ఇండియాలో ఈ 5 ప్రదేశాలు మంచి పర్యాటక కేంద్రాలు..! ప్రతి ఒక్కరూ చూడదగినవి..
Best Places: భారతదేశంలోని అన్ని ప్రాంతాలను సందర్శించాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ అది కొంతమందికే సాధ్యం అవుతుంది. మీరు మొదటిసారిగా
Best Places: భారతదేశంలోని అన్ని ప్రాంతాలను సందర్శించాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ అది కొంతమందికే సాధ్యం అవుతుంది. మీరు మొదటిసారిగా పర్యటనకు వెళితే ఇండియాలో ఈ 5 ప్రదేశాలను అస్సలు మిస్ కావొద్దు. ఎందుకంటే ఈ ప్రదేశాలు మీకు సరికొత్త అనుభూతిని ప్రసాదిస్తాయి. అంతేకాదు వీటిని సందర్శించిన తర్వాత మీలో కచ్చితంగా మార్పు కనిపిస్తుంది. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.
1.తాజ్ మహల్ మీరు తాజ్ మహల్ చూస్తే చాలా అనుభూతికి లోనవుతారు. ప్రేమకు చిహ్నం తాజ్ మహల్. మీరు ఇండియాలో ఉండి తాజ్‌మహల్‌ని అస్సలు మిస్ కావొద్దు.
2. వారణాసి వారణాసి ఒక ప్రాచీన నగరం. ఇక్కడ పవిత్ర గంగా నది ప్రవహిస్తుంది. ఈ నది ఒడ్డున కూర్చొని ఆలోచిస్తే ప్రపంచంలోని అన్ని కష్టాలు చిన్నవిగా కనిపిస్తాయి. అధ్యాత్మికతకు నెలవు వారణాసి. ఇక్కడి వాతావరణం మిమ్మల్ని పునరాలోచించేలా చేస్తుంది.
3. బోధగయ బోధ్‌గయలో బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందాడు. ఇది బీహార్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ మహాబోధి ఆలయ సముదాయంలో బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందిన చెట్టు ఇప్పటికీ అలాగే ఉంది. అతని గౌరవార్థం ఒక దేవాలయం కూడా ఉంటుంది.
4. జైపూర్ జైపూర్ పింక్ సిటీగా గుర్తింపు సాధించింది. ఇక్కడి కోటలను చూస్తే మీరు మాయాలోకానికి వెళ్లినట్లుగా అనిపిస్తుంది. ప్రతి కట్టడానికి ఒక చరిత్ర ఉంటుంది.
5. హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్‌లో చాలా ప్రదేశాలు అద్భుతంగా ఉంటాయి. సిమ్లా, ధర్మశాల, కుఫ్రి, కసోల్, డల్హౌసీ మొదలైన ప్రదేశాలు ఉంటాయి. ఇక్కడ దొరికే యాపిల్స్ చాలా ప్రత్యేకమైనవి. అంతేకాదు ఇక్కడి ప్రజల ఆహార శైలి కూడా వెరైటీగా ఉంటుంది. ఎత్తైన ప్రదేశంలో రిసార్టులు, హోటళ్లు ఉంటాయి. మీ కిటికీ తెరిచి చూస్తే మీరు ఆకాశంలో ఉన్నట్లు అనిపిస్తుంది.
6. పశ్చిమ కనుమలు పశ్చిమ కనుమలు ఆరు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఎక్కువగా అటవీ ప్రాంతం. ట్రెక్కింగ్‌కి పెట్టింది పేరు. విశ్రాంతి తీసుకోవడానికి, ప్రశాంతంగా ఉండటానికి ఈ ప్రదేశం అనుకూలమైనది. నదులు, ప్రకృతి ఉద్యానవనాలు ఎక్కువగా ఉంటాయి.