AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Immunity Foods: హెచ్3ఎన్2 వైరస్‪తో పోరాడే ఇమ్యూనిటీ కావాలా? అయితే ఈ ఫుడ్స్ తినండి.. వైరస్‪లను తరిపికొడతాయి..

మన శరీరంలో వ్యాధి నిరోధకశక్తి మెండుగా ఉంటే ఎటువంటి వైరస్ వచ్చినా మన శరీరం తట్టుకోగలుగుతోంది. మరి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా? ఈ కథనం చదవండి..

Immunity Foods: హెచ్3ఎన్2 వైరస్‪తో పోరాడే ఇమ్యూనిటీ కావాలా? అయితే ఈ ఫుడ్స్ తినండి.. వైరస్‪లను తరిపికొడతాయి..
Immunity
Madhu
|

Updated on: Mar 18, 2023 | 5:30 PM

Share

సీజన్ మారుతోంది. నిన్నమొన్నటి వరకూ మంచు, చలితో దుప్పట్లో దూరిపోయిన ప్రజలు.. ఇకపై దుప్పటి వైపు కన్నెత్తి చూడరు. ఎందుకంటే మండే వేసవి ప్రవేశించి. ఈ సమయంలో ఇంకాస్త గాలి ఉంటే బావుండు.. ఇంకాస్త చల్లగా ఉంటే బావుండు అనే ఫీల్ ఉంటుంది. అందుకే ఏసీలకు, కూలర్లకు అంతా డిమాండ్. అయితే ఈ సమయంలో సీజనల్ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంటుంది. మారుతున్న కాలానుగుణంగా శరీరం పలు మార్పులకు లోనవుతుంది. అలాంటి సమయంలో మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి లేకపోతే ఇబ్బందులు తప్పవు. రకరకాల ఫ్లూ వైరస్ లు చుట్టుముట్టి శరీరాన్ని గుల్ల చేస్తాయి. ఆస్పత్రులకు పరుగులు పెట్టేలా చేస్తాయి. ఇటీవల కాలంలో హెచ్3ఎన్2 వైరస్ విపరీతంగా ప్రభలుతోంది. అయితే మన శరీరంలో వ్యాధి నిరోధకశక్తి మెండుగా ఉంటే ఎటువంటి వైరస్ వచ్చినా మన శరీరం తట్టుకోగలుగుతోంది. మరి వ్యాధి నిరోధక శక్తని పెంచుకోవడం ఎలా? సాధారణంగా మనం తీసుకునే ఆహారం వ్యాధి నిరోధక శక్తిని ప్రోత్సహిస్తోంది. సమతుల్య ఆహారంతో ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. వ్యాధి నిరోధక శక్తిని అమాంతం పెంచే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం..

గుడ్లు: ప్రొటీన్లు పుష్కలంగా ఉండే గుడ్లు మీ డైట్‌లో చేర్చుకోవడానికి ఉత్తమమైన ఆహారాలలో ఒకటి. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది.

విటమిన్ సి: విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం శరీరానికి అవసరమైన పోషకాలలో ఒకటి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఫారమ్ ఫ్లూతో బాధపడుతున్నప్పుడు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఆరెంజ్, ద్రాక్ష, కివి, ఎర్ర మిరియాల్లో విటమిన్ సి పుష్కలంగా ఉన్న కొన్ని ఆహార పదార్థాలు.

ఇవి కూడా చదవండి

పాలు, రసం, గ్రీన్ టీ : పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. గ్రీన్ టీ లోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పండ్ల రసాలలో కూడా అవసరమైన పోషకాలు ఉంటాయి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి ద్రవాలు ముఖ్యమైనవి.

ఆకుకూరలు: చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడరు. కానీ ఆకు కూరలు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. విటమిన్ ఎ, సి, ఇ, కెలను అందిస్తాయి. బ్రోకలీ కాల్షియం, పీచు వంటి పోషకాలకు ఒక పవర్‌హౌస్ లాంటిది.

అల్లం, వెల్లుల్లి: అల్లం, వెల్లుల్లి ఆహారానికి చాలా అవసరమైన జింగ్ రుచిని జోడిస్తాయి. దానితో పాటు, అల్లం వాపును నివారించడంలో సహాయపడుతుంది, అయితే వెల్లుల్లి కూడా అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..