World Travel and Tourism Festival 2025: గ్లోబల్ టూరిజం రేంజ్‌ని మార్చేసిన భారత పర్యాటకులు
గ్లోబల్ ట్రావెల్ టూరిజం రేంజ్‌ని భారత పర్యాటక ప్రియులు సమూలంగా మార్చేస్తున్నారు. విదేశీ పర్యటనలకు వెళ్లే భారత టూరిస్టుల సంఖ్య గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరిగింది. ఆ మేరకు గ్లోబల్ టూరిజం ద్వారా వస్తున్న ఆదాయం చాలా రెట్లు పెరిగింది. విదేశీ పర్యాటక రంగంలో మారిన ట్రెండ్‌కు టీవీ9 నెట్‌వర్క్ ఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమం అద్దంపట్టనుంది.

న్యూఢిల్లీ: విదేశీ టూరిజం పట్ల భారతీయ పర్యాటక ప్రియుల్లో మక్కువ పెరుగుతోంది. ఓ రకంగా భారతీయ పర్యాటకులు గత కొన్నేళ్లుగా ప్రపంచ పర్యాటక రంగ స్వరూపాన్నే మార్చేశారు. ఆదాయం పెరగడం, కొత్త ప్రదేశాలను సందర్శించాలన్న ఆసక్తి పెరగడంతో ఏటా లక్షలాది మంది విదేశాల్లోని పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఒకటిగా పర్యాటక రంగం నిలుస్తోంది. భారతీయ పర్యాటకులు విదేశాల్లోని పర్యాటక స్థలాలను సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ట్రెండ్ కారణంగా గ్లోబల్ టూరిజం ఆర్థిక విలువ గణనీయంగా పెరిగింది.
ఈ నేపథ్యంలో TV9 నెట్‌వర్క్, రెడ్ హట్ కమ్యూనికేషన్స్ సంయుక్తంగా ఫిబ్రవరి 14 నుండి 16, 2025 వరకు న్యూఢిల్లీలో వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం ఫెస్టివల్ 2025 (World Travel and Tourism Festival 2025) నిర్వహించనుంది. గ్లోబల్ టూరిజంలో గత కొన్నేళ్లలో చోటు చేసుకున్న మార్పులు, తాజా ట్రెండ్‌కు ఇది వేదిక కానుంది. అలాగే టూరిజం రంగంలో భవిష్యత్తులో రానున్న కొత్త ఆవిష్కరణలు, మార్పులకు ఇది అద్దంపట్టనుంది.
భారతీయ పర్యాటకుల పెరుగుదల
ట్రావెల్, టూరిజం రంగాల వృద్ధికి కారణమైన ముఖ్య అంశాలను ఈ కింది ట్రెండ్స్ హైలైట్ చేస్తాయి. TV9 నెట్‌వర్క్ నిర్వహించే భారత్‌లో వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం ఫెస్టివల్ ఈ రంగంలో భారత్‌లో పెరిగిన అవకాశాలు, ప్రాధాన్యతకు అద్దంపట్టనుంది. ఈ రంగానికి చెందిన ఔత్సాహికులు, పర్యాటక రంగ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
1. పోస్ట్-పాండమిక్ స్థాయి..
విదేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య 85 శాతం పెరిగింది. ఇది ప్రపంచ పర్యాటక రంగం గణనీయంగా పుంజుకోవడానికి దోహదపడుతోంది. టీవీ9 నెట్‌వర్క్ నిర్వహించే కార్యక్రమం గ్లోబల్ టూరిజంలో లేటెస్ట్ ట్రెండ్‌పై లోతుగా పరిశీలన చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రదేశాలు భారతీయుల ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎలా మారుతున్నాయో విశ్లేషించనుంది.
2. ఎక్కువగా ఖర్చు చేసేవారు, కుటుంబపరమైన ట్రావెల్
భారతీయ పర్యాటకులు ఒక్కో విదేశీ పర్యటనకు సగటున USD 1,200 ఖర్చు చేస్తున్నారు. ఇది భారతీయ పర్యాటకుల్లో గణనీయంగా పెరిగిన వ్యయ శక్తికి అద్దంపడుతోంది. విదేశీ పర్యటనలకు వెళ్లే వారిలో 60 శాతం కంటే ఎక్కువ మంది కుటుంబపరమైన పర్యటనలు చేస్తున్నారు. దీంతో వీరి కోసం వసతులు, పిల్లలకు ఆకర్షణీయమైన అంశాలకు డిమాండ్ పెరుగుతోంది. దీని ద్వారా సాంస్కృతిక అంశాలకు కూడా ప్రాధాన్యత ఏర్పడుతోంది. టీవీ9 నిర్వహించనున్న కార్యక్రమం విదేశీ పర్యటక ప్రాంతాల్లో తమకు అనుకూలమైన వాటిని ఎంచుకునేందుకు భారత పర్యాటకులకు దోహదపడుతుంది.
3. మిలీనియల్స్ మొదలు Gen Z వరకు..
విదేశీ పర్యటనలు చేస్తున్న భారతీయ పర్యాటకుల్లో మిలీనియల్స్ , Gen Zకు చెందిన వారే 50 శాతం మంది ఉన్నారు. వీరు తమ విదేశీ పర్యటనలను ప్లాన్ చేసేందుకు, బుకింగ్ చేసేందుకు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై ఎక్కువగా ఆధారపడతున్నారు. టీవీ9 నిర్వహించే కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ట్రావెల్ టెక్ జోన్‌లో డిజిటల్ నైపుణ్యం కలిగిన పర్యాటకులు తమ ప్రయాణ అనుభవాలను మెరుగుపరచడానికి రూపొందించిన అత్యాధునిక సాధనాలు, ఆవిష్కరణల గురించి తెలుసుకుంటారు. అలాగే పర్యాటక రంగంలోని తాజా AI ఆధారిత స్మార్ట్ ట్రావెల్ టెక్నాలజీల గురించి కూడా పర్యాటకులు తెలుసుకోవచ్చు.
4. లగ్జరీ, వెల్నెస్ ట్రెండ్స్
భారతదేశంలో లగ్జరీ ప్రయాణ వ్యయం 12 శాతం పెరిగింది. ప్రైవేట్ ఏవియేషన్, వెల్‌నెస్‌పై పెరుగుతున్న ఆసక్తి దీనికి కారణమవుతున్నాయి. టీవీ9 టూరిజయం ఫెస్టివల్‌లో ప్రీమియం ప్రయాణ సేవలు, వెల్‌నెస్ అనుభవాలు, అత్యాధునిక వసతి సౌకర్యాలకు సంబంధించిన వివరాలు అందించే ఎగ్జిబిటర్‌లు ఉంటారు. పర్యాటకులు సర్వీస్ ప్రొవైడర్లతో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు, వెంటనే బుకింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

World Travel and Tourism Festival 2025
వరల్డ్ ట్రావెల్, టూరిజం ఫెస్టివల్ ప్రాముఖ్యత
టీవీ9 నెట్‌వర్క్ నిర్వహించే ఈ కార్యక్రమం.. విదేశీ పర్యాటక ఆకాంక్షలు కలిగిన భారతీయుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు దోహదపడుతుందని టీవీ9 చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ అమిత్ త్రిపాఠి తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రియులకు తమ ఆఫర్‌లను ట్రావెల్ టూరిజం సంస్థలు ప్రదర్శించేందుకు ఇది సరైన వేదిక అవుతుందన్నారు.




