Uttarakhand: ఉత్తరఖండ్‌లో ఈ 3 ప్రదేశాలు పర్యాటకులకు బెస్ట్.. ప్రకృతి ఒడిలో ఎంజాయ్ చేయొచ్చు..
Uttarakhand: దైనందిన జీవితంలో నిరంతర పని ఒత్తిడి వల్ల అలసట తప్పదు. నిత్యం రణగొన ధ్వనుల మధ్య బతికే పట్టణవాసులు ప్రకృతి ఒడిలో సేదతీరాలని అనుకుంటారు.
Uttarakhand: దైనందిన జీవితంలో నిరంతర పని ఒత్తిడి వల్ల అలసట తప్పదు. నిత్యం రణగొన ధ్వనుల మధ్య బతికే పట్టణవాసులు ప్రకృతి ఒడిలో సేదతీరాలని అనుకుంటారు. అటువంటి వారికి ఉత్తరాఖండ్ చక్కటి ప్రదేశం. ఈ ప్రాంతం ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. దేవతల భూమి గా ప్రసిద్ధి కెక్కిన ఉత్తరాఖండ్ భూమి పై స్వర్గంగా విలసిల్లుతూ ప్రపంచ సుందర దృశ్యాల కు నెలవై వుంది. ఇక్కడి ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు మంచి అనుభూతిని మిగులుస్తాయి. ఇక్కడికి వెళ్లిన వ్యక్తులు కచ్చితంగా చూడాల్సిన 3 ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
1. లాన్స్‌డౌన్ ఈ హిల్ స్టేషన్ ఉత్తరాఖండ్ లోని పౌరి జిల్లాలో ఉంది. ఇది ప్రశాంతతకు, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. ఇక్కడ మీరు అందమైన బుల్లా సరస్సు ఒడ్డున సరదాగా సేద తీరవచ్చు. ప్రసిద్ధ సెయింట్ జాన్స్ చర్చిని సందర్శించవచ్చు. నగరం విశిష్ట వృక్షజాలం, జంతుజాలాలను అన్వేషించడానికి అడవికి వెళ్లవచ్చు. ఇది కాకుండా ఇక్కడ కలగఢ్ టైగర్ రిజర్వ్, దర్వాన్ సింగ్ మ్యూజియాన్ని సందర్శించవచ్చు.
2. ధనౌల్తి ధనౌల్లి ఉత్తరఖండ్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యాటక కేంద్రం. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ధనౌల్తి అనేది ఉత్తరాఖండ్‌లోని టెహ్రీ గర్హ్వాల్ జిల్లాలో ఉన్న ఒక చిన్న హిల్ స్టేషన్. మీరు సాహస కార్యకలాపాలు చేయాలనుకుంటే ఈ ప్రదేశం చక్కగా సూటవుతుంది. వారాంతంలో సందర్శించాలనుకునే వారికి ఇది చక్కటి ప్రదేశం. ఇక్కడ మీరు దేవగఢ్ కోట, ఎకో పార్క్, సుర్కంద దేవి ఆలయం, దశావతార్ దేవాలయం, కౌరియా ఫారెస్ట్ వంటివి సందర్శించవచ్చు.
3. కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో ఉన్న కార్బెట్ నేషనల్ పార్క్ భారతదేశంలోని పురాతన జాతీయ ఉద్యానవనం. అంతరించిపోతున్న బెంగాల్ పులిని రక్షించడానికి ఇది దీనిని1936 లో స్థాపించారు. ఇక్కడ మీరు రకరకాల వన్యప్రాణులను చూడవచ్చు. ఏనుగు సవారీ చేయవచ్చు. ఇంకా మనోహరమైన కార్బెట్ మ్యూజియం, కార్బెట్ ఫాల్స్ సందర్శించవచ్చు.