Health Care Tips: వేసవిలో వెల్లుల్లి ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే..! ఉదయం ఖాళీ కడుపుతో తినటం అలవాటు చేసుకోండి..!

Jyothi Gadda

Jyothi Gadda |

Updated on: Mar 18, 2023 | 5:53 PM

వెల్లుల్లి తీసుకోవడం వల్ల మీకు మేలు చేకూరుతుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను నయం చేస్తుంది. ఇది మీ ఆకలిని పెంచుతుంది. కొన్నిసార్లు మీ కడుపులో ఏర్పడే..

Health Care Tips: వేసవిలో వెల్లుల్లి ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే..! ఉదయం ఖాళీ కడుపుతో తినటం అలవాటు చేసుకోండి..!

వేసవిలో వెల్లుల్లి ప్రయోజనాలు: పప్పులు, కూరగాయలలో వెల్లుల్లిని వేసుకోవటం వల్ల వాటి రుచి నాలుగు రెట్లు పెరుగుతుంది. వెల్లుల్లి వాసన మీరు చేసే ఏదైనా ఆహారం రుచిని పెంచుతుంది. అయితే, పేదవాడి కస్తూరి అని కూడా పిలిచే ఈ వెల్లుల్లి మీ ఆహారానికి రుచిని పెంచడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందని మీకు తెలుసా. రెండు రెబ్బల వెల్లుల్లి మన శరీరాన్ని అనేక వ్యాధుల దాడి నుండి రక్షిస్తాయి. ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే, అది మన శరీరానికి అమృతంలా పనిచేస్తుంది. వెల్లుల్లిని ఆయుర్వేదంలో ఔషధ గుణాల గనిగా అభివర్ణించారు. వెల్లుల్లి తినడం ద్వారా ఎక్కువ కాలం యవ్వనంగా ఉండవచ్చని చెప్పారు. వెల్లుల్లితో మీరు అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. వెల్లుల్లి ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1. ఆకలిని పెంచడంలో సహాయపడుతుంది- ఆకలి లేక బాధపడుతుంటే, వెల్లుల్లి తీసుకోవడం వల్ల మీకు మేలు చేకూరుతుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను నయం చేస్తుంది. ఇది మీ ఆకలిని పెంచుతుంది. కొన్నిసార్లు మీ కడుపులో యాసిడ్ సమస్యలు తలెత్తినప్పుడు వెల్లుల్లిని తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్ ఏర్పడకుండా చేస్తుంది.

2. గుండె ఆరోగ్యంగా ఉంటుంది- కొన్నిసార్లు మీ ధమనులు వాటి ఫ్లెక్సిబిలిటీని కోల్పోతాయి. అప్పుడు వెల్లుల్లి వాటిని ఫ్లెక్సిబుల్‌గా మార్చడానికి చాలా సహాయపడుతుంది. ఇది ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ నుండి గుండెను రక్షించడంలో సహాయపడుతుంది. ఇందులోని సల్ఫర్ సమ్మేళనం రక్త కణాలు గడ్డకట్టకుండా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

3. ప్రతిరోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తినటం వల్ల మీ కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఇది గుండె పోటు ప్రమాదాలను తగ్గిస్తుంది. దీంతో పాటు వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో కూడా ఇది చాలా పనిచేస్తుంది. వాస్తవానికి వెల్లుల్లి యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.

4. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు దీన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. నిజానికి ఇందులో ఉండే యాంటీ డయాబెటిక్ లక్షణాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రభావవంతంగా పనిచేస్తాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu