Dark Circles : కళ్లకింద నల్లటి వలయాలతో ఇబ్బందిపడుతున్నారా..! అయితే ఆలు ప్యాక్ ట్రై చేయండి.. చక్కటి ఫలితం మీ సొంతం..
Dark Circles : బంగాళాదుంపలను పిల్లల నుంచి పెద్దల వరకు అందరు ఇష్టపడుతారు. దీంతో అనేక రకాల వంటకాలు తయారు చేస్తారు.
Dark Circles : బంగాళాదుంపలను పిల్లల నుంచి పెద్దల వరకు అందరు ఇష్టపడుతారు. దీంతో అనేక రకాల వంటకాలు తయారు చేస్తారు. ప్రతి ఇంట్లో ఉండే బంగాళాదుంప మీ ముఖం సమస్యలను తొలగిస్తుందని మీకు తెలుసా..? అవును ఇది నిజం. బంగాళాదుంపను ఉపయోగించడం ద్వారా మీ నలుపు రంగు ముఖాన్ని చాలా వరకు క్లియర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మీ ముఖం మీద ముడతలు, నలుపు రంగుతో బాధపడుతుంటే ఉడికించిన బంగాళాదుంప ఫేస్ ప్యాక్ మీకు చాలా ఉపయోగపడుతుంది. దీని కోసం ఉడికించిన బంగాళాదుంపను పేస్ట్‌లా చేసి, ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ క్రీమ్ కలపాలి. తరువాత ఈ ఫేస్ ప్యాక్ ను ముఖం మీద సుమారు 15 నిమిషాలు అప్లై చేయాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇలా ఈ ప్యాక్‌ను వారానికి రెండు రోజులు చేయండి. జిడ్డుగా ఉన్న మీ చర్మం పట్టులా మెరుస్తుంది.
2. మొటిమల కోసం: మీ ముఖం మీద మొటిమల సమస్య ఉంటే మీరు ఉడికించిన బంగాళాదుంపలను బాగా రుబ్బుకోవాలి. దానిని ఫేస్ ప్యాక్ లాగా ముఖం మీద అప్లై చేయాలి. దీంతో ముఖం రంధ్రాలపై పేరుకుపోయిన ధూళి కూడా బయటకు వస్తుంది. వారానికి రెండుసార్లు ప్రయత్నించవచ్చు. చాలా మంచి ఫలితాలను పొందుతారు.
3. మచ్చలు తొలగించడానికి : ముఖంపై ఉన్న మచ్చలను తొలగించడానికి బంగాళాదుంప, పసుపు ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించండి. దీని కోసం సగం బంగాళాదుంపను తరుముకోవాలి దానికి ఒక చిటికెడు పసుపు వేసి మెడ నుంచి ముఖానికి అప్లై చేసి అరగంట పాటు ఆరనివ్వాలి. తరువాత ముఖాన్ని సాధారణ నీటితో శుభ్రం చేయండి. ఈ ప్యాక్ రోజువారీ వాడకంతో ముఖం రంగు కూడా స్పష్టంగా తెలుస్తుంది.
4. కళ్ల కింద నల్లటి వలయాలు : కళ్ల కింద నల్లటి వలయాలు ఉంటే చూడటానికి అసహ్యంగా ఉంటుంది. ముడి బంగాళాదుంప ముక్కలను మీ కళ్ళపై ఉంచండి. ఇది కాకుండా మీరు కళ్ళ చుట్టూ బంగాళాదుంప రసాన్ని వర్తింపజేయాలి. దీంతో నల్లటి వలయాలు కనిపించవు. అంతేకాదు కళ్ళ చుట్టూ ఉండే వాపు కూడా తగ్గుతుంది.