Herbal Hair Oil : ఈ ఆయిల్‌తో జుట్టు రాలడం తగ్గి బాగా పెరుగుతుందట..!

ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ జుట్టు సంరక్షణకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రించడం ద్వారా జుట్టును అందంగా, మందంగా, బలంగా మార్చేస్తుంది.

Herbal Hair Oil : ఈ ఆయిల్‌తో జుట్టు రాలడం తగ్గి బాగా పెరుగుతుందట..!
Herbal Hair Oil
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 18, 2023 | 7:30 PM

జుట్టు మీ అందాన్ని పెంచుతుంది. కానీ నేటి జీవనశైలి, ఆహారపుటలవాట్లు, కాలుష్యం కారణంగా జుట్టు రాలడం అనేది సర్వసాధారణమైన సమస్యగా మారింది. దీనికి తోడు వెంట్రుకలు సరిగా పెరగకపోవడం, జుట్టు చిట్లిపోవడం వంటి సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టేందుకు ఇక్కడ ఒక చక్కటి హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి తెలుసుకుందాం..కొబ్బరి నూనె, కరివేపాకు, మెంతి గింజలు, ఆలివ్ గింజలు, మందార పువ్వులతో తయారు చేసిన ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ జుట్టు రాలే సమస్యకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ జుట్టు సంరక్షణకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రించడం ద్వారా జుట్టును అందంగా, మందంగా, బలంగా మార్చేస్తుంది.

హెర్బల్‌ హెయిర్‌ ఆయిల్ తయారీకి అవసరమైన పదార్థాలు

– ఒక ఇనుప పాన్ – కొబ్బరి నూనె – కరివేపాకు – మెంతులు – 1 టీస్పూన్ ఆలివ్ గింజలు – మందార పువ్వులు

హెర్బల్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలి?

– హెర్బల్ హెయిర్ ఆయిల్ చేయడానికి ముందుగా ఒక ఐరన్‌ పాన్ తీసుకోవాలి. – తర్వాత అందులో కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి. – దీని తర్వాత, వేడి నూనెలో కొన్ని కరివేపాకు ఆకులను వేసి, గ్యాస్ ఆఫ్ చేయండి. – తర్వాత మెంతి గింజలు, ఒక చిన్న చెంచా ఆలివ్ గింజలను కలపండి. – ఆ తర్వాత మందార పూలను కూడా వేసి కలపాలి. – తర్వాత రాత్రంతా అలాగే నిల్వ ఉంచుకోండి.

ఇవి కూడా చదవండి

హెర్బల్ ఆయిల్ తో మసాజ్ చేయడం ఎలా?

– హెర్బల్ హెయిర్ ఆయిల్ అప్లై చేసే ముందు ఆ నూనెను ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి. – తర్వాత అరచేతిలో నూనె తీసుకుని జుట్టుకు పట్టించి మసాజ్ చేయాలి. – మీ స్కాల్ప్ వెనుక భాగంలో కింది నుంచి పైకి మసాజ్ చేయండి. – మీ వేళ్లతో వృత్తాకారంలో మసాజ్ చేసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?