Black Gold: రైతులకు ‘నల్లబంగారం’.. క్యాన్సర్, మధుమేహం సమస్యలకు గొప్ప వరం.. !

Jyothi Gadda

Jyothi Gadda |

Updated on: Mar 18, 2023 | 7:02 PM

గోధుమపిండితో చేసే చపాతీ అందరికీ తెలిసిందే. అయితే, మీరు ఎప్పుడైనా నల్ల గోధుమ పిండితో చేసిన చపాతీలు తిన్నారా? అవును, రైతుల నల్ల బంగారంగా పిలువబడే ఈ నల్ల గోధుమలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.

Black Gold: రైతులకు 'నల్లబంగారం'.. క్యాన్సర్, మధుమేహం సమస్యలకు గొప్ప వరం.. !
Black Wheat

నేడు ప్రపంచంలో వ్యవసాయ శాస్త్రం, బయోటెక్నాలజీ చాలా పురోగతిని సాధించాయి. ఈ రోజుల్లో మార్కెట్‌లో రకరకాల కూరగాయలు దొరుకుతాయి. పర్పుల్ క్యాబేజీ, బ్లాక్ రైస్, అనేక ఇతర రకాల హైబ్రిడ్ కూరగాయలు అందుబాటులోకి వచ్చాయి. అలాంటివి శరీరానికి సాధారణ కూరగాయల కంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మీరు చాలా రకాల గోధుమలను చూసి ఉంటారు. కానీ, మీరు ఎప్పుడైనా బ్లాక్ గోధుమల గురించి విన్నారా? సాధారణ గోధుమల కంటే నల్ల గోధుమలు ఎక్కువ ప్రయోజనకరమైనవి. నల్ల గోధుమలలో ఆంథోసైనిన్ వర్ణద్రవ్యం కారణంగా, దాని రంగు ముదురు రంగులో ఉంటుంది. సాధారణ గోధుమలలో దాదాపు 5 ppm ఆంథోసైనిన్ ఉంటుంది. అయితే నల్ల గోధుమలలో 100 నుండి 200 ppm ఉంటుంది. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సాధారణ గోధుమల కంటే నల్ల గోధుమలో 60 శాతం ఎక్కువ ఐరన్‌ ఉంటుంది.

బ్లాక్ వీట్ ప్రయోజనాలు

1. బ్లాక్ వీట్ గుండె, క్యాన్సర్, మధుమేహం, ఊబకాయం వంటి అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సాధారణ గోధుమలతో పోలిస్తే, జింక్ పరిమాణం తగినంత ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.

2. నేటి ఎప్పటికప్పుడు మారుతున్న వాతావరణంలో కీళ్ల నొప్పులు వేగంగా పెరుగుతున్నాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, బ్లాక్‌ వీట్‌ ఔషధ గుణాలు మోకాలి, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇది రక్తహీనత సమస్యను కూడా నయం చేస్తుంది. ఈ గోధుమలకు మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉంది.

ఇవి కూడా చదవండి

3. ఈ గోధుమల లాభదాయకత దృష్ట్యా, దీనిని ‘రైతుల నల్ల బంగారం’ అంటారు. మార్కెట్‌లో దీని ధర సాధారణ గోధుమల కంటే మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ. నల్ల గోధుమలను అక్టోబర్-నవంబర్ నెలలలో పండిస్తారు. దీని సాగు ఖర్చు చాలా తక్కువ. ఈ గోధుమలను పండించే రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu