనమామలు సమర్పించారు.

ఈ మేనమామలు బంగారం..!  మేనకోడలి పెళ్లికి కోట్ల విలువజేసే కానుకలు ఇచ్చి రికార్డ్‌ సృష్టించారు..
Maternal Uncles Gift
Jyothi Gadda
|

Updated on: Mar 18, 2023 | 6:43 PM

Share

తల్లి తోడబుట్టిన సోదరులు మనకు మేనమామలు.. తండ్రి తర్వాత తండ్రి అంతటి స్థానం మేనమామకే ఉంటుంది. అందుకనే తన మేనకోడలికి జరిగే ఏ శుభకార్యంలోనైనా మేన మామ పాత్ర తప్పక ఉండాల్సిందే.. తాజాగా ముగ్గురు మేనమామలు తమ మేనకోడలి పెళ్ళికి ఇచ్చిన గిఫ్ట్‌ రికార్డ్‌ సృష్టించింది. మేనకోడలి పెళ్లి కోసం ముగ్గురు మేనమామలు కలిసి కోట్ల విలువజేసే కానుకలు చదివించుకున్నారు. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ముగ్గురు రైతు సోదరులు చరిత్ర సృష్టించారు. తన మేనకోడలి పెళ్లికి 3 కోట్ల 21 లక్షల రూపాయల విలువచేసే కట్నకానుకలు చదివించుకున్నారు. వైరల్ గా మారిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. నాగౌర్ జిల్లాలో నివసిస్తున్న ఒక జాట్ కుటుంబం వారి మేనకోడలు వివాహానికి కనివీని ఎరుగని కానుకను సమర్పించుకున్నారు. ఇది చారిత్రకమైన, సరికొత్త రికార్డును క్రియేట్‌ చేసింది. ఈ విషయం తెలిసి స్థానికులు సైతం పెద్ద సంఖ్యలో వివాహవేదిక వద్దకు బారులు తీరారు.

రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాలోని బుర్డీ గ్రామంలో జరిగిన వివాహ వేడుక ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. గ్రామానికి చెందిన ఒక ధనిక వ్యవసాయ కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు హరేంద్ర, రామేశ్వర్, రాజేంద్రలు తమ మేనకోడలిపై ప్రేమను చాటుకున్నారు. వారి గ్రామంలో పాటించే మైరా సంప్రదాయాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మైరా సంప్రదాయం ప్రకారం మేనకోడలు లేదా మేనల్లుడి కోసం మేనమామలు బహుమతులు తీసుకెళ్లే ఆచారం ఉంది. ఇందులో భాగంగా వీరు కూడా తమ కోడలికి గతంలో ఎవరూ పెట్టని రీతిలో మైరాను అప్పగించారు. మైరాలో భాగంగా మేనకోడలి పెళ్లికి రూ.3.21 కోట్ల విలువ చేసే నగదు, ఆస్తులను కట్నంగా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇందులో 10 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.30 లక్షలు విలువ చేసే స్థలం, 41 తులాల బంగారం, 3 కిలోల వెండి, ట్రాక్టర్‌ నిండా ధాన్యం, స్కూటీ లతో పాటు రూ.80 లక్షల నగదును ముట్టజెప్పారు. దాంతో పాటు గ్రామంలోని ప్రతి ఇంటికి వెండి నాణెం కానుక ఇచ్చారు.

ఇక్కడ చారిత్రాత్మక మైరాను నింపే సంప్రదాయం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. గతంలో ఒక కుటుంబం మైరాలో భాగంగా 1 కోటి వరకు మేనమామలు సమర్పించారు. అయితే, ఇప్పుడు ఇచ్చిన మైరా పాత రికార్డులను బద్దలు కొట్టింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us
90 కేజీల నుంచి 45 కేజీలు తగ్గిన హీరోయిన్..
90 కేజీల నుంచి 45 కేజీలు తగ్గిన హీరోయిన్..
వేరుశనగ పొట్టును పారేస్తున్నారా? ఈ 7 అద్భుతమైన ఉపయోగాలు తెలిస్తే
వేరుశనగ పొట్టును పారేస్తున్నారా? ఈ 7 అద్భుతమైన ఉపయోగాలు తెలిస్తే
ఖాకీ ఓవర్ యాక్షన్.. న్యాయం కోసం వస్తే అడవిలో వదిలేసిన ఎస్సై..
ఖాకీ ఓవర్ యాక్షన్.. న్యాయం కోసం వస్తే అడవిలో వదిలేసిన ఎస్సై..
లక్ష్మీదేవిని దూరం చేసి దరిద్రాన్ని తెచ్చే పెద్ద తప్పు ఇదే!
లక్ష్మీదేవిని దూరం చేసి దరిద్రాన్ని తెచ్చే పెద్ద తప్పు ఇదే!
ఫేమస్ అయ్యేందుకు రోడ్లపై స్టంట్స్ చేస్తూ రెచ్చిపోయాడు..కట్‌చేస్తే
ఫేమస్ అయ్యేందుకు రోడ్లపై స్టంట్స్ చేస్తూ రెచ్చిపోయాడు..కట్‌చేస్తే
రూ.200 కోట్లకు పైగా ఆస్తులు.. సొంతంగా ప్రైవేట్ జెట్..
రూ.200 కోట్లకు పైగా ఆస్తులు.. సొంతంగా ప్రైవేట్ జెట్..
చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఐపీఎల్ హిస్టరీలోనే ఎవరికీ సాధ్యంకాదు..
చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఐపీఎల్ హిస్టరీలోనే ఎవరికీ సాధ్యంకాదు..
ఈద్ స్పెషల్ ధమాకా.. నోరూరించే మటన్ ధమ్ బిర్యానీ..
ఈద్ స్పెషల్ ధమాకా.. నోరూరించే మటన్ ధమ్ బిర్యానీ..
ఆరోజు విజయ్, నేను చనిపోయేవాళ్లం.. షాకింగ్ విషయం చెప్పిన విలన్
ఆరోజు విజయ్, నేను చనిపోయేవాళ్లం.. షాకింగ్ విషయం చెప్పిన విలన్
అరటి తొక్కతో అందం రెట్టింపు! ఇలా వాడితే వారం రోజుల్లోనే మిరాకిల్
అరటి తొక్కతో అందం రెట్టింపు! ఇలా వాడితే వారం రోజుల్లోనే మిరాకిల్